
పెన్సిల్వేనియా : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండమెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా పెన్సిల్వేనియాలోని హ్యారిస్ బర్గ్‌లో ప్రవాసాంధ్రులు విజయోత్సవ సభ నిర్వహించారు. రాజన్న రాజ్యం కంటే ఇంకా అద్భుతంగా వైఎస్ జగన్ పరిపాలిస్తారని ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
పెన్సిల్వేనియా వైఎస్సార్‌సీపీ రీజినల్ ఇంచార్జి శనివరుపు వెంకటరామి రెడ్డి(ఎస్వీఆర్ రెడ్డి), వైఎస్సార్‌సీపీ అమెరికా స్టూడెంట్ వింగ్ యూత్ కన్వీనర్, హ్యారిస్ బర్గ్ సిటీ ఇంచార్జి సాత్విక్ రెడ్డి గోగులమూడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పించి రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హ్యారిస్ బర్గ్ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి సునంద రెడ్డి, మల్లికార్జున రెడ్డి కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి గాదె, తేజ బంక (బంటీ), బాబా సొంత్యాన, బసవ శంకర్, రాజశేఖర్ రెడ్డి నరెడ్ల, ప్రవీణ్ రెడ్డి పట్టేంగురు, సత్య రెడ్డి ఏడెం, పెన్సిల్వేనియా వైఎస్సార్‌సీపీ హ్యారిస్ బర్గ్ కమిటీ మెంబెర్లు రఘు కటం, పురుషోత్తం రెడ్డి కొమ్మిరెడ్డి, వంశి కృష్ణ రెడ్డి, రవీందర్ రెడ్డి, సమంత్, సిద్ధార్ధ, వీర, ప్రకాష్‌లతోపాటూ వైఎస్సార్‌సీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి వర్జీనియా నుండి శశాంక్ రెడ్డి, కిరణ్ ఎల్వీ, డెలావేర్ నుండి అంజిరెడ్డి, నవీన్, ఫిలడెల్ఫియా నుండి మధు గొనిపాటి, అల్లెన్ టౌన్ నుండి లక్ష్మి నరసింహ రెడ్డి కొండా, లక్ష్మి నరసింహ దొంతిరెడ్డి హాజరయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వీడియో మెసేజ్ పంపించి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రసాద్ వీ పొట్లూరి(పీవీపీ) అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పి వారికి శుభాకాంక్షలు తెలియచేశారు. అమెరికాలో ఉన్న వారు ఏ రకంగా ప్రభుత్వానికి సహాయపడగలరో వివరించారు. వైఎస్సార్‌సీపీ కోర్ కమిటీ మెంబెర్స్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. హ్యారిస్ బర్గ్ తెలుగు అస్సోస్సీయెషన్ (హెచ్‌టీఏ) ప్రెసిడెంట్ సామ్ ఎల్లంకి, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment