- టీడీపీ ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ
- తానా మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎన్ఆర్ఐ యుఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం ప్రజలకు, ఓటర్లకు క్షమాపణ చెప్పాలి.
- ఓటర్లను కొనుగోలు చేయవచ్చనే వ్యాఖ్యలు కోమటి జయరాం చేయడం ఎన్ఆర్ఐ లందర్ని ప్రజల దృష్టిలో చులకన చేయడమే అవుతుంది.
- చాలా మంది ఎన్ఆర్ఐలు ప్రజలు,వారి ప్రాంతం కోసం పనిచేస్తున్నారు.ఇలాంటి వ్యాఖ్యలు ఎన్ ఆర్ ఐ వ్యవస్ధను కించపరుస్తాయి.
- జగన్ గారిలాగా ప్రజల హృదయాలు గెలుచుకుని ఓట్లడగాలి కాని డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలని చూడటం సరికాదు.
- టీడీపీ ఎన్ఆర్ఐ కోర్డినేటర్ గా పనిచేస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజలలో తిరిగి ఓట్లడగాలి.
- ఎన్ఆర్ఐలు అంటే కోట్లు,లక్షలు తెచ్చి పంచి ఓట్లు కొనేవారిలా అపోహలు పెంచకండి. ఎన్ఆర్ఐ వ్యవస్ధను దెబ్బతీయకండి.
తాడేపల్లి: ఓటర్లను వెధవలు అని టీడీపీ ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే అని తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ తప్పుపట్టారు. ఓ ఎన్ఆర్ఐగా కోమటి జయరాం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఓటర్లను కొనుగోలు చేయవచ్చనే తానా మాజీ అధ్యక్షుడు, టిడిపి ఎన్ ఆర్ ఐ యుఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం వ్యాఖ్యలు ఎన్‌ఆర్‌ఐ లందర్ని ప్రజల దృష్టిలో చులకన చేయడమే అవుతుందని. ఈ విషయంలో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతోపాటు కోమటి జయరాం ప్రజలకు, ఓటర్లకు క్షమాపణ చెప్పాలని తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి కోమటి జయరాం వ్యాఖ్యలు చూసి షాక్ తిన్నాను.
తానా లాంటి వాటికి అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు.సేవ చేయాలంటే ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరవచ్చు. గ్రామాలను అభివృధ్ది చేయాలనే ధ్యేయంతో ఎన్ఆర్ఐలు పనిచేస్తుంటాం. ఓటర్లను వెధవలు అని అవమానకర రీతిలో మాట్లాడటం బాగాలేదన్నారు. జయరాం గారు ఆయన ఉన్న పార్టీ ఓటర్లకు,ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుందనే రీతిలో పనిచేయాలి. అంతేకాని ఓటర్లను కొనుగోలు చేయవచ్చనే ఆలోచనలు ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బతీస్తాయని అన్నారు.అమెరికాలాంటి దేశాలనుంచి వచ్చి కోట్ల రూపాయలు పెట్టి ఓట్లు కొంటాం అనే మాట చాలా గర్హనీయం.
ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.అదే విధంగా జగన్ గారిపై రాయి దాడిని అందరూ ఖండించాలన్నారు.పేదల పెన్నిధిగా పేరు తెచ్చుకుంటున్న జగన్ గారి మీది రాయి వేయడం అంటే పేదవాడి గుండెపై వేసిన రాయి అన్నారు. కోమటి జయరాం వ్యాఖ్యలను టీడీపీ అద్యక్షుడు చంద్రబాబు ఎలా ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. జయరాం గారు మీ దగ్గర డబ్బులు ఉంటే ప్రజలకు సేవచేసి అభిమానం పొందండి అంతేగాని వారు అమ్ముడుపోయేవారు అనేరీతిలో వ్యాఖ్యలు చేయవద్దని హితవు చెప్పారు.
నేను తానాలో పనిచేసినప్పుడు భారతదేశంలో ఏపిలో మారుమూల గ్రామాలలో టచ్ చేసాం.చాలా సేవాకార్యక్రమాలు చేశాం. అయితే నేను ఇన్ స్పైర్ అయింది మాత్రం జగన్ గారు ఓ కలగని ఆ కలను నెరవేర్చి ప్రజలకు ఎంతో మేలు చేశారు. అదే గ్రామసచివాలయాలు, వాలంటీర్ వ్యవస్ద.1.30 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించడంతోపాటు లక్షలాదిమందిని సేవాభావంతో పనిచేసేలా వాలంటీర్లను తీర్చిదిద్దారు. సీఎం జగన్ గారు పెట్టిన వాలంటీర్ల వ్యవస్ధ ఎంతో బాగా పనిచేస్తోెందని అన్నారు. ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నవరత్నాలు,వాలంటీర్ల వ్యవస్ధ అని చెబుతున్నపుడు చాలా విమర్శలు చేశారు. కాని జగన్ గారు ధైర్యంగా ఆ వ్యవస్ధను నెలకొల్పారు. సంక్షేమ పధకాలను గడప వద్దకు తీసుకువెళ్లారు. పరిపాలనను అంటే ప్రజలకు కావాల్సిన సర్టిఫికేట్లు అందిస్తున్నారు.
65 లక్షలమందికి వృధ్దులకు,వితంతువులకు పెన్సన్లు అందించడం కోవిడ్ లాంటి సంక్షోభంలో ప్రజలకు ధైర్యం కలిగించి వారిలో ఆత్మస్దైర్యం నింపారు. అండగా నిలబడ్డారు. ఒక దేశం బాగుపడాలంటే పేదలకు ప్రభుత్వాలు అండగా నిలబడాలి. అదే జగన్ గారు చేస్తున్నారు.వారికి ఉపాధి కల్పించడంతోపాటు అదే సమయంలో విద్య,వైద్యం విషయంలో మెరుగైన పధకాలు అందిస్తున్నారు. మాది రేపల్లె దగ్గర గ్రామంలో ప్రత్యక్షంగా చూశాను. జగన్ గారి పధకాలు పేదవారిలో ధైర్యం నింపుతున్నాయి. ఆరోగ్యవంతంగా ప్రజలు ఉన్నప్పుడే సమాజం అన్ని విధాలా వృధ్ది సాధిస్తుందనే అంశాన్ని నమ్ముతాను. అందుకే తాను వైఎస్సార్‌సీపీలో భాగస్వామినయ్యానని వివరించారు. మా ప్రభుత్వ పథకాలు అందితేనే నాకు, నా పార్టీకి ఓటు వేయండి అని అడుగుతున్న దమ్మున్ననేత సీఎం జగన్ గారు అని అన్నారు
Comments
Please login to add a commentAdd a comment