వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వానియాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక కారు డ్రైవర్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆశ్చర్యకరంగా పక్కన ఉన్న బిల్డింగ్ రెండో అంతస్తులోకి దూసుకెళ్లాడు. కారు పరిమాణంలో బిల్డింగ్ పైభాగంలో పెద్ద రంధ్రం కూడా పడింది. వెంటనే ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి కారును, కారు డ్రైవరును జాగ్రత్తగా కిందకు దించారు.
బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన కారు దృశ్యాలు, శిధిలమైన బిల్డింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. పెన్సిల్వానియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారును 20 ఏళ్ల యువకుడు డ్రైవింగ్ చేస్తున్నాడని ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అతడు అక్కడికి సమీపంలోనే ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని అన్నారు. అతడు కోలుకుంటేగానీ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందో తెలియదన్నారు. మాకైతేలండి యాక్సిడెంట్ కాదేమో అనిపిస్తున్ది అన్నారు.
ఇదిలా ఉండగా స్థానికులు మాత్రం దగ్గర్లోని కల్వర్టు వద్ద ఓవర్ స్పీడింగ్ వలన రైలింగును ఢీకొని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆ కారణంతోనే కారు గాల్లోకి లేచి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలను చూసినవారంతా కారును స్పైడర్ మ్యానో, సూపర్ మ్యానో డ్రైవింగ్ చేసి ఉంటారని కొందరు, గాల్లో వెళ్లడమంటే ఇదేనేమో అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని మరి కొందరు మానవతా దృక్పధంతో కూడా కామెంట్లు చేస్తున్నారు.
A driver has been taken to hospital after crashing a car into the second story of a house in Pennsylvania.
— Pop Crave (@PopCrave) August 8, 2023
State Police say investigators believe it wasn’t an accident. pic.twitter.com/D2U5P0fQMn
ఇది కూడా చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment