అమ్మాయి కోసం అన్నను చంపేశాడు | Teenager shoots brother dead 'because they both wanted the same girl' | Sakshi
Sakshi News home page

అమ్మాయి కోసం అన్నను చంపేశాడు

Published Sat, Apr 2 2016 11:17 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

అమ్మాయి కోసం అన్నను చంపేశాడు - Sakshi

అమ్మాయి కోసం అన్నను చంపేశాడు

ఒక్కటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము.... అని ఓ సినీ గేయ రచయిత తాను రాసిన పాట ద్వారా సెలవిచ్చాడు. అచ్చం అలాగే ఒకే అమ్మాయిని అన్నదమ్ములు ఇద్దరు ప్రేమించారు. ఆమె నాకు కావాలి అంటే నాకు కావాలి అని పోటీ పడ్డారు. ఆ క్రమంలో ఒకరు మృత్యు ఒడిని చేరుకున్నారు. ఈ సంఘటన యూఎస్ పెన్సిల్వేనియాలోని దుపిన్ కౌంటీలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న డకొటా త్రాంటన్ (15), డొమినిక్ (18) సోదరులు. ఈ ఇద్దరు ఒకే అమ్మాయిపై మనస్సు పడ్డారు.

ఆమె ప్రేమను పొందేందుకు రెడీ అయ్యారు. దీంతో ఇద్దరు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు డొమినిక్ను డకొటా చంపేశాడు. ఈ హత్య కేసులో డకొటాను పోలీసులు అరెస్ట్ చేశారు. నా సోదరుడిని నేనే హత్య చేశాను....అని పదే పదే పోలీసుల ఎదుట చెప్పాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ కేసులో డకొటాకు పెద్ద శిక్ష పడే అవకాశం ఉందని న్యాయమూర్తులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement