shoot dead
-
అనుమానంతో కూతుర్ని కాల్చి చంపిన తండ్రి
వాషింగ్టన్: ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఇంట్లోని అలారం మోగడంతో ఎవరో ఆగంతకులు చొరబడ్డారని ఆమె తండ్రి కాల్పులు జరిపాడు. కాసేపటి తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా తన కూతరు జానే హెయిర్స్టన్ అక్కడ పడిపోయిఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఈ ఘటనపై బుధవారం ఉదయం 4:30గంటల ప్రాంతంలో ఆమె తల్లి అత్యవసర సేవలకు కాల్చేసి తెలియజేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అత్యవసర బృందం సాయంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ హెయిర్స్టన్ చికిత్స పొందుతూ 5:42 గంటల ప్రాంతంలో మరణించినట్లు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చైనా జెట్ విమానాలు కొన్న పాక్) -
తనపై ఉమ్మిపడిందని వాగ్వాదం.. క్షణికావేశంలో..
పట్నా(బిహార్): క్షణికావేశంలో జరిగే సంఘటనలు ఒక్కొసారి వ్యక్తుల ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుంటాయి. ఇలాంటి సంఘటనలు మనం వార్తలలో చదువుతుంటాం. ఇలాంటి ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సివాన్జిల్లాలోని పోఖ్రాప్రాంతంలో అహ్సాన్ మాలిక్ అనేవ్యక్తి.. వీధిలో బట్టల వ్యాపారం చేస్తుండేవాడు. అదే ప్రాంతంలో.. రెండో అంతస్థులో తన మిత్రులతో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో ఒకరోజు తన ఇంట్లోని బాల్కని ఉన్న కిటికీ నుంచి అనుకోకుండా పాన్తిని కిందకు ఉమ్మివేశాడు. అది కాస్త.. కింద నిలబడిన ఒక వ్యక్తిపై పడింది. అతను కోపంతో ఊగిపోయి.. అహ్సాన్ ఇంటికి వెళ్లాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా క్షణికావేశంలో అహ్సాన్ మాలిక్‌ను కాల్చిచంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, బుల్లెట్ శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: హరియాణా ఆవిర్భావ దినోత్సవం: ఖైదీలకు సీఎం ఖట్టర్ తీపికబురు -
పట్టపగలు నడిరోడ్డుపై మేయర్ దారుణహత్య
పాట్నా: సమావేశం ముగించుకుని ఇంటికి వెళ్తున్న మేయర్‌ను బైక్‌పై వెంబడించిన దుండగులు ఓ చౌరస్తాకు చేరుకోగానే అడ్డగించి తుపాకీతో కాల్పులు జరిపారు. మూడు రౌండ్లు ఛాతీపై చేయడంతో ఆ మేయర్ కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ మేయర్ శుక్రవారం కన్నుమూశారు. పట్టపగలే ఈ సంఘటన జరగడం బిహార్‌లోని కఠిహార్‌లో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కఠిహార్ మేయర్ శివరాజ్ పాశ్వాన్ (40) గురువారం ఓ సమావేశం ముగించుకుని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో కొందరు దుండగులు ఆయనను బైక్‌లపై వెంబడించారు. సంతోశీ చైక్‌కు చేరుకోగానే దుండగులు ముందుకు వచ్చి శివరాజ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల సహాయంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కఠిహార్‌లోనే పేరుమోసిన గూండా గుడ్డు మియాను హత్య చేసిన కొన్ని గంటల్లోనే మేయర్ కూడా హత్యకు గురి కావడంతో రెండు హత్యలు చేసింది ఒకటే గ్యాంగ్ అని తెలుస్తోంది. హత్యకు ముందు ఏం జరిగిందో పోలీసులు తెలుసుకుంటున్నారు. నిందితులను పట్టుకునేందుకు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. అయితే ఆ గూండా, మేయర్ హత్యకు కారణం రియల్ ఎస్టేట్ వ్యవహారాలే కారణమని సమాచారం. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మేయర్ హత్య రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. -
యువ ఎమ్మెల్యేపై బుల్లెట్ల వర్షం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే సత్యజిత్ విశ్వాస్(37)ను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. నదియా జిల్లాలోని ఫూల్బరిలో శనివారం సరస్వతి పూజా కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విశ్వాస్ వెంట రాష్ట్ర మంత్రి రత్న ఘోష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరీశంకర్ దత్తా ఉన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత వేదిక దిగుతుండగా కొందరు చాలా సమీపం నుంచి కాల్పులు జరపడంతో విశ్వాస్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. క్రిష్ణాగంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విశ్వాస్‌కు ఇటీవలే వివాహమైంది. ఆయన హత్య వెనక బీజేపీ, తమ పార్టీ మాజీ నాయకుడు ముకుల్ రాయ్ అనుచరులు ఉన్నారని దత్తా ఆరోపించారు. ఈ ఆరోపణల్ని ఖండించిన బీజేపీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తృణమూల్‌లోనే అంతర్గత కలహాలున్నాయని తిప్పికొట్టారు. బెంగాల్ పోలీసులపై తమకు నమ్మకం పోయిందని, విశ్వాస్ హత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న నదియాలో మతువా వలసదారుల ప్రాబల్యం ఎక్కువ. ఈ వర్గం వారికి చేరువకావడానికి తృణమూల్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మతువాల కార్యక్రమాలకు విశ్వాస్ తరచూ హాజరవుతారనే పేరుంది. -
టీఎంసీ ఎమ్మెల్యే దారుణ హత్య..!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్‌ను గుర్తుతెలియని దుండుగులు కాల్చిచంపారు. బెంగాల్‌లోని కృష్ణగంజ్ నియోజకవర్గం నుంచి బిశ్వాస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నాడియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన సరస్వతి పూజకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆయనపై దుండుగులు కాల్పులకు పాల్పడ్డారు. సత్యజిత్ హత్య బెంగాల్లో కలకలం రేపుతోంది. ఇదిలావుండగా బీజేపీ మద్దతుదారులే ఆయనను హత్య చేశారని టీఎంసీ నాడియా జిల్లా అధ్యక్షుడు గౌరీశంకర్ ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత ముకుల్ రాయ్‌కు ఈ హత్యతో సంబంధం ఉందని, ఇది ముమ్మాటికి రాజకీయ హ్యత్యే అని ఆయన అన్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
జార్ఖండ్‌లో బీజేపీ నేత హత్య
రాంచీ : జార్ఖ్ండ్లో భారతీయ జనతా పార్టీ నేతతో సహా మరో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. సిమ్డెగా జిల్లా లచ్రగాడ్ గ్రామంలో బీజేపీ నేత మనోజ్ నగేసియాను శనివారం ఉదయం ఆయన నివాసంలో దుండగులు కాల్చి చంపారు. నగేసియా అల్పాహారం తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మనోజ్ నగేసియా మావోయిస్టు మాజీ కమాండర్. 2014లో బీజేపీలో చేరిన ఆయన కొలిబిరా నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా అయితే పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక గుమ్లా జిల్లాలో స్థానికంగా జరిగిన గిరిజన ఉత్సవంలో జరిగిన స్వల్ప వివాదం శుక్రవారం ఇద్దరి ప్రాణాలు తీశాయి. తైసేరా గ్రామంలో మనోహర్ తిర్కీ అనే యువకుడిని విజయ్ సాహు అనే వ్యక్తి కాల్చి చంపాడు. గిరిజన ఉత్సవం సందర్భంగా నృత్యం చేస్తున్న సమయంలో మనోహర్ పొరపాటును సాహును ఢీకొనడంతో ఘర్షణ ఏర్పడింది. దీంతో సాహు...మనోహర్‌పై కాల్పులు జరపటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు విజయ్ సాహుపై రాళ్లతో దాడి చేసి, హతమార్చారు. అయితే పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. -
కారులో మహిళ మృతదేహం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి తుపాకీ పేలింది. దక్షిణ ఢిల్లీలోని మారిస్ నగర్ ఏరియాలో ఓ కారులో 40 ఏళ్ల వివాహిత మహిళ శవం లభ్యమైంది. మృతురాలు శక్తినగర్‌కు చెందిన అంజలిగా గుర్తించారు. నవీన్ అనే పరిచయస్తుడు వ్యాపారంలో నష్టాలు రావడంతో అంజలి వద్ద 5 లక్షల రూపాయలు హ్యాండ్ లోన్ తీసుకున్నాడు. లోన్ తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేయటంతో ...అంజలిని కారులో తీసుకొచ్చి తుపాకితో కాల్చి చంపాడు. పోలీసులు హంతకుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అమ్మాయి కోసం అన్నను చంపేశాడు
ఒక్కటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము.... అని ఓ సినీ గేయ రచయిత తాను రాసిన పాట ద్వారా సెలవిచ్చాడు. అచ్చం అలాగే ఒకే అమ్మాయిని అన్నదమ్ములు ఇద్దరు ప్రేమించారు. ఆమె నాకు కావాలి అంటే నాకు కావాలి అని పోటీ పడ్డారు. ఆ క్రమంలో ఒకరు మృత్యు ఒడిని చేరుకున్నారు. ఈ సంఘటన యూఎస్ పెన్సిల్వేనియాలోని దుపిన్ కౌంటీలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న డకొటా త్రాంటన్ (15), డొమినిక్ (18) సోదరులు. ఈ ఇద్దరు ఒకే అమ్మాయిపై మనస్సు పడ్డారు. ఆమె ప్రేమను పొందేందుకు రెడీ అయ్యారు. దీంతో ఇద్దరు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు డొమినిక్‌ను డకొటా చంపేశాడు. ఈ హత్య కేసులో డకొటాను పోలీసులు అరెస్ట్ చేశారు. నా సోదరుడిని నేనే హత్య చేశాను....అని పదే పదే పోలీసుల ఎదుట చెప్పాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ కేసులో డకొటాకు పెద్ద శిక్ష పడే అవకాశం ఉందని న్యాయమూర్తులు భావిస్తున్నారు. -
ఉత్తినే చంపేశారు!