
రాంచీ : జార్ఖ్ండ్‌లో భారతీయ జనతా పార్టీ నేతతో సహా మరో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. సిమ్డెగా జిల్లా లచ్రగాడ్ గ్రామంలో బీజేపీ నేత మనోజ్ నగేసియాను శనివారం ఉదయం ఆయన నివాసంలో దుండగులు కాల్చి చంపారు. నగేసియా అల్పాహారం తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మనోజ్ నగేసియా మావోయిస్టు మాజీ కమాండర్. 2014లో బీజేపీలో చేరిన ఆయన కొలిబిరా నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా అయితే పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇక గుమ్లా జిల్లాలో స్థానికంగా జరిగిన గిరిజన ఉత్సవంలో జరిగిన స్వల్ప వివాదం శుక్రవారం ఇద్దరి ప్రాణాలు తీశాయి. తైసేరా గ్రామంలో మనోహర్ తిర్కీ అనే యువకుడిని విజయ్ సాహు అనే వ్యక్తి కాల్చి చంపాడు. గిరిజన ఉత్సవం సందర్భంగా నృత్యం చేస్తున్న సమయంలో మనోహర్ పొరపాటును సాహును ఢీకొనడంతో ఘర్షణ ఏర్పడింది. దీంతో సాహు...మనోహర్‌పై కాల్పులు జరపటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు విజయ్ సాహుపై రాళ్లతో దాడి చేసి, హతమార్చారు. అయితే పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment