న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి తుపాకీ పేలింది. దక్షిణ ఢిల్లీలోని మారిస్ నగర్ ఏరియాలో ఓ కారులో 40 ఏళ్ల వివాహిత మహిళ శవం లభ్యమైంది. మృతురాలు శక్తినగర్‌కు చెందిన అంజలిగా గుర్తించారు. నవీన్ అనే పరిచయస్తుడు వ్యాపారంలో నష్టాలు రావడంతో అంజలి వద్ద 5 లక్షల రూపాయలు హ్యాండ్ లోన్ తీసుకున్నాడు. లోన్ తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేయటంతో ...అంజలిని కారులో తీసుకొచ్చి తుపాకితో కాల్చి చంపాడు. పోలీసులు హంతకుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.