
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్‌ను గుర్తుతెలియని దుండుగులు కాల్చిచంపారు. బెంగాల్‌లోని కృష్ణగంజ్ నియోజకవర్గం నుంచి బిశ్వాస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నాడియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన సరస్వతి పూజకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆయనపై దుండుగులు కాల్పులకు పాల్పడ్డారు.
సత్యజిత్ హత్య బెంగాల్‌లో కలకలం రేపుతోంది. ఇదిలావుండగా బీజేపీ మద్దతుదారులే ఆయనను హత్య చేశారని టీఎంసీ నాడియా జిల్లా అధ్యక్షుడు గౌరీశంకర్ ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత ముకుల్ రాయ్‌కు ఈ హత్యతో సంబంధం ఉందని, ఇది ముమ్మాటికి రాజకీయ హ్యత్యే అని ఆయన అన్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.