వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచిన పెన్సిల్వేనియాలో పోలింగ్‌లో అక్రమాలు జరిగాయనీ, రీకౌంటింగ్ చేపట్టా లంటూ ట్రంప్ బృందం వేసిన పిటిషన్లను పెన్సిల్వేనియా మిడిల్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టేసింది. పోలింగ్‌లో అక్రమాలంటూ చేసిన ఫిర్యాదులకు ఎటువంటి ఆధారాలు లేవని జడ్జి మాథ్యూ బ్రాన్ పేర్కొన్నారు.
దాదాపు 70 లక్షల ఓట్లను చెల్లనివంటూ ప్రకటించాలని కోరడం తగదంటూ పిటిషన్‌ను తోసి పుచ్చారు. ఈ పరిణామంపై అధ్యక్షుడు ట్రంప్ అటార్నీ రూడీ గిలియానీ స్పందిం చారు. ఈ విషయంలో తాము సుప్రీంకోర్టుకు త్వరగా వెళ్లేందుకు పెన్సిల్వేనియా కోర్టు తీర్పు దోహదపడుతుందన్నారు. ఆధారాలను పరిశీ లించకుండానే, ఒబామా హయాంలో నియమించిన ఈ జడ్జి పిటిషన్‌ను కొట్టేశారని ఆరోపించారు. ఈ తీర్పుపై త్వరలోనే థర్డ్ సర్క్యూట్ కోర్టుకు వెళతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment