మెలికల టవర్.. ఎత్తు 590 అడుగులు.. | 590 Feet Height Twisting Tower China | Sakshi
Sakshi News home page

8.8 డిగ్రీల కోణంలో మెలికలు తిరిగిన ఆకాశహార్మ్యం

Published Tue, Sep 6 2022 9:09 AM | Last Updated on Tue, Sep 6 2022 9:09 AM

590 Feet Height Twisting Tower China - Sakshi

బీజింగ్: చూశారుగా ఎలా మెలితిరిగి ఉందో.. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత మెలికలు తిరిగిన ఆకాశహార్మ్యాల్లో ఒకటిగా నిలిచింది. పశ్చిమ చైనాలోని చోంగ్‌క్వింగ్‌ నగరంలో తాజాగా ప్రారంభమైన ఈ టవర్‌ ఎత్తు 590 అడుగులు. ‘డ్యాన్స్‌ ఆఫ్‌ లైట్‌’గా పిలిచే ఈ భవంతి 8.8 డిగ్రీల కోణంలో మెలికలు తిరిగి ఉంది. ఈ తరహాలో నిర్మించిన ఇతర ఆకాశహార్మ్యాలకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ మెలికలు ఈ టవర్‌ సొంతమని నిర్మాణ సంస్థ ఏడస్‌ తెలిపింది.

ఉత్తర ధ్రువం వద్ద ఆకాశంలో వివిధ ఆకృతుల్లో కనిపించే కాంతుల తరహాలో ఈ టవర్‌ను డిజైన్‌ చేశామని సంస్థ పేర్కొంది. పగటిపూట సూర్యకిరణాల తాకిడి వల్ల ఈ భవంతి మెరుస్తూ కనిపిస్తుందని.. రాత్రిపూట గ్లాస్‌ ప్యానెళ్ల వల్ల కాంతులు వక్రీభవనం, పరావర్తనం చెందుతుంటాయని.. అందుకే దీనికి డ్యాన్స్‌ ఆఫ్‌ లైట్‌ అని పేరు పెట్టినట్లు వివరించింది.
చదవండి: జింబాబ్వేలో 'మీజిల్స్' విలయం.. 700 మంది చిన్నారులు మ్యత్యువాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement