దివాకర్‌కు ఇమేజ్ కొలీగ్ సొసైటీ పురస్కారం
దివాకర్‌కు ఇమేజ్ కొలీగ్ సొసైటీ పురస్కారం
Published Wed, Sep 28 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
సామర్లకోట : రోహిణి స్టూడియో అధినేత తామరపల్లి దివాకర్‌కు అమెరికాలోని ఇమేజ్ కొలీగ్ సొసైటీ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. స్టూడియో లైటింగ్‌పై పొట్రెట్ ఫొటోగ్రఫీపై 12 చిత్రాలతో కూడిన ఫొటో డాక్యుమెంటరీని అంతర్జాతీయ పోటీల కోసం ఈ ఏడాది మార్చిలో ఫొటోగ్రఫీ సొసైటీ అమెరికా, ఫెడరేషన్ డీలా ఆర్ట్ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్)తో పాటు ఇమేజ్ కొలీజ్ సొసైటీ(అమెరికా)కు ఆయన పంపారు. ఈ ఏడాది దివాకర్ పంపిన తెలుపు–నలుపు విభాగంలోని ఫొటోలు కళ్లకు కట్టినట్టుగా ఉండటంతో, ఇమేజ్ కొలీజ్ సొసైటీ న్యాయనిర్ణేతలు ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. సంస్థ చైర్మన్ టోనీ లీకిమ్ తాన్ ఈ–మెయిల్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేశారు. సొసైటీలో జీవిత కాలం సభ్యతాన్ని కూడా పంపారని దివాకర్ బుధవారం విలేకరులకు వివరించారు. అమెరికన్ గౌరవ పురస్కారాన్ని అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ ఇటీవల దివాకర్‌కు అందజేశారు.
Advertisement
Advertisement