Diwakar
-
జల రవాణాపై ఏపీతో చర్చలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఎండీ కెప్టెన్ ఎస్.దివాకర్ చెప్పారు. అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకూ న్యూఢిల్లీలో జరిగే గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్–2023కి అనుబంధంగా డీసీఐలో ఈ నెల 28న రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లను ఎండీ దివాకర్ పరిశీలించారు. డీసీఐ పురోగతికి తీసుకుంటున్న చర్యలు, సమ్మిట్‌కు సంబంధించిన విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. జలరవాణాపై సంప్రదింపులు ప్రస్తుతం జీడీపీ విలువలో 80 శాతం వరకూ మారి టైమ్ ట్రేడ్ జరుగుతోంది. డ్రెడ్జింగ్ చేయకుండా ఏ పోర్టు అభివృద్ధి జరగదు. అందుకే ప్రధాని కూడా దేశీయ జలమార్గాల (ఇన్లాండ్ వాటర్ వేస్)పై దృష్టి సారించారు. ప్రస్తుతం 110 నదులుండగా కేవలం 4 నదుల్లో జల రవాణాకు సంబంధించి డ్రెడ్జింగ్ పనుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పూడికతో నిండిపోయిన డ్యామ్‌లు, రిజర్వాయర్లలోనూ డ్రెడ్జ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం చిన్నచిన్న డ్రెడ్జర్లు అవసరం అవుతాయి. దీనిపైనా సమాలోచనలు చేస్తున్నాం. డ్రెడ్జ్ చేస్తే.. వాటర్ క్యాచ్మెంట్ ఏరియా పెరుగుతుందని ఇందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాం. ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరిపాం. ఏ ప్రభుత్వమైనా డ్యామ్‌లు, రిజర్వాయర్ల డ్రెడ్జింగ్ పనుల్ని 8 నుంచి 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ అప్పగిస్తే కొత్త డ్రెడ్జర్లు తీసుకుంటాం. దేశంలో డ్రెడ్జింగ్ కోసం 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకూ డిమాండ్ ఉంది. కానీ.. డీసీఐలో ప్రస్తుతం 59 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న10 టీఎస్‌హెచ్ డ్రెడ్జర్లు, 6 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న 2 కట్టర్ సీఎస్ డ్రెడ్జర్లు, ఒక బీహెచ్వో డ్రెడ్జర్ ఉన్నాయి. 12 వేల టన్నుల హోపర్ కెపాసిటీ డ్రెడ్జర్ కోసం ఆర్డర్ చేశాం. 2025 డిసెంబర్ నాటికి ఇది రానుంది. రూ.12 వేల కోట్ల వరకూ ఎంవోయూలు 2021లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.14 వేల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నాం. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల వరకూ వస్తాయని భావి స్తున్నాం. ఇందుకోసం 28న డీసీఐలో నిర్వహించే రోడ్‌షోలో షిప్ బిల్డర్స్, షిప్ ఆపరేటర్స్,పోర్టులు, రెగ్యులేటరీస్, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తాం. ఏపీలో 4 పోర్టుల రాకతో అపార అవకాశాలు ఏపీ ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని చురుగ్గా నిర్వహిస్తోంది. కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలలో నిర్మిస్తున్న పోర్టుల ద్వారా అపారమైన అవకాశాలు కలగనున్నాయి. ఈ నాలుగు పోర్టుల్లో కనీసం 150 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మచిలీపట్నంలో పనులు చేపడుతున్నాం. మిగిలిన పోర్టుల్లోనూ పనుల కోసం మరిన్ని డ్రెడ్జర్లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. -
సీఎం హామీ ఇచ్చిన తర్వాత నిరసనలెందుకు?
అమలాపురం టౌన్: పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీపై ఉద్యోగులకు పూర్తి నమ్మకం ఉందని రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ వీఎస్ దివాకర్ తెలిపారు. సీఎం హామీ ఇచ్చిన తర్వాత కూడా నిరసనలు ఎందుకని ప్రశ్నించారు. పీఆర్సీ సాధన కోసం ఉద్యమిస్తున్నామని చెప్పుకుంటున్న రెండు జేఏసీల నిరసనల్లో రెవెన్యూ ఉద్యోగులెవరూ పాల్గొనడం లేదన్నారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వీఎస్ దివాకర్ మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ జేఏసీలో భాగస్వాములుగా ఉన్న ఏపీ గ్రామ సహాయకుల సంఘం, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, ఏపీ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ తహసీల్దార్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్లు జేఏసీల నిరసనల్లో పాల్గొనడం లేదని చెప్పారు. జేఏసీల చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు వెనుక రెవెన్యూ ఉద్యోగులెవరూ లేరన్నారు. పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఉద్యమ కార్యాచరణలోకి దిగడమేమిటని ప్రశ్నించారు. వారి తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. 2019 ఎన్నికలప్పుడు రాష్ట్ర సచివాలయం నుంచి బొప్పరాజు వెంకటేశ్వర్లు తహసీల్దార్లకు ఫోన్లుచేసి టీడీపీకి ఓటు వేయించాలంటూ ఆదేశాలిచ్చారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ డైరీలో బొప్పరాజుకు రూ.2 కోట్లు ఇచ్చినట్లు రాసి ఉందంటూ వచ్చిన వార్తలపై దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణాల కోసం చేసిన వసూళ్లపైనా బొప్పరాజు సమాధానం చెప్పాలన్నారు. సీఎంపై ఉద్యోగులకు నమ్మకముంది ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సాక్షి, అమరావతి: పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తారని నమ్ముతున్నట్లు ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల వరద ప్రాంతాల పర్యటన సందర్భంగా కలసిన ఉద్యోగులకు సీఎం పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించడాన్ని గమనించాలన్నారు. -
‘ప్రొఫెషనల్’గా దివాకర్, మదన్
న్యూఢిల్లీ: ఒలింపియన్ దివాకర్ ప్రసాద్, జాతీయ మాజీ చాంపియన్ మదన్‌లాల్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఈ అమెచ్యూర్ బాక్సర్లు మంగళవారం ఐఓఎస్ బాక్సింగ్ ప్రమోషన్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దివాకర్, మదన్‌తో పాటు మరో 11 మంది కూడా ఐఓఎస్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే విజేందర్, అఖిల్ కుమార్ వంటి వారిని ఈ సంస్థ ప్రమోట్ చేస్తోంది. ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యులైన కామన్వెల్త్గేమ్స్ మెడలిస్ట్ అమన్‌దీప్ సింగ్, నీరజ్ గోయత్ వంటి ఆటగాళ్లు కూడా ఈ సంస్థతో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు. ‘ఇప్పుడు మాతో 16 మంది బాక్సర్లు ఉన్నారు. వీరందరికీ గుర్గావ్లోని మా అకాడమీలో శిక్షణ ఇస్తాం’ అని ఐఓఎస్ డైరెక్టర్ గౌరవ్ తోమర్ తెలిపారు. ‘ఐదేళ్ల కింద భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు అంతగా గుర్తింపు లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అందుకే ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జార్ఖండ్ బాక్సర్ దివాకర్ ప్రసాద్ తెలిపాడు. -
దివాకర్‌కు ఇమేజ్ కొలీగ్ సొసైటీ పురస్కారం
సామర్లకోట : రోహిణి స్టూడియో అధినేత తామరపల్లి దివాకర్‌కు అమెరికాలోని ఇమేజ్ కొలీగ్ సొసైటీ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. స్టూడియో లైటింగ్‌పై పొట్రెట్ ఫొటోగ్రఫీపై 12 చిత్రాలతో కూడిన ఫొటో డాక్యుమెంటరీని అంతర్జాతీయ పోటీల కోసం ఈ ఏడాది మార్చిలో ఫొటోగ్రఫీ సొసైటీ అమెరికా, ఫెడరేషన్ డీలా ఆర్ట్ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్)తో పాటు ఇమేజ్ కొలీజ్ సొసైటీ(అమెరికా)కు ఆయన పంపారు. ఈ ఏడాది దివాకర్ పంపిన తెలుపు–నలుపు విభాగంలోని ఫొటోలు కళ్లకు కట్టినట్టుగా ఉండటంతో, ఇమేజ్ కొలీజ్ సొసైటీ న్యాయనిర్ణేతలు ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. సంస్థ చైర్మన్ టోనీ లీకిమ్ తాన్ ఈ–మెయిల్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేశారు. సొసైటీలో జీవిత కాలం సభ్యతాన్ని కూడా పంపారని దివాకర్ బుధవారం విలేకరులకు వివరించారు. అమెరికన్ గౌరవ పురస్కారాన్ని అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ ఇటీవల దివాకర్‌కు అందజేశారు. -
తమిళంలోకి రాజుగారి గది
చెన్నై : టాలీవుడ్లో ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సొంతం చేసుకున్న చిత్రం రాజుగారి గది. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం త్వరలో కోలీవుడ్‌కు రానుంది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆర్.దివాకర్ గురించి చెప్పే తీరాలి. ఈయన ప్రముఖ ఛాయాగ్రహకుడు. తమిళంలో పార్దీపన్ కనవు చిత్రం ద్వారా తొలిసారిగా కెమెరాను హ్యాండిల్ చేశారు. ఇటీవల విడుదలైన నటి జోతిక నటించిన 36 వయదినిలే, దాని ఒరిజినల్ మలయాళ చిత్రం హౌఓల్ట్ ఆర్ యూ వరకూ తమిళం, తెలుగు, మలయాళం, కన్న డం మొదలగు భాషల్లో ప లు చిత్రాలకు తన ఛాయాగ్రహ నైపుణ్యాన్ని అందించారు. అలాంటి దివాకర్ తాజాగా నిర్మాతగా అవతారమెత్తారు. ఓంకార్‌తో కలిసి రాజుగారి గది చిత్రాన్ని నిర్మించారు. ఇందులో స్టార్ నటీనటులెవరూ లేరు. అంతకు పెద్ద విజయాలను సాధించిన నటులు ఇందులో లేరు. అయిన రాజుగారి గది దసరా పండుగ సందర్భంగా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదలయ్యి విజయం వైపు దూసుకు పోతోంది. పెద్ద చిత్రా ల స్థాయిలో వసూళ్లు సాధిస్తున్న రాజుగారి గది చిత్రం గురించి నవ నిర్మాత ఆర్.దివాకర్ స్పందన అడగ్గా చిన్న చిత్రం పెద్ద చిత్రం అనేది వాటి బడ్జెట్‌కు సంబంధించిందే. -
రేబిస్‌తో ఆరేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్: రేబిస్ వ్యాధికి ఆరేళ్ల బాలుడు బలైపోయాడు. ఒడిశాకు చెందిన బాలుడు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఒడిశాకు చెందిన జోగేందర్, అతని కుటుంబ సభ్యులు ఉపాధి కోసం హయత్‌నగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. అయితే, జోగేందర్ కుమారుడు దివాకర్ (6) రెండు నెలల క్రితం ఒడిశాలోని తమ స్వగ్రామంలో కుక్క కాటుకు గురయ్యాడు. నిరక్షరాస్యులైన జోగేందర్ కుటుంబ సభ్యులు ఆ సమయంలో దివాకర్‌కు ఎలాంటి చికిత్సలు చేయించలేదు. అయితే, దివాకర్ వింతగా ప్రవర్తిస్తుండడంతో చికిత్స కోసం బుధవారం తెల్లవారు జామున నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో గత 20 రోజుల వ్యవధిలో ముగ్గురు రేబిస్‌తో మృతి చెందడం గమనార్హం. ఏప్రిల్ 17న నిజామాబాద్ జిల్లా సీతారాంపల్లికి చెందిన ఇంద్రమ్మ(43) మృతి చెందగా, అదే నెల 30న మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్‌కు చెందిన యాదయ్య(65) మృతి చెందాడు. (నల్లకుంట) -
స్కూల్ బస్ బోల్తా
14 మంది విద్యార్థులకు గాయాలు కోలుకుంటున్న చిన్నారులు గొలుగొండ/ నర్సీపట్నం టౌన్ : ప్రవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి సోమవారం ఉదయం బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,14 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోజూ మాదిరి నర్సీపట్నం రుషివేలీ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు ఏటిగైరంపేట, బి.బి.పట్నం, తదితర గ్రామాల నుంచి 25 మంది విద్యార్థులను తీసుకొస్తోంది. రావణాపల్లి వ ద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదే గ్రామానికి చెందిన జోగ దేముడును ఢీకొట్టింది. వెంటనే విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది. ఈసంఘటనలో దేముడుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఎకాయెకిన సంఘటన స్థలానికి చెరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థులను రక్షించారు. వీరిలో 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులు గిరిజా సాయిప్రసాద్( బి.బి.పట్నం), పి. నానాజీ(కొత్తపట్నం)లకు తలకు గాయాలయ్యాయి. దివాకర్( బి.బి.పట్నం)కు కాలికి గాయమైంది. మిగిలిన విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రం గా గాయపడిన దేముడుతోపాటు విద్యార్థులను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, గొలుగొండ ఎంపీపీ సుర్ల లక్ష్మీనారాయణ ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థుల పరిస్థితిని ఆరా తీశారు. వెనుక నుంచి బస్సు బలంగా ఢీకొట్టడంతో పరిస్థితి విషమంగా ఉన్న దేముడును మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలిస్తుంగా మార్గమధ్యలో మృతిచెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా ఉంది. స్తంభం విరిగినా, తీగలు తెగిపడి బస్సును తాకినా పెద్ద ప్రమాదం చోటుచేసుకునేది. ఎస్ఐ జోగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.