- రూ.4.60 లక్షలు అపహరణ
గూడూరు : స్థానిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో గురువారం రాత్రి దొంగలు పడి రూ. 4.60 లక్షల నగదు చోరీ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. సహకార సం ఘంలో కొన్ని రోజులుగా ఎరువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గూడూరు కేడీసీసీ బ్రాంచ్ పరిధిలోని 10 సహకార సంఘాలకు సంబంధించి ఎరువుల అమ్మకాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతాయి.
సంఘం కార్యదర్శి చక్రవర్తి, గుమాస్తా వెంకన్న ఎరువుల విక్రయాలను నిర్వహిస్తుంటారు. రోజూ మధ్యాహ్నం రెండు గంటలలోపు వచ్చిన సొమ్మును కేడీసీసీ స్థానిక బ్రాంచ్‌లో జమ చేస్తుంటారు. గురువారం మధ్యాహ్నం వరకు 50 మందికి పైగా రైతులకు ఎరువులను అమ్మారు. వాటిని అమ్మగా వచ్చిన నగదు ను డ్రాయర్ సొరుగులో ఉంచి తాళం వేశారు.
సొసైటీకి రా త్రి ఏడుగంటల సమయంలో తాళం వేసి వారిద్దరూ వెళ్లి పోయారు. శుక్రవారం తెల్లవారుజామున సొసైటీ ప్రాంగణా న్ని శుభ్రపరిచేందుకు స్వీపర్ వచ్చింది. భవనం ప్రధాన ద్వారానికి వేసిన తాళం కిందపడి ఉండటాన్ని గమనించింది. గడ్డపలుగుతో తాళం పగులగొట్టినట్లు చుట్టుపక్కల వారికి తెలియజేసి.. గుమాస్తాకు కబురు చేసింది. దీనిపై కార్యదర్శి, గుమస్తా ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ బి.వి.ఎస్.ఎన్.ఎన్.మూర్తి ఆధ్వర్యంలో ఇన్‌చార్జి ఎస్సై దుర్గాప్రసాద్ సిబ్బందితో వచ్చి భవనం లోపల పరిశీలించారు.
దుండగులు పలుగుతో తలుపు తాళాన్ని పగులగొట్టి లోనికి చొరబడి, దానితోనే డ్రాయర్ సొరుగును పగులగొట్టి లోపల ఉన్న రూ.4.60 లక్షల నగదును అపహరించుకుపోయినట్లు గుర్తించా రు. పలుగు పాత భవనం సన్‌షైడ్‌పై ఉండటాన్ని చూశా రు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ పలు గు సొసైటీ పక్కనే ఉన్న రైతుకు చెందినదిగా పోలీసుల విచారణలో తెలిసింది. బందరు డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
సొసైటీలో ఎరువుల స్టాకు వివరాలను రూరల్ సీఐ మూర్తి పరిశీలించారు. ప్రత్యేక బృం దాల ద్వారా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కేడీసీసీ గూడూరు బ్రాంచ్ మేనేజర్ శ్యాంప్రసాద్, సంఘం అధ్యక్షుడు నాగిశెట్టి జోగేశ్వరరావు, మల్లవోలు, జక్కంచర్ల, కంకటావ, రాయవరం సంఘాల అధ్యక్షులు చీడేపూడి ఏడుకొండలు, మత్తి సుబ్రహ్మణ్యం, తోట పోతురాజు, కోళ్ల బాలకృష్ణ, ఆయా సం ఘాల కార్యదర్శులు, గ్రామసర్పంచ్ పెదపూడి ఈశ్వరరావు, సంఘ డెరైక్టర్లు వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
కేసును త్వరలోనే ఛేదిస్తాం
దొంగలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని రూరల్ సీఐ మూర్తి తెలిపారు. విచారణ వేగవంతం చేసి కేసును త్వరలోనే ఛేదిస్తామని పేర్కొన్నారు.