సమాజంలో స్త్రీ పాత్ర కీలకం
- కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు సిటీ: సమాజంలో స్త్రీ పాత్ర కీలకమని కర్నూలు ఎంపీ బుట్టారేణుక అన్నారు. సోమవారం స్థానిక కెవీఆర్ మహిళ డిగ్రీ కాలేజీలో మహిళల హక్కులు– సమస్యలు, సాధ్యాసాధ్యాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. హక్కులు, చట్టాలను ప్రతి మహిళ తెలుసుకుని ఉండాలన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా పోరాడి పరిష్కరించుకోవాలన్నారు.
అనంతరం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డాక్టర ఆవుల మంజులత, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ లక్కరాజు జయశ్రీ, డిప్యూటీ కలెక్టర్ నాగమ్మ, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర సీవీ రాజేశ్వరిలు ప్రసంగించారు.
శాతవాహనుల కాలంలో స్త్రీలకు ప్రాధాన్యత ఉండేదని.. రానురాను పురుషాధిక్యంలో స్త్రీ వివక్షతకు గురవుతోందన్నారు. చట్టం దృష్టిలో స్త్రీ, పురుషులు సమానమని, లింగ వివక్ష చూపకూడదన్నారు. మహిళలపై దాడులు రోజు రోజుకూ పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితిల్లో మార్పులు రావాలంటే మహిళల్లో అక్షరాస్యతా శాతం పెరగాలన్నారు. గర్భంలోనే ఆడపిల్లను చిదిమి వేడయం నేరమన్నారు. కార్యక్రమంలో కేవీఆర్ కాలేజీ అధ్యాపకులు ఇందిరా శాంతి, శ్రీదేవి, డాక్టర్ వీరాచారి, సుబ్బరాజ్యమ్మ, డాక్టర్‌స్వప్న తదితరులు పాల్గొన్నారు.