పొదుపు లక్ష్ములు... | saving money | Sakshi
Sakshi News home page

పొదుపు లక్ష్ములు...

Published Wed, Aug 6 2014 12:02 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

పొదుపు లక్ష్ములు... - Sakshi

పొదుపు లక్ష్ములు...

సమాజంలో నువ్వు ఆశించిన మార్పు ముందుగా నీతోనే మొదలు కానివ్వమని గాంధీజీ చెప్పినట్లు గృహలక్ష్ములు అనవసరపు ఖర్చులకు కళ్లెం వేస్తే కాసింత వెనకేయవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకోవాలి.  ఖర్చుపెట్టే ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి.  షాపింగ్‌ను అవసరానికి కాకుండా కాలక్షేపానికి చేయడాన్ని మానుకోవాలి.

ధర కొంచెం ఎక్కువైనా, నాణ్య మైనవి, మన్నికైనవి మాత్రమే కొనుగోలు చేయాలి.  ఆహార పదార్థాలను రుచికరంగా, వైవిధ్యంగా తయారు చేస్తే ఆహారాన్ని బయట కొనుక్కోవడానికి వెచ్చించే ఖర్చు తగ్గడంతో బాటు ఆరోగ్యమూ బాగుంటుంది. తెలివిగా, ఆలోచనతో చేసే ఆదాతో మనం పెట్టాలనుకున్న మదుపునకు రెక్కలు మొలుస్తాయి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement