యూరియా బ్లాక్ | Urea block | Sakshi
Sakshi News home page

యూరియా బ్లాక్

Published Tue, Dec 30 2014 8:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Urea block

సంగం : రబీ వ్యవసాయానికి సరిపడేంతగా యూ రియా నిల్వలు ఉన్నాయని వసాయశాఖాధికారులు చెబుతున్నారు. కానీ వ్యాపారులు మాత్రం కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పటికే రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో యూరియా డిమాండ్‌ను సృష్టించడంతో రైతులు పనులు పక్కన పెట్టి సొసైటీలు, వ్యాపారుల వద్ద కు పరుగులు తీస్తున్నారు. వ్యాపారులు డిమాండ్ దృష్ట్యా అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

సొసైటీల్లో మాత్రం ఎమ్మార్పీ రేటుకే లభిస్తుండటంతో రైతులు అక్కడకే పరుగులు తీస్తున్నారు. అయితే సంబంధిత సొసైటీ అధికారులు కానీ, వ్యవసాయశాఖాధికారులు కానీ రైతులకు సరిపడునంతగా  నిల్వలు పెంచే చర్యలు చేపట్టడం లేదు. అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారుల వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బం దులు పడుతున్నారు. మండలంలో ఈ సీజన్‌లో 10 వేల ఎకరాలకుపైగా వరి సాగు చేస్తున్నారు.

మండలంలో సంగం, దువ్వూరు వ్యవసాయ సహకార సంఘల్లో యూరియా బస్తా రూ.284 ఇస్తుం టే.. వ్యాపారులు మాత్రం రూ.400లకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. సొసైటీలో యూరియా ఉంటే తమ వ్యాపారం సక్రమంగా జరగదని భావించిన దుకాణాదారులు వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకు భారీగా ముడుపులు ఇచ్చి సొసైటీలకు యూరి యా రాకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.

ఈ సీజన్‌లో సంగం మండలానికి 1500 టన్నుల యూరియ అవసరం ఉంది. ఇప్పటి వరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఈ మేరకు యూరియాను సొసైటీలకు కేటాయించ లేదు. సంగం వ్యవసాయ సహకార సంఘానికి 400 టన్నులు, దువ్వూరు సంఘంకు 120 టన్ను లు మాత్రమే కేటాయించారు. దీంతో యూరియా అందక రైతులు సొసైటీల వద్ద బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు.

దీంతో వ్యవసాయ సంఘా ల్లో ఉన్న కొద్దిపాటి యూరియాను ఒక్కొక్క రైతుకు మూడు బస్తాలు వంతున అందజేస్తున్నా రు. సంగంలోని దుకాణంలో మాత్రం యూరియా ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. బస్తాకు రూ.116 అదనంగా చెల్లించలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ జానకి చొరవ తీసుకుని సొసైటీలకు పూర్తిగా యూరియా కేటాయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
యూరియా కోసం రైతుల పాట్లు

జలదంకి : మండలంలోని రైతులు యూరియా కొరతతో కష్టాలు పడుతున్నారు. సోమవారం జలదంకి సొసైటీకి 18 టన్నుల యూరియా దిగుమతి అయింది. దీంతో రైతులు యూరియా కోసం ట్రాక్టర్లు, ఆటోలతో కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరారు. ఒక్కొక్క రైతుకు రెండు, మూడు బస్తాలే పంపిణీ చేస్తుండటంతో అవి తమకు సరిపోవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పట్టాదారు పాస్‌పుస్తకాల జెరా క్స్ కాపీలను అందించి యూరియాను ఎమ్మార్పీ ధర రూ. 284 చెల్లించి తీసుకెళ్తున్నారు. 15 రోజులుగా యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతు లు సొసైటీకి యూరియా రావడంతో పరుగులు తీస్తున్నారు.

ఎరువుల దుకాణాల్లో యూరియా బస్తా రూ.350 నుంచి రూ.370ల వరకు విక్రయిస్తున్నారు. ఇతర ఎరువులు కొంటేనే యూరి యా ఇస్తామని దుకాణదారులు చెబుతుండడంతో రైతులు చేసేదేమీ లేక సొసైటీ కార్యాల యం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి  చర్యలు తీసుకుని రైతులకు యూరియా సక్రమంగా అందేలా చూడాలని  రైతులు కోరుతున్నారు.  
 
 యూరియా కొరత ఉంది :  
 నాకు పది ఎకరాల పొలం ఉంది. వరి పంట సాగు చేస్తున్నాను. 30 బస్తాలకుపైగా యూరియా కావా ల్సి ఉంది. సొసైటీ వద్ద గంటల తరబడి క్యూలో నిలుచుకుంటే మూడు బస్తాలు ఇచ్చారు. ఇలా అయితే పంటలు ఎలా సాగు చేయాలో అర్థం కావటంలేదు.  
 - మేకల సుధాకర్ రెడ్డి, వీర్లగుడిపాడు
 
 అధిక ధరలకు ఇస్తున్నారు :

 నేను 20 ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. సొసైటీలో యూరియా నిల్వలేదని చెబుతున్నారు. సంగంలో ప్రైవేట్ దుకాణం వారు ఒక్కో బస్తా రూ.400లకు అమ్ముతున్నారు. రూ.284 విలువైన యూరియా బస్తాను అధిక ధరలకు కొనలేం. సొసైటీలకు యూరియా అందజేయాలి.             
-విజయ్‌కుమార్, కౌలు రైతు, ఉడ్‌హౌస్‌పేట
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement