బాలికల హక్కులను పరిరక్షించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలికల హక్కులను పరిరక్షించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నందికొట్కూరు రోడ్డులోని సెయింట్ జోసెప్ జూనియర్ బాలికల కళాశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన చైల్డ్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో ముద్రించిన జెండర్ సమానత్వం సాదిద్ధాం అనే పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలపై వివక్ష చూపరాదన్నారు. బాలికలు తమకున్న హక్కులను స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవడానికి సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, అధికారులు, సహకరించాలని సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లో బాల్య వివాహాలు చేయరాదని చెప్పారు. కార్యక్రమంలో బర్డ్స్ జోనల్ కోఆర్డినేటర్ కిరణ్‌కుమార్, రోషన్, రిటైర్డ్ డీఎస్పీ పాపరావు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.