![Suicide Of Young Man With Mental Problems At Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/2/gas.jpg.webp?itok=2OT_nxtM)
సాక్షి, ఖైరతాబాద్ (హైదరాబాద్): మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ యువకుడు లాడ్జిలో నైట్రోజన్ సిలిండర్ పైప్ నోట్లో పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మద్దునూరి శివరామవర్మ(25) బీటెక్ పూర్తి చేశాడు. గత కొంతకాలంగా తనను ఎవరో వెంటాడుతున్నారని, ఆత్మహత్య చేసుకుంటానంటూ మాట్లాడుతు న్నాడు. దీంతో శివరామవర్శకు కుటుంబీకులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 26న హైదరాబాద్‌లో స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన అతడు.. మాసబ్‌ట్యాంక్‌లోని హైదరాబాద్ హైట్స్ హోటల్‌లో ఓ గది తీసుకున్నాడు.
సోమవారం ఉదయం నుంచి ఆ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. సాయంత్రం 3 గంటలకు పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా శివరామవర్మ అప్పటికే చనిపోయి ఉన్నాడు. అతడి శరీరం మొత్తం ఉబ్బి ఉంది. గదిలో దిగిన మరుసటి రోజే లంగర్‌హౌస్‌లో ఏసీ కోసం 5 కేజీల నైట్రోజన్ సిలిండర్ కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. హోటల్‌కు వచ్చిన అనంతరం ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని పైప్ కనెక్ట్ చేసుకొని సిలిండర్ ఆన్ చేసుకోవడంతో మృతి చెందినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణయ్య చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment