నిద్రలేమితో మానసిక సమస్యలు!
పరిపరి శోధన
కంటినిండా ప్రశాంతమైన నిద్ర కరువైన వారికి మానసిక సమస్యలు తప్పవని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడేవారు తేలికగా డిప్రెషన్‌కు లోనవుతారని, ఆందోళనను, భావోద్వేగాలను అదుపు చేసుకోలేక సతమతమవుతారని అంటున్నారు.
నిద్ర కరువైతే మెదడు పనితీరులో తలెత్తే మార్పులే ఈ పరిస్థితులకు దారితీస్తాయని చైనాలోని గువాంగ్‌డాంగ్ ప్రావిన్షియల్ పీపుల్స్ హాస్పిటల్‌కు చెందిన వైద్య పరిశోధకులు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం దెబ్బతింటుందని, దానివల్ల హార్మోన్ల పనితీరులోనూ తేడాలొస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.