బయోమెడికల్ వేస్ట్‌తో వ్యాధులు
బయోమెడికల్ వేస్ట్‌తో వ్యాధులు
Published Wed, Feb 1 2017 10:24 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
– కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ సంచాలకులు రాజేందర్‌రెడ్డి
కర్నూలు(హాస్పిటల్): ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్‌తో వైద్యసిబ్బందికే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ సంచాలకులు రాజేందర్‌రెడ్డి చెప్పారు. ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్ నిర్వహణపై బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్లినికల్ లెక్చర్ గ్యాలరీలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో బయోవేస్ట్ నియమావళి, వ్యర్థపదార్థాలను వేరే చేసే పద్ధతి, చేతులు పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ, ద్రవ వ్యర్థాలు, వ్యాధి సంక్రమిక బట్టలను శుభ్రపరచడం, నేలను శుభ్రం చేయడం, పాదరస వ్యర్థ నిర్వహణ, వ్యర్థాలను నిల్వ ఉంచే ప్రదేశం ఎలాగుండాలనే విషయాలపై విపులీకరించారు.
ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్‌ను ఎలా నిర్వహించాలనే విషయమై నియంత్రణకు తమ శాఖ చూసుకుంటుందన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోతే రోగాలు వస్తాయaన్నారు. సింగపూర్ దేశంలో వ్యర్థాలు రోడ్డుపై పారవేస్తే జరిమానాలు విధిస్తారన్నారు. ఇక్కడ కూడా ప్రస్తుతం మున్సిపల్ వ్యర్థాలు పారవేసే వారిపై జరిమానాలు విధించే చట్టం వచ్చిందన్నారు. దీంతో ప్రజల్లో క్రమశిక్షణ గల జీవితం అలవడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ వై. శ్రీనివాసులు, ఏఆర్‌ఎంవో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్, రక్షణ సంస్థ ప్రతినిధి రత్నం, తదితరులు పాల్గొన్నారు.
Advertisement