కళాశాలలు నాణ్యతా ప్రమాణాలను పాటించాలి
కళాశాలలు నాణ్యతా ప్రమాణాలను పాటించాలి
Published Wed, Nov 16 2016 1:59 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
నెల్లూరు (టౌన్) విశ్వవిద్యాలయాలతో పాటు కళాశాలల్లో కూడా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని వీఎస్‌యూ వీసీ వీరయ్య తెలిపారు. స్థానిక వీఎస్‌యూ సెమినార్ హాల్లో మంగళవారం విద్యా పరిపాలన నాయకత్వంపై వర్క్‌షాపు ముగింపు సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దార్శనికతతోనే అసలైన విద్యాభివృద్ధి జరుగుతుందన్నారు. విద్యా వ్యవస్థలో బోధన, పఠనానికి ప్రాధాన్యం ఉందని చెప్పారు. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ వారు అన్నింటికంటే ఈ అంశాన్ని ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఎస్వీ యూనివర్సిటీ డీన్ రామకృష్ణయ్య మాట్లాడుతూ మానవ వనురుల అభివృద్ధిశాఖ యువతను ఉన్నత విద్యవైపు ఆకర్షించి దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా కృషి చేస్తుందన్నారు. ప్రపంచంలో మొదటిసారిగా విజ్ఞాన సమాజం అనే నినాదాన్ని ఆచరణలోకి తెచ్చారని చెప్పారు. రిజిస్ట్రార్ శివశంకర్ మాట్లాడుతూ కేవలం విద్యను మాత్రమే కాకుండా సాహిత్య సాంస్కృతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వీలు కల్పించాలని కోరారు. అభివృద్ధి మార్గాలను, వాటి ఫలాలను వేగతరం చేయడమే విద్యార్థుల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ శ్రీనివాస్, వీఎస్‌యూ డీన్ చంద్రయ్య పాల్గొన్నారు.
Advertisement