గార: వమవరవల్లి డైట్ కళాశాలలో సీసీఈలో భాగంగా నిర్వహణా మూల్యాంకనంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సీసీఈ విధానంలో సంగ్రహణ మూల్యాంకనంపై 1 నుంచి 5 తరగతుల్లో ప్రశ్నాపత్రాలు తయారుచేస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్ తదితర సబ్జెక్టులపై ముగ్గురేసి నిపుణులు ప్రశ్నపత్రాలు తయారుచేస్తున్నారని ప్రిన్సిపాల్ ఎ. ప్రభాకరరావు చెప్పారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, భావ ప్రకటన వంటివి కలుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో డైట్ సీనియర్ లెక్చరర్లు తిరుమల చైతన్య, ఎస్.పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.