‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’ | Awareness Seminar On Examination Secretariat Jobs | Sakshi
Sakshi News home page

‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

Published Tue, Aug 20 2019 1:16 PM | Last Updated on Tue, Aug 20 2019 1:22 PM

Awareness Seminar On Examination Secretariat Jobs - Sakshi

సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాల పరీక్షలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించేందుకు తాడేపల్లిలో నిర్వహించిన రాష్ట్ర్రస్థాయి వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. రేపు సాయం​త్రానికి అన్ని జిల్లాల్లో స్టాంగ్‌ రూమ్‌లు సిద్ధం చేయాలన్నారు. ఈ సారి 1.26 లక్షల ఉద్యోగాలకు 22 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడా చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావుండకూడదన్నారు. ప్రణాళికబద్ధంగా పరీక్షలను నిర్వహించాలని చెప్పారు. అధికారులంతా బాధ్యతగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement