విద్యాప్రమాణాలు మెరుగుపర్చుకోవాలి
విద్యాప్రమాణాలు మెరుగుపర్చుకోవాలి
Published Mon, Sep 12 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
గూడూరు : నూతన విద్యావిధానాలను ఎప్పటికప్పుడు అనుసరిస్తూ విద్యాప్రమాణాలు మెరుగుపరచుకోవాలని డీఈఓ మువ్వా రామలింగం అన్నారు. స్థానిక ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని 25 గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు సోమవారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మూస విధానంలో కాకుండా పిల్లల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యేలా చూడాలన్నారు. అలాగే విద్యార్థులను చైల్డ్ ఇన్‌ఫోలో త్వరలో చేర్చాలన్నారు. విద్యార్థుల ఆధార్‌ను అనుసంధానం చేస్తూ ౖచెల్డ్ ఇన్‌ఫోలో చేర్చడం ద్వారా ఎస్‌ఎస్‌సీ బోర్డులో ఎన్‌రోల్ అవుతాయన్నారు. అలాగే ఎస్‌సీఈఆర్‌టీ(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్) నూతన పరీక్షా విధానంలో ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బాలరామిరెడ్డి, జిల్లా కామన్ ఎగ్జామినేషన్స్ సెక్రటరీ రమేష్‌బాబు, సీసీఈ కో–ఆర్డినేటర్ రామ్‌కుమార్, చైల్డ్ ఇన్‌ఫో ఇన్‌చార్జి చెంచురెడ్డి, మోటివేటర్ నరశింహారెడ్డి, ఆదిశంకర డైరెక్టర్ కృష్ణకుమార్, ఏఓ రామయ్య తదితరులు ఉన్నారు.
Advertisement