DEO Ramalingam
-
3 నుంచి పది మూల్యాంకనం
- సెల్ఫోన్లు తేవొద్దు - పేపర్ లీక్ కాలేదు.. అది మాల్‌ప్రాక్టీస్ - యాజమాన్యం పాత్ర ఉందని తేలితే స్కూల్‌ను బ్లాక్‌లిస్టులో పెడతాం - డీఈఓ రామలింగం నెల్లూరు(టౌన్) : పదో జవాబుపత్రాల మూల్యాం కనం వచ్చే నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం తెలిపారు. నెల్లూరులోని పొదలకూరురోడ్డులోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెయింట్ జోసెఫ్ స్కూల్లో మూల్యాంకనం చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాకు సుమారు 5 లక్షలకు పైగా జవాబుపత్రాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం డీకోడ్ జరుగుతోందన్నారు. మూల్యాంకనంలో 3,700 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొననున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సెల్ఫోన్లు అనుమతించమని చెప్పారు. కుటుంబసభ్యులతో మాట్లాడాలనుకుంటే డీఈఓ సెల్‌ఫోన్ నుంచి చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంగా ఉండటంతో.. పది పరీక్షలు జరిగే సమయంలో సెల్‌ఫోన్ అనుమతించలేదన్నారు. నారాయణ స్కూల్లో వాటర్ బాయ్ ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్ ద్వారా పంపించడం మాల్‌ప్రాక్టీస్ కిందకు వస్తుందన్నారు. ఆ గదిలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే సెల్‌ఫోన్‌తో ఫొటో తీశారని చెప్పారు. ప్రాథమిక విచారణ అనంతరం అనుమానంతో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విచారణలో టీచర్ పాత్ర ఉందని తేలితే సర్వీసు నుంచి తొలగిస్తామన్నారు. ఈ వ్యవహారంలో స్కూల్ యాజమాన్యం హస్తం ఉన్నట్లు విచారణలో తేలితే ఆస్కూల్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టనున్నుట్లు తెలిపారు. -
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
డీఈఓ రామలింగం అనుమసముద్రంపేట : ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు బాద్యతాయుతంగా పనిచేసి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని డీఈఓ మువ్వా రామలింగం తెలిపారు. మండలంలోని చిరమన గ్రామంలో రూ.10 లక్షల ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో నిర్మించిన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ గదులను ఈనెల 13వ తేదీన కేంద్ర, రాష్ట్ర మంత్రులు వెంకయ్యనాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో డీఈఓ ముందస్తుగా పరిశీలించేందుకు వచ్చారు. హెచ్ఎం, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. గదులను పరిశీలించి ఫర్నీచర్, కిటికీలు మరమ్మతులకు గురై ఉండటం చూసి చిన్నపాటి మరమ్మతులు చేయించుకోలేరా అని ప్రశ్నించారు. తక్షణం మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. ల్యాబ్‌లో అనవసరమైన కెమికల్స్‌ను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడొద్దు హెచ్ఎంలు కమీషన్ల కోసం అనవసరమైన కెమికల్స్, పరికరాలు కొనుగోలు చేయొద్దని డీఈఓ తెలిపారు. సైన్స్ ల్యాబ్‌లో విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఏఎస్‌పేట ఉన్నత పాఠశాలలో ఉర్దూ టీచర్ లేడని విలేకరుల ఆయన దృష్టికి తీసుకెళ్లగా కావలి నుంచి డెప్యుటేషన్ వేయిస్తామన్నారు. చిరమన ఎస్సీ పాఠశాలలో తక్కువ మంది విద్యార్థులున్నందున మెయిన్ పాఠశాలలో కలపాలని ఎంఈఓకు తెలిపారు. ఆయన వెంట ఎంఈఓ మహబూబ్‌జాన్, హెచ్ఎం ఫణీంద్ర, సీఆర్పీలు సుధాకర్, రఫీ, అంకయ్యనాయుడు ఉన్నారు. -
కార్పొరేట్ విద్యనందించడమే లక్ష్యం
డీఈఓ రామలింగం గూడూరు: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమని డీఈఓ మువ్వా రామలింగం పేర్కొన్నారు. స్థానిక జెడ్పీ బాలురు ఉన్నత పాఠశాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. డీఈఓ మాట్లాడుతూ జిల్లాలోని 100 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సోమవారం నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ మేరకే 6 నుంచి 10 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగిలిన పాఠశాలల్లో కూడా డిజిటల్ తరగతులు బోధించేందుకు దాతల సాయాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కార్పొరేట్ స్థాయికి తీసిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నో నూతన విద్యా వరవడులకు శ్రీకారం చుడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ మంజులాక్షి, ఎంఈఓ ఇస్మాయిల్, రవీంద్ర, రిసోర్స్ పర్సన్లు సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, ఖాధర్‌బాష, జగదీష్ పాల్గొన్నారు. -
దసరా తర్వాత కెరీర్ ఫౌండేషన్ కోర్సులు
డీఈఓ రామలింగం నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరం లాంటి కెరియర్ ఫౌండేషన్ కోర్సులను దసరా సెలవుల అనంతరం ప్రారంభిస్తున్నట్లు డీఈఓ మువ్వా రామలింగం తెలిపారు. స్థానిక దర్గామిట్ట జెడ్పీ సమావేశమందిరంలో శనివారం ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియం, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న 150 ప్రభుత్వ పాఠశాలల్లో కోర్సులను నిర్వహించేందుకు రూపొందించిన ప్రణాళికలను పకడ్బందీగా అమలుచేయాలన్నారు. 6,7,8 తరగతులకు కెరియర్ ఫౌండేషన్ కోర్సుల్లో భాగంగా ప్రతిరోజు గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు, బయోలజీతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. వారాంతంలో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. సమాధాన పత్రాల ఓఎంఆర్‌లను కంప్యూటర్ ద్వారా మూల్యాంకనం చేసి విద్యార్థులకు ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. ఈ నెల 27, 28, 29తేదీల్లో నెల్లూరు,కావలి,గూడూరు డివిజన్లలో ఎంపికచేసిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎయిడెడ్ స్కూళ్లలో సర్దుబాటు: ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు విషయమై మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఎయిడెడ్ పాఠశాలల కరస్పాండెంట్లుతో, హెచ్ఎంలతో డీఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫౌండేషన్కోర్సు నిర్వహణపై డాక్టర్ వెంకటేశ్వరరావు, కృపానందంలు అవగాహన కల్పించారు. -
నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు
నెల్లూరు(టౌన్) : పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ మువ్వా రామలింగం, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారి కనకనరసారెడ్డిలు తెలిపారు. గురువారం నెల్లూరులోని డీఈఓ కార్యాలయంలో ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ విద్యాలయాలను సందర్శించి మౌలిక వసతులపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. మండల పరిధిలో పనిచేసే ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనితీరుపై వివరాలు ఇవ్వాలని ప్లానింగ్ కో–ఆర్డినేటర్ రమణారెడ్డికి తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్య కమిటీ వివరాలు శుక్రవారం లోపు అందజేయాలని సూచించారు. ప్రతి సోమవారం ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులతో సమావేశం జరుపుతామన్నారు. -
విద్యాప్రమాణాలు మెరుగుపర్చుకోవాలి
గూడూరు : నూతన విద్యావిధానాలను ఎప్పటికప్పుడు అనుసరిస్తూ విద్యాప్రమాణాలు మెరుగుపరచుకోవాలని డీఈఓ మువ్వా రామలింగం అన్నారు. స్థానిక ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని 25 గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు సోమవారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మూస విధానంలో కాకుండా పిల్లల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసి ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలన్నారు. అలాగే విద్యార్థులను చైల్డ్ ఇన్ఫోలో త్వరలో చేర్చాలన్నారు. విద్యార్థుల ఆధార్‌ను అనుసంధానం చేస్తూ ౖచెల్డ్ ఇన్ఫోలో చేర్చడం ద్వారా ఎస్ఎస్సీ బోర్డులో ఎన్రోల్ అవుతాయన్నారు. అలాగే ఎస్సీఈఆర్టీ(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్) నూతన పరీక్షా విధానంలో ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బాలరామిరెడ్డి, జిల్లా కామన్ ఎగ్జామినేషన్స్ సెక్రటరీ రమేష్‌బాబు, సీసీఈ కో–ఆర్డినేటర్ రామ్‌కుమార్, చైల్డ్ ఇన్ఫో ఇన్చార్జి చెంచురెడ్డి, మోటివేటర్ నరశింహారెడ్డి, ఆదిశంకర డైరెక్టర్ కృష్ణకుమార్, ఏఓ రామయ్య తదితరులు ఉన్నారు. -
ఆదివారం పాఠశాలలకు సెలవు లేదు
ఒంగోలు వన్‌టౌన్: బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆదివారం పాఠశాలలకు ఎటువంటి సెలవు లేదని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం స్పష్టం చేశారు. ఆదివారం నాడు అన్ని పాఠశాలల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలని ఆయన పేర్కొన్నారు. సహపంక్తి భోజనానికి అయ్యే ఖర్చును మధ్యాహ్న భోజన పథకంలో చూయించాలని సూచించారు. ఆదివారం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల్లో ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు యోగ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకత గురించి వివరించాలని విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందుతున్న రాయితీలు, ఇతర సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
పాపం పండింది
సస్పెన్షన్లు కొత్తేమీకాదు పనిచేసిన ప్రతి జిల్లాలో వివాదాలు పెట్టుకోవడం, సస్పెన్షన్లు కొని తెచ్చుకోవడం డీఈఓకు అలవాటే. చిత్తూరు జిల్లాలో కలెక్టర్ ఈయన బాధలు భరించలేక సరెండర్ చేశారు. శ్రీకాకుళంలో ఉద్యమాలతో తరిమేశారు. గుంటూరులో ఏసీబీ కేసులో జైలు కెళ్లారు. కర్నూల్లో ఉపాధ్యాయులు వీధుల గుండా తరుముకుంటూ చొక్కా చింపి కొట్టారు. నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: డీఈఓ మువ్వా రామలింగం పాపం ఎట్టకేలకు పండింది. ఎన్నితప్పులు చేసినా తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో విర్రవీగుతున్న ఆయనపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. డీఈఓపై ఉన్న అవినీతి ఆరోపణలను పరిశీలించిన ప్రభుత్వం శనివారం రాత్రి వేటు వేసింది. మువ్వా రామలింగాన్ని సస్పెండ్ చేస్తూ జీఓ 143ను విడుదల చేసింది. గవర్నర్ నరసింహన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేష్‌తివారి ఈ జీఓను విడుదల చేశారు. కలెక్టర్ శ్రీకాంత్ డీఈఓ అక్రమాలను వివరిస్తూ గత నెల 30వ తేదీన పంపిన నివేదిక ఆర్సీ నంబర్ ఏ1/11972014ను ఆధారం చేసుకున్న ప్రభుత్వం సీసీఏ రూల్సు 1991 ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు జీఓలో వివరించారు. అప్పటికే సాక్షి దినపత్రికలో వరుసగా డీఈఓ అక్రమాలపై పలు కథనాలు ప్రచురితమయ్యాయి. సెలవులపై సందిగ్ధత, ప్రభుత్వ ఆర్డర్లతో అక్రమ ట్రాన్స్ఫర్లు, అంతా నాఇష్టం, ప్రశ్నిస్తే వేధిస్తా, డీఈఓ గారు ఈ పాపం ఎవరిది, నవ్విపోదురుగాక తదితర శీర్షికలతో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలను కలెక్టర్ పరిశీలించి వాటిని కూడా నివేదికలో పొందుపరిచారు. అలాగే డీఈఓ అక్రమాలపై దీర్ఘకాలికంగా యూటీఎఫ్, ఎంఈఎఫ్, డీటీఎఫ్, ఏపీటీఎఫ్(1938) ఉపాధ్యాయులు చేస్తున్న నాయ్యమైన పోరాటాల గురించి నివేదికలో క్షుణ్ణంగా వివరించారు. ఈ వివరాలన్నీ పరిశీలించిన గవర్నర్ జీఓ విడుదలకు ఆదేశాలు జారీచేశారు. విడుదలైన క్షణం నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాలున్నాయి. అంతేకాదు తమ ఆదేశాలు లేకుండా నెల్లూరు నగరాన్ని వీడరాదని ఆంక్షలు కూడా విధించారు. దీంతో డీఈఓకు దిమ్మ తిరిగింది. ఇదీ డీఈఓ చరిత్ర: డీఈఓ గతంలో ఇక్కడ డిప్యూటీ ఈఓగా, ఇన్చార్జి డీఈఓగా బాధ్యతలు నిర్వహించి పలు విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రైవేటు పాఠశాలల యజమానులతో కుమ్మక్కు కావడం, వారికి అనుకూలంగా పదో తరగతి సెంటర్లు ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ ప్రోత్సహించడం, డీఎస్సీలో అక్రమాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయులను వేధించడం ఆయనకే చెల్లింది. కొంతకాలం ఇతర జిల్లాల్లో పనిచేసిన డీఈఓ మళ్లీ నెల్లూరు డీఈఓగా 2011 జూన్ 17వ తేదీన బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అడ్డమైన దారులు తొక్కారు. ప్రశ్నించే వారి పాఠశాలలపై ఒకటికి పదిసార్లు తనిఖీలు పేరుతో డిప్యూటీ ఈఓను పంపించి వేధిం చడం, భయాందోళనలకు గురిచేయడం కుంటిసాకులతో ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం విధేయతగా ఉంటే సస్పెండ్‌లో ఉన్న శేషాద్రివాసు లాంటి ప్రధానోపాధ్యాయులను అత్యున్నత విధులకు నియమించడం. రాజకీయ అండతో ఇష్టారాజ్యంగా ప్రవ ర్తించడం డీఈఓ కార్యాలయంలోని ఒక ఉద్యోగి ఓ హోటల్ వ్యాపార లావాదేవీలలో ఆరు నెలలు సస్పెండ్ అయినా ఆయనకు ఇంక్రిమెంటు ఇవ్వడం డీఈఓ కార్యాలయం బడ్జెట్‌ను ఇష్టారాజ్యంగా డైవర్ట్ చేయడం