నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు | quality education to students | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు

Sep 15 2016 11:43 PM | Updated on Sep 4 2017 1:37 PM

నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు

నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు

నెల్లూరు(టౌన్‌) : పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ మువ్వా రామలింగం, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారి కనకనరసారెడ్డిలు తెలిపారు.

నెల్లూరు(టౌన్‌) :  పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ మువ్వా రామలింగం, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారి కనకనరసారెడ్డిలు తెలిపారు. గురువారం నెల్లూరులోని డీఈఓ కార్యాలయంలో ఎంఈఓలు, సెక్టోరియల్‌ అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ విద్యాలయాలను సందర్శించి మౌలిక వసతులపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. మండల పరిధిలో పనిచేసే ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనితీరుపై వివరాలు ఇవ్వాలని ప్లానింగ్‌ కో–ఆర్డినేటర్‌ రమణారెడ్డికి తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్య కమిటీ వివరాలు శుక్రవారం లోపు అందజేయాలని సూచించారు. ప్రతి సోమవారం ఎంఈఓలు, సెక్టోరియల్‌ అధికారులతో సమావేశం జరుపుతామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement