కార్పొరేట్ విద్యనందించడమే లక్ష్యం
-
డీఈఓ రామలింగం
గూడూరు:
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమని డీఈఓ మువ్వా రామలింగం పేర్కొన్నారు. స్థానిక జెడ్పీ బాలురు ఉన్నత పాఠశాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. డీఈఓ మాట్లాడుతూ జిల్లాలోని 100 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సోమవారం నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ మేరకే 6 నుంచి 10 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగిలిన పాఠశాలల్లో కూడా డిజిటల్ తరగతులు బోధించేందుకు దాతల సాయాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కార్పొరేట్ స్థాయికి తీసిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నో నూతన విద్యా వరవడులకు శ్రీకారం చుడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ మంజులాక్షి, ఎంఈఓ ఇస్మాయిల్, రవీంద్ర, రిసోర్స్ పర్సన్లు సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, ఖాధర్‌బాష, జగదీష్ పాల్గొన్నారు.