నూతన ఏఓల శిక్షణ కార్యక్రమంలో మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పంటల సాగువైపు రైతాం గాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రధా నంగా పంటల మార్పిడిపైన విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన వ్యవసాయ అధికారులకు శనివారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రానున్న ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా ని లబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోం దని అన్నారు. ప్రభుత్వ సంకల్పంలో వ్యవసాయాధికారులంతా భాగస్వామ్యం కావాలన్నారు. సాంకేతికంగా వస్తున్న మార్పుల ను, పద్ధతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్‌డేట్ కావా లన్నారు.
నూతన విషయాలు తెలుసుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, కోర్సు కోఆర్డినేటర్ ఉషారాణి, ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ శశాంక్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన అధికారులు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం రూ.51 వేల చెక్కును మంత్రి తుమ్మలకు అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment