Commercial crops
-
వాణిజ్య పంటలవైపు రైతులను ప్రోత్సహించాలి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పంటల సాగువైపు రైతాం గాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రధా నంగా పంటల మార్పిడిపైన విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన వ్యవసాయ అధికారులకు శనివారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రానున్న ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా ని లబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోం దని అన్నారు. ప్రభుత్వ సంకల్పంలో వ్యవసాయాధికారులంతా భాగస్వామ్యం కావాలన్నారు. సాంకేతికంగా వస్తున్న మార్పుల ను, పద్ధతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్డేట్ కావా లన్నారు. నూతన విషయాలు తెలుసుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, కోర్సు కోఆర్డినేటర్ ఉషారాణి, ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ శశాంక్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన అధికారులు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం రూ.51 వేల చెక్కును మంత్రి తుమ్మలకు అందచేశారు. -
అభివృద్ధికి కేరాఫ్ పల్నాడు
‘దాస్యమూ, దోపిడీ, దారిద్య్రమూ హెచ్చి, పాడిపంటల మేలు బంగారు నా తల్లి, కరవు కాపురమైందిరా పలనాడు.. కంటనీరెట్టిందిరా’ అంటూ కవి పులుపుల ఎంతో ఆవేదన చెందాడు ఆనాడు. ఇక మళ్లీ అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఈ పలనాటి సీమ దరి చేరకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఇక్కడి మాగాణుల్లో ఆయకట్టు పెంచి ఆదాయ వనరులు పుష్కలంగా పెంపొందించేందుకు అన్ని అవకాశాలు కల్పించింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు నేడు ఫలనాడుగా మారనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వరికిపూడిశెల ప్రాజెక్టు కూడా రానుండటంతో పల్నాడు జిల్లాలో ఆయకట్టు పెరగనుంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పలనాడులోకే సాగునీటి ప్రాజెక్టులన్నీ రావడం విశేషం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాచర్ల నియోజకవర్గంలో ఉంటే, పులిచింతల ప్రాజెక్టు పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో ఉంది. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 41.8813 టీఎంసీలు ఉంది. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 544.90 అడుగులకు చేరింది. ఇది 198.6870 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకి 4,459, ఎడమకాలువకి 6,097, ఎస్ఎల్బీసీకి 1,650, వరదకాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగునీటికి ఇబ్బందులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. వెనకబడిన పల్నాడు ప్రాంతంలో చెంతనే కృష్ణానది ఉన్నప్పటికీ సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. బుగ్గవాగు రిజర్వాయర్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీరు సరైన సమయంలో అందక పంటలు ఎండుముఖం పట్టేవి. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వరికపూడిశెలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ ఎత్తిపోతల పూర్తి అయితే 73 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి లేకుండా చూడవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బొల్లాపల్లి మండలంలో 25 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందటంతో పాటు వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. అలాగే ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో కూడా సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. నూజెండ్ల మండలంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.95 కోట్లతో 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసేందుకు సర్వే పూర్తి చేశారు. నూజెండ్ల మండలం కంభంపాడు, కొత్తపాలెం, పువ్వాడ, ములకలూరు, ఉప్పలపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు వాణిజ్య పంటలకు పల్నాడు కేరాఫ్‌గా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పండే పత్తి, మిర్చి పంటలు 90 శాతం పల్నాడులోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది రికార్డు స్థా యిలో 2,66,640 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సుమారు రెండు లక్షల ఎకరాల వరకూ పల్నాడు ప్రాంతంలోనే సాగైంది. జిల్లాలో మాచర్ల, దుర్గి, రెంటచింతల, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజు పాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, ఫిరంగిపురం, మేడికొండూరు, అమరావతి, బెల్లంకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల తదితర మండలాల్లో విస్తారంగా మిర్చి పంట సాగు చేశారు. మరోవైపు పత్తిని తీసుకుంటే జిల్లాలో 4,23,750 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది గులాబీ రంగు పురుగు ఉధృతి వల్ల 2,73, 950 ఎకరాల్లోనే సాగు అయ్యింది. అందులో కూడా 90 శాతం పల్నాడులోనే సాగు అయ్యింది. పల్నాడు ప్రాంతంలో 2.81 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో 7,13,142 ఎకరాలు సాధారణ విస్తీర్ణం ఉంది. భవిష్యత్‌లో కూడా వాణిజ్య పంటల కారణంగా పల్నాడు జిల్లాకు ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాష్ట్రంలో అధిక ఆదాయం పొందే జిల్లాల్లో పల్నాడు కూడా నిలిచే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. -
గంజాయి.. ఇక గతమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతేడాది వరకు గంజాయి పండించిన పొలాలు ఉద్యాన పంటల క్షేత్రాలుగా మా రుతున్నాయి. గిరి శిఖరాల నడుమ మారుమూలన ఉండే ఆ పొలాల్లో ఇప్పుడు విదేశీ కూరగాయలతో పా టు కాఫీ, పసుపు, స్ట్రాబెర్రీ వంటి పంటలు పురుడు పో సుకుంటున్నాయి. గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడమే కాకుండా ఆ పొలాల్లో ఉద్యాన పంటలు పండించేలా గిరిజనులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. గంజాయి సాగును సమూలంగా నిర్మూలించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయానికి అనుగుణంగా.. లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ సాగువైపు అడుగులు పడుతున్నాయి. గిరిజనులకు ప్రోత్సాహకాలందిస్తూ.. వాణిజ్య పంటల సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్పటి పాలకులు పట్టించుకోక.. మన్యంలో గిరిజనులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నా అప్పటి పాలకులు సరిగ్గా పట్టించుకోకపోవడం వంటి పరిస్థితుల్లో అక్కడి గిరిజన రైతుల్లో కొం దరు గంజాయి సాగువైపు ఆకర్షితులయ్యారు. అలా విశాఖ మన్యంలో గంజాయి సాగు సుమారు 10 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించింది. ఎట్టిపరిస్థితుల్లో గంజా యి సాగుపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం రంగంలోకి దిగింది. ఫలితంగా గతేడాది వరకు సగటున 10 వేల ఎకరాల్లో సాగయ్యే గంజాయి పంట రెండేళ్లలో 7 వేల ఎకరాలకు పడిపోయింది. పోలీసులు, సెబ్, ఐటీడీఏ, సచివాలయ సిబ్బంది డ్రోన్ల సహాయంతో గంజాయి సాగును గుర్తించి.. ఆ భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించకపోతే తిరిగి గంజాయి వైపు గిరి జనులు మొగ్గుచూపే ప్రమాదం ఉండటంతో మూడేళ్లలో లక్షకు పైగా ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సా గు చేపటేఊ్టలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా 62 వేల మంది గిరిజనులకు 98 వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా అందించి ఆ భూములపై వారికి యాజమాన్య హక్కులు కల్పిం చింది. వీటితో పాటు గంజాయి సాగైన 7 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగు చేయిస్తోంది. శిక్షణ ఇచ్చి మరీ.. వాణిజ్య పంటలపై గిరిజనులకు అవగాహన కల్పించడంతో పాటు సాగు రీతులు, సస్యరక్షణపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించేలా ప్రభుత్వం చేర్యలు చేపట్టింది. ముఖ్యంగా వేరుశనగ, రాజ్మా, రాగులు వంటి పంట లతో పాటు డ్రాగన్ ఫ్రూట్, లిచీ, పైనాపిల్, అవకాడో, స్ట్రాబెర్రీ, అల్లం, నల్ల మిరియాలు, పొద మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళాదుంప, టమోటా, కాకర, బీర, బెండ వంటి ఉద్యాన పంటలను 46,650 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు రానున్న రెండేళ్లలో 34 వేల ఎకరాల్లో కాఫీ గింజల సాగుకు సన్నద్ధం చేయాలని అధికారులు భావి స్తున్నారు. మరో 5 వేల ఎకరాల్లో రూ.100 కోట్లతో పసుపు పండించనున్నారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి రూ.144 కోట్లు ప్రతి గిరిజనుడు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా మూడేళ్లకు అభివృద్ధి ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.144 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. స్వచ్ఛందంగా సాగు వైపు.. ప్రభుత్వం చేపడుతున్న చైతన్య కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంతో గిరిజనులు ఈ ఏడాది స్వచ్ఛందంగా గంజాయి సాగును విడనాడారు. ప్రభుత్వం కేవలం ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి చేతులు దులిపేసుకోకుండా.. గిరిజన రైతులకు పూర్తిస్థాయి సహకారం అందించాలని నిర్ణయించింది. విత్తనాలు సరఫరా చేయడంతోపాటు పంట చేతికి వచ్చేంత వరకు సహకారం అందిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. జామ్, జ్యూస్‌గా మార్చడం, పల్పింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ వంటి పనులు చేపట్టేలా వారిని ప్రోత్సహిస్తామన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా.. పంట ఆదాయం చేతికొచ్చేంత వరకూ గిరిజన రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. -
మద్దతు కన్నా మిన్న
సాక్షి, అమరావతి: రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ ఏడాది వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ముఖ్యంగా అపరాలతో పాటు పత్తి, మిరప, పసుపు వంటి వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు మించి రైతుకు లభిస్తోంది. కోవిడ్ నేపథ్యంలోనూ రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధితో ఎమ్మెస్పీ దక్కని వ్యవసాయ, వాణిజ్య పంటలను కొనుగోలు చేసింది. పొగాకుతో సహా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుము, వేరుశనగ, పత్తి, పసుపు, ఉల్లి, టమాట తదితర పంటలకు మార్కెట్ జోక్యంతో కనీస మద్దతు ధర దక్కేలా చేసింది. ఆ ప్రభావం ఈ ఏడాది వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలపై కన్పిస్తోంది. ప్రభుత్వ జోక్యం వల్లే వ్యాపారుల మధ్య పోటీ ► మార్క్‌ఫెడ్ ద్వారా 2019–20లో 3,16,610 మంది రైతుల నుంచి రూ.3,735.56 కోట్ల విలువైన 9,83,189 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.103.45 కోట్ల విలువైన 12.93 మిలియన్ కిలోల పొగాకును కిలో రూ.81 చొప్పున కొనుగోలు చేసింది. ► 2020–21లో 1,23,652 మంది రైతుల నుంచి రూ.2,420.09 కోట్ల విలువైన 8,28,211.55 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ధర తగ్గిన ప్రతీసారి ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుంటుండడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ► ఈ కారణంగా ఈ ఏడాది ఊహించని విధంగా వ్యవసాయ, వాణిజ్య పంటలకు రైతులకు మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. గత మూడేళ్లలో దక్కని ధరలు లభిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2021–22 సీజన్లో ఇప్పటి వరకు కేవలం 1,766 మంది రైతుల నుంచి రూ.14.62 కోట్ల విలువైన 3,665 టన్నుల ఉత్పత్తులను మాత్రమే మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి ఆలోచన మేరకు సీజన్ ముగిసే సమయంలో ఎమ్మెస్పీ, క్వాలిటీ పట్ల రైతుల్లో అవగాహన కల్పించడం, కోతలకు ముందుగానే కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయడం మార్కెట్లో వ్యాపారుల మధ్య పోటీకి కారణమైంది. ఎగబాకుతున్న అపరాలు, వాణిజ్య పంటల ధరలు ► ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచే అపరాలు, వాణిజ్య పంటల ధరలు ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్నాయి. ప్రధానంగా పత్తి, మిరప, పసుపు, మినుము, వేరుశనగ, టమాటా పంటలు రికార్డు స్థాయి ధర పలుకుతున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా పసుపు, పత్తి, మిరప పంటలకు ఈసారి మంచి ధర పలుకుతోంది. ► మిగిలిన పంటలకు సంబంధించి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. పసుపు ఓ దశలో రూ.7,900 వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ.7,250 వద్ద నిలకడగా ఉంది. ఇక పత్తి అయితే ఈసారి రైతులకు సిరులు కురిపించింది. ► తొలిసారి క్వింటాల్ రూ.9,600 మార్క్‌ను అందుకుంది. కొత్త ఏడాదిలో రూ.10 వేల మార్క్‌ను అందు కుంటుందని అంచనా వేస్తున్నారు. క్వాలిటీ మిరప తొలిసారిగా క్వింటాల్ రూ.20 వేల మార్క్‌ను అందుకుంటోంది. రూ.13 వేలతో మొదలై.. నెమ్మదిగా ఎగబాగుతోంది. తామర పురుగు ప్రభావంతో ఈసారి దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఇది కూడా ధర పెరిగేందుకు దోహద పడిందంటున్నారు. ► వేరుశనగ ధర కూడా ఎమ్మెస్పీకి మించి పలుకుతోంది. ఓ దశలో కందులు, పెసల ధరలు పెరిగినప్పటికీ ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. రెండేళ్లుగా కనీస మద్దతు ధర దక్కని మొక్క జొన్న మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఎమ్మెస్పీకి దీటుగానే పలుకుతోంది. పత్తి బంగారమైంది.. పత్తికి మంచి ధర వస్తోంది. గతంలో ఎప్పుడూ ఇంత ధర చూడలేదు. ఆదోని మార్కెట్‌కు 4 క్వింటాళ్ల పత్తి తీసుకెళ్లా. వ్యాపారులు పోటీ పడి క్వింటాల్ రూ.9,611 చొప్పున కొన్నారు. చాలా ఆనందంగా ఉంది. – కె.మహాలక్ష్మి, కౌతాలం, కర్నూలు జిల్లా వ్యాపారులు పోటీపడ్డారు నేను 5 క్వింటాళ్ల పత్తిని ఆదోని మార్కెట్ యార్డుకు తీసుకెళ్లా. క్వాలిటీ బాగుండడంతో వ్యాపారులు పోటీ పడ్డారు. క్వింటాల్ రూ.9,591 చొప్పున కొనుగోలు చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత ధర పలకలేదు. – ఈశ్వరప్ప, కమ్మలదిన్నె, కర్నూలు జిల్లా మిరప రైతులకు మంచి రోజులు గతేడాది మూడెకరాల్లో వేసిన మిరపను ఏసీ గోడౌన్లో భద్రపరిచాను. ప్రస్తుతం రేటు భారీగా పెరగడంతో మార్కెట్‌కు తీసుకెళ్లాను. క్వింటాల్ రూ.16 వేలు పలికింది. ఈ ఏడాది వేసిన పంట తామర పురుగు ప్రభావంతో దెబ్బతినింది. ఈ ఏడాది కూడా మంచి దిగుబడి వస్తే మంచి రేటు వచ్చేది. – విఘ్నేశ్వరరెడ్డి, అంబాపురం, గుంటూరు జిల్లా -
మిర్చిని మింగేస్తోంది
సాక్షి, అమరావతి: వాణిజ్య పంటల్లో ప్రధానమైన మిర్చికి కాయ కుళ్లు సోకి రైతులను అపార నష్టాలకు గురి చేస్తోంది. ప్రస్తుత వాతావరణం, అకాల వర్షాలు, మంచు, భూమిలో తేమ వంటి వాటి వల్ల ఈ తెగులు సోకుతోంది. దీనివల్ల మార్కెట్లో ధర పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖాధికారులు రైతుల్ని అప్రమత్తం చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. శాస్త్రవేత్తల బృందంతో కలిసి రైతులకు నేరుగా సూచనలు, సలహాలు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తెగులు పరిస్థితి ఇలా.. ప్రస్తుతం మిరప కాయ పండే దశలో కొంత, కోత దశలో మరికొంత ఉంది. కోత తర్వాత రవాణా, నిల్వ చేసే దశలో కూడా ఈ తెగులు రావొచ్చు. ఇప్పటికే పలుచోట్ల కాయ కుళ్లు సోకి తాలు కాయలుగా మారి రైతులు నష్టపోతున్నారు. కొల్లిటోట్రైకమ్ అనే శిలీంధ్రం వల్ల ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల 10నుంచి 54 శాతం వరకు దిగుబడి తగ్గిపోతుంది. కాయ నాణ్యత లోపిస్తుంది. పూత సమయంలో మొదలై ఈ నెలాఖరు (మార్చి) వరకు ఈ తెగులు కనిపిస్తూనే ఉంది. అకాల వర్షాలు పడితే తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నీటి పారుదల కింద సాగయ్యే తోటల్లో ఈ బెడద ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి నేలకు దగ్గరగా ఉన్న వాటి కాయలు లేదా ఆకులపై కాయ కుళ్లు లక్షణాలను గమనించవచ్చు. పండు కాయలపై తొలుత చిన్న నీటి మచ్చలు ఏర్పడి క్రమేపీ పెరుగుతాయి. మచ్చలు నలుపు రంగులోకి మారతాయి. తెగులు ఉధృతి ఎక్కువయ్యే కొద్దీ మచ్చల మధ్య భాగంలో వలయాలు ఏర్పడతాయి. పచ్చి కాయలకు కూడా శిలీంధ్రం సోకుతుంది. కానీ.. కాయ పండిన తరువాతే లక్షణాలు బయట పడతాయి. కుళ్లిన కాయలు రాలిపోతాయి. తెగులు ఆశించిన కాయలు ఎండిన తరువాత తాలు కాయలుగా మారతాయి. తాలు కాయలకు మార్కెట్లో ధర వుండదు. నివారణ ఎలాగంటే.. పంట మారుస్తుండాలి. విత్తనం నుంచి తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున మేలైన కాయ నుంచి విత్తనాన్ని సేకరించి శుద్ధి చేయాలి. ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కాప్టా్టన్తో లేదా 3 గ్రాముల మాంకోజెబ్ పట్టించి శుద్ధి చేయాలి. కాయలు పండటం మొదలైన వెంటనే ముందుజాగ్రత్త చర్యగా మాంకోజెబ్, కార్బండిజమ్ 2.5 గ్రాములు లేదా క్లోరోదలోనిల్ 2 గ్రాములు, ప్రోపినెబ్ 2 గ్రాముల్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఆశిస్తే అజాక్స్ స్త్రోబిన్, ప్రోపికొనజోల్, డైఫిన్ కొనజోల్, కాపర్ హైడ్రాక్సైడ్, పైరా క్లోస్ట్రోబిన్, మేటిరమ్, టేబుకోనజోల్, ట్రైప్లొక్స్ స్త్రోబిన్ మందులలో ఏదో ఒక దానిని 10 రోజుల వ్యవధిలో 2, 3 సార్లు పిచికారీ చేయాలని గుంటూరు లాంఫామ్‌లోని ఉద్యాన పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.హరిప్రసాదరావు సూచించారు. నేటినుంచి శాస్త్రవేత్తల బృందాల పర్యటన కాయ కుళ్లు తెగులుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. కాయ కోసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా చేలల్లో ఉన్న కాయలు నాణ్యత కోల్పోకుండా కాపాడుకునేందుకు సూచనలు, సలహాలను ఈ బృందం ఇస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్న తరుణంలో రైతులకు అవగాహన కల్పిస్తే ఇప్పుడే కాకుండా భవిష్యత్‌లోనూ మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు హనుమంతరావు చెప్పారు. తెగులు ఉధృతికి కారణాలివీ - తెగులును తట్టుకోలేని రకాల సాగు - ఏకరూప పంట వేయడం - కాయ పండే దశలో వర్షాలు కురవడం - నీటి తడులు ఎక్కువగా పెట్టడం, తేమ ఎక్కువగా ఉండటం - ఆకులు, కాయలపై తేమ ఎక్కువ సేపు ఉండటం - 20–24 డిగ్రీల ఉష్ణోగ్రత, 80 శాతం కంటే ఎక్కువ తేమ ఉండి మంచు ఎక్కువగా కురవడం -
వాణిజ్య పంటలకు ఒక్కసారే పెట్టుబడి!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌లో వేస్తే రబీలోనూ కొనసాగే వాణిజ్య పంటలకు ఒక సీజన్‌కు మాత్రమే పెట్టుబడి రాయితీ పథకం వర్తించనుంది. ఈ మేరకు ఖరీఫ్‌లో వేసే పత్తి, మిర్చి, పసుపు రైతులకు ఒకసారే పెట్టుబడి కింద రూ.4 వేల చొప్పున చెల్లిస్తారు. అవి రబీలోనూ కొంతకాలం కొనసాగనున్నందున ఆ రైతులకు రెండో సీజన్ కింద పెట్టుబడి సొమ్ము చెల్లించే అవకాశాలు లేవని వ్యవసాయ శాఖ వర్గాలు తేల్చిచెప్పాయి. ఆ ప్రకారం పత్తి, మిర్చి, పసుపు సాగు చేసే రైతులకు రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.4 వేలు అందజేస్తారు. వాస్తవానికి సీజన్‌కు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఖరీఫ్, రబీలకు కలిపి రూ.8 వేలు రైతులకు అందించాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో ఈ రైతులు నష్టపోయే అవకాశం ఉంది. మరోవైపు ఏడాదిపాటు ఉండే చెరకు పంటకు రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేలు ఇస్తారు. అలాగే పండ్లు, ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు రెండు సీజన్ల డబ్బులు అందుతాయి. సగం వాటా ఆ పంటలదే రాష్ట్రంలో ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. అందులో అత్యధికంగా పత్తి సాగవుతుంది. ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, మిర్చి 1.70 లక్షల ఎకరాలు, పసుపు 1.17 లక్షల ఎకరాలు. ఈ మూడింటి సాధారణ సాగు విస్తీర్ణమే 44.77 లక్షల ఎకరాలు. 2017–18 ఖరీఫ్‌లో అన్ని పంటలు కలిపి 97.45 లక్షల ఎకరాల్లో సాగవ్వగా.. అందులో పత్తి 47.72 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి తీత మూడు సార్లు కొనసాగుతుంది. పరిస్థితి బాగుంటే నాలుగో సారి తీస్తారు. ఖరీఫ్‌లో వేసే ఈ పంట జనవరి, కొన్నిసార్లు ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. మిర్చిది కూడా అదే పరిస్థితి. ఇక పసుపు 8 నెలల వరకు కొనసాగే పంట. వీటి కోత అనంతరం రబీలో మరో పంట వేసే పరిస్థితి రైతుకు అంతగా ఉండదు. దీంతో ఆ రైతులంతా రెండో సీజన్‌కు పెట్టుబడి రాయితీని తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆ మూడు పంటలు సాగు చేసే దాదాపు 25 లక్షల మంది రైతులు రబీ కాలానికి పెట్టుబడి రాయితీని అందుకోలేరు. ఆ 3 పంటల విస్తీర్ణం తగ్గే అవకాశం రబీలో పెట్టుబడి రాయితీ వచ్చే అవకాశం లేకపోవడంతో.. పత్తి, మిర్చి, పసుపు పంటల సాగు గణనీయంగా తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా రైతులకు పత్తి, మిర్చి పంటలతో చాలా సందర్భాల్లో నష్టమే వాటిల్లుతుంది. ఆత్మహత్యలు చేసుకునే రైతుల్లో పత్తి పండిస్తున్న వారే అధికంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పంటలకు రెండో సీజన్‌కు డబ్బులు ఇవ్వకుంటే ఆ పంట లు సాగు చేసి ఏం ప్రయోజనం అనే భావన రైతులకు కలుగుతుంది. వారు ఇతర పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కౌలు రైతులకు ‘పెట్టుబడి’ లేదు కౌలు చేసే రైతులెవరికీ పెట్టుబడి పథకం కింద నగదు అందే పరిస్థితి లేదు. భూ యజమానికే సొమ్ము ఇస్తారు. ఇలా చేయడం వల్ల కౌలు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనిపై ‘సాక్షి’తో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కౌలు రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం సాధ్యం కాదని, అలా చేస్తే భూ యజమానులు వ్యతిరేకిస్తారని తెలిపారు. కౌలుదారులు, భూ యజమానులకు మధ్య ఎలాంటి అధికారిక ఒప్పం దం లేనందున ఇది అసాధ్యమని చెప్పారు. -
రాష్ట్రంలో ఆహార భద్రతపై కేంద్రం దృష్టి
ఈ ఏడాదికి రూ. 89.42 కోట్లు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల్లో ఉత్పత్తి, ఉత్పాదకత పెంచే లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ ఆహార భద్రత మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ ఏడాదికి గాను రూ. 89.42 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద రాష్ట్రం కూడా తన వాటా నిధులను సమకూరుస్తుంది. కేంద్ర నిధుల్లో వరి ఉత్పత్తి కోసం రూ. 34.04 కోట్లు, పప్పుధాన్యాల సాగుకు రూ. 46.45 కోట్లు కేటాయించారు. వరి ఉత్పత్తి కోసం హెక్టారుకు రూ. 7,500 కేటాయిస్తారు. అలాగే భూసారాన్ని కాపాడటం, రైతుల వ్యక్తిగత ఆదాయాన్ని వృద్ధి చేయడం వంటి లక్ష్యాలను కూడా నిర్దేశించారు. అందుకోసం రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రణాళికను తయారుచేసింది. సాగునీటి వనరులు ఉండి ఉత్పాదకత తక్కువ ఉన్న ప్రాంతాలను, అలాగే వర్షాభావ ప్రాంతాలను కూడా గుర్తించాలని నిర్ణయించారు. ఉత్పాదకతను పెంచేందుకు క్లస్టర్లను ఏర్పాటు చేసి మిషన్ కార్యక్రమాలను చేపడతారు. అలాగే ఈ మిషన్ కింద వ్యవసాయ యంత్రాలను ఉపయోగించడం, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను రైతులకు వివరిస్తారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు నిధులను అందజేస్తారు. మిషన్‌లో భాగంగా రైతులకు 2,199 పంపుసెట్లను ప్రోత్సాహకంగా అందజేస్తారు. వాటి కోసం రూ. 2.19 కోట్లు కేటాయించారు. అలాగే పచ్చిరొట్ట విత్తనాలను కూడా రైతులకు అందజేస్తారు. మారుమూల ప్రాంతాల్లోని రైతులకు దీనిపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల ద్వారా చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. -
ఇవేం లెక్కలు..?
అన్నదాతల కష్టాలు పాలకులకు పట్టడం లేదు. కాలం కలిసి రాక.. అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడంలో అటు అధికారులు, ఇటు పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్యను తక్కువ చేసి చూపించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రెండేళ్లలో సుమారు 70 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే.. అధికారుల జాబితాలో మాత్రం 14 మంది రైతులు మాత్రమే చనిపోయినట్లు చూపించడం గమనార్హం. అందులోనూ కేవలం రెండు కుటుంబాలకే పరిహారం అందింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.- సాక్షి ప్రతినిధి, ఖమ్మం ⇒ ప్రభుత్వానికి పట్టని అన్నదాతల చావుకేకలు ⇒రెండేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులు 14మందేనట ! ⇒రికార్డులకెక్కని బలవన్మరణాలు ⇒ వీధినపడిన కుటుంబాలు... దిక్కుతోచని పిల్లలు సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ప్రకృతి ప్రకోపించి.. కాలం కలిసిరాక.. చేసిన అప్పు తీర్చలేక.. కొత్తగా అప్పు పుట్టక.. పొట్టకొచ్చిన పంటచేనుపై స్వారీ చేస్తున్న పురుగులపై మందు చల్లడానికి సైతం చేతిలో చిల్లిగవ్వ లేక.. కళ తప్పిన చేలను చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వ గుర్తింపు కరువైంది. బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన అధికారులు ప్రామాణికాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో జిల్లాలో బలవన్మరణానికి పాల్పడిన వారి కుటుంబసభ్యులకు తీరని అన్యాయం జరుగుతోంది. వ్యవసాయ రంగం లో నెలకొన్న ఆటుపోట్ల ను అధిగమించలేక రెండేళ్లుగా పెద్దసంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, ప్రభుత్వం మాత్రం ఈ జాబితాను పదుల సంఖ్యకే పరిమితం చేసింది. ఇంటిపెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్నవారికి ప్రభుత్వ ఆసరా కలగానే మిగులుతోంది. భూమినే నమ్ముకొని, ఆరుగాలం శ్రమించి, వరుణదేవుడు కరుణించక, విద్యుత్ సక్రమంగా అందక, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలపై కనికరం లేని అధికారులు.. రెండేళ్లలో 14మంది రైతులు మాత్రమే బలవన్మరణాలకు పాల్పడ్డారని నివేదికల్లో పేర్కొంటున్నా రు. వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో 2013-14 ఏడాదిలో దాదాపు 40 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోగా.. వీటిలో 35వరకు పోలీసు రికార్డుల్లో సైతం నమోదయ్యాయి. ప్రాథమిక సమాచారం సేకరించిన సమయంలో అప్పుల బాధ తాళలేక, వ్యవసాయంలో నష్టం వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారంటూ చెప్పిన మండల, జిల్లా అధికారు లు, తీరా ఉన్నతాధికారులకు పంపించే నివేదికల్లో మాత్రం అనేక ప్రామాణికాలను బూచిగా చూపి జాబితాలో పేర్లు తగ్గించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి ఎంతోకొంత సహాయం అందుతుం దని ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాల్లో నిరాశ, నిసృ్పహ అలుముకుంది. జిల్లాలోని వివిధ రైతు సంఘాలు సైతం గత ఏడాది జూన్ నుంచి ఈ సంవత్సవరం జనవరి వరకు 29మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం సేకరించాయి. ఇదే తరహా లో గత ఏడాది సైతం పలు రైతు సంఘాలు ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చినా వాటిలో పలువురి పేర్లు ప్రభుత్వ జాబితాలో కనిపించనే లేదు.. అధికారుల లెక్కల ప్రకారం 2013-14లో 14 మంది మాత్రమే అత్మహత్యకు పాల్పడినట్లు నివేదిక ఇచ్చినా అందులో రెండు కుటుంబాలకు మా త్రమే ప్రభుత్వ సాయం అందింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో మరణించిన బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన వెంకన్న కుటుంబానికి రూ.1.50 లక్షలు, పాల్వంచ మండలం గుడిపాడుకు చెందిన సోడె రాములు కుటుంబానికి రూ.1.50 లక్షలు మం జూరయ్యాయి, మిగిలిన 12కుటుంబాలకు సంబంధిం చి డివిజన్‌స్థాయి అధికారుల నివేదిక రాలేదనే సాకుతో ఆర్ధికసాయం అందలేదు. ఈఏడాది జనవరిలో ముగ్గు రు మరణించినట్లు అధికారులు చెబుతుండగా, రైతుసంఘాల ప్రతినిధుల సమాచారం ప్రకారం 8 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడవుతోంది. కాలం కలిసిరాక.. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, తుపాన్లు, వరదలకు తోడు వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా కావడం లేదు. దీంతో పంటలు చేతికందక నష్టాల పాలై దారీతెన్నూ కనిపించని రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా భూమినే నమ్ముకుని పంటలు సాగుచేసే రైతు బ్యాంకు రుణం సరిపోక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇలా అనేక కారణాలు రైతును చావుకేక పెట్టిస్తున్నాయి. జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ, మండల గణాంకశాఖ అధికారుల నివేదికల ఆధారంగా కరువు మండలాలుగా గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ఖరీఫ్ సీజన్లో 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేసినట్లు వవ్యసాయాధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నారు. దీనిలో పత్తి 4.30 లక్షల ఎకరాలు, వరి 3 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 35 వేల ఎకరాలు, ఇతర పంటలు 3 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు వివరించారు. అయితే వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో పత్తి, వరి , మొక్కజొన్న పంటలకు నష్టం ఎక్కువగా వాటిల్లినట్లు అధికారుల లెక్కలు చెపుతున్నాయి. రబీలోనూ పంటల దిగుబడిపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. దయనీయంగా మారిన కౌలు రైతు... జిల్లాలో సుమారు 50 వేలకు పైగా కౌలు రైతులు ఉన్నారు. పత్తి, మిర్చి తదితర వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. అయితే గత మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు వీరిని అతలాకుతలం చేశాయి. దీంతో పంట సాగుకు తెచ్చిన అప్పులు భారమయ్యాయి. ఉన్న అప్పులకు తోడు కౌలు చెల్లించలేకపోవడంతో భూయజమానులు నిలదీశారు. ఇక పెరిగిన ఎరువులు, పురుగు మందుల ధరలు వారిని మరింత కుంగదీశాయి. ఈ నేపథ్యంలో అటు అప్పుల బాధ.. ఇటు కుటుంబ బాధ్యతలు భారమై చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కౌలుదారు సంఘాలను ఏర్పాటు చేశామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ వీరికి పంటసాగుకు అవసరమయ్యే రుణం అందించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారు. రుణం అడిగిన కౌలు రైతులను నిబంధనల పేరిట బ్యాంకర్లు ముప్పుతిప్పలు పెట్టి చివరికి మొండిచేయి చూపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు, దానికి గల కారణాలను అధికారులు ప్రభుత్వానికి పంపించే నివేదిక సక్రమంగా లేకపోవడం వల్లే ఆయా కుటుంబాలకు రూ.1.50 లక్షల సహాయం అందడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. 50 వేలతో అప్పులు తీర్చాలి... ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే రూ.1.50 లక్షలలో రూ.50వేలు అప్పు తీర్చెందుకు, మిగితా రూ.లక్ష మళ్లీ వ్యవసాయం చేసేందుకు ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఆ సహాయం అందకపోవడంతో వడ్డీ వ్యాపారులు రైతు కుటుంబ సభ్యులను నానా ఇబ్బందుల పాలుచేస్తున్నారని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఇకనైనా ప్రభుత్వం తమకు సాయం అందించకపోతుందానని బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. -
కలిసిరాని రాజ్మా
ఏటా విపత్తుల బెడద విత్తనాలు దక్కని వైనం చింతపల్లి: మన్యం సిరుల పంట రాజ్మా రాను రాను కనుమరుగవుతోంది. నాలుగేళ్లుగా ప్రకృతి విపత్తుల కారణంగా ఈ పంట దెబ్బతింటూనే ఉంది. ఈ ఏడాది కూడా ఆశాజనకంగా ఉందనుకున్న దశలో హుద్‌హుద్ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. విత్తనాలు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో రానున్న కాలంలో ఈ పంట కనుమరుగైపోతుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఏజెన్సీలో కాఫీ తరువాత గిరిజన రైతులు రాజ్మా పిక్కలనే ప్రధాన వాణిజ్యపంటగా సాగు చేస్తున్నారు. గతంలో ఒక్క చింతపల్లి, జీకేవీధి మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేసేవారు. ప్రతి ఏటా దాదాపు రూ.30 కోట్లు వ్యాపారం జరిగేది. మన్యంలో పండిన రాజ్మాను ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు, పూణే, కోల్‌కత వంటి ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. మంచి పోషక విలువలు కలిగిన రాజ్మా చిక్కుళ్లకు ప్రతి ఏటా ధరలు పెరుగుతునే వచ్చాయి. గతేడాది కిలో రూ.45తో ప్రారంభమైన రాజ్మా రూ.60 వరకు ధర పలికింది. నాలుగేళ్లుగా నీలం, జల్, లైలా, హుదూద్ తుఫాన్లతో రాజ్మా పంట 90 శాతం నాశనమైంది. ఐటీడీఏ ద్వారా విత్తనాల పంపిణీ గగనమైపోయింది. కొద్దో, గొప్పో చేతికి అందిన పంటను రైతులు విత్తనాల కోసం నిల్వ చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కూడా తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా నాశనమైపోయాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది 50 శాతం సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా పంటలు దెబ్బతినడంతో రైతులు రాజ్మాను వదిలేసి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించినా ఆశ్ఛర్య పోవలసిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం వర్షాలపై ఆధారపడి పండించే రాజ్మా అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా నష్టాలు తప్పడం లేదు. కాఫీతోటలు కూడా తుఫాన్ కారణంగా దెబ్బతినడంతో ప్రధాన వాణిజ్య పంటలు సాగు అనుమానాస్పదంగా మారింది. విత్తనాలు దక్కలేదు నాలుగేళ్లుగా ఎకరా భూమిలో రాజ్మా సాగు చేపడుతున్నాను. గతంలో 6 బస్తాలు దిగుబడి వచ్చేది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా విత్తనాలు దక్కడం లేదు. వచ్చే ఏడాది ఈ పంటను చేపట్టకూడదని నిర్ణయించుకున్నాను. -కొర్రా రామ్మూర్తి, బలపం. అప్పులపాలైపోతున్నాం రాజ్మా పంటపై ఆశలు పెట్టుకొని వ్యాపారుల ద గ్గర అప్పులు చేస్తున్నాం. తీరా పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో నష్టపోతున్నాం. పెట్టుబడులు రాకపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి. -వంతల సీతమ్మ, వంచుల -
రైతులుగా మనం చేస్తున్నదేమిటి?
ప్రకృతి వనరుల పట్ల నిర్లక్ష్యం రైతు ప్రాణాల మీదకొస్తోంది. భారీ పెట్టుబడులతో వాణిజ్య పంటలు వేయడంతో వ్యవసాయం జూదంలా మారింది. రసాయనిక ఎరువులు భూసారాన్ని, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని నశింపజేస్తే.. జన్యుమార్పిడి పత్తి పంట తేనెటీగలను మింగేస్తోంది. రైతులు ప్రాథమ్యాలు మార్చుకుంటేనే భవిష్యత్తు బాగుపడుతుందంటున్నారు సరస్వతి కవుల. ఈ ఏడాది వ్యవసాయం కరువు హెచ్చరికల మధ్య మొదలై రైతులను నట్టేట ముంచింది. రోహిణీ కార్తెలో మంచి వర్షంతో ఖరీఫ్ మొదలైంది. మే ఆఖరులోనే పొలాలు దున్ని విత్తనాలేశారు. కానీ చినుకు జాడ లేక మొలిచిన పంటలు ఎండిపోయాయి. ఆగస్టు నెల సగంలో వర్షం పడితే, మరోసారి విత్తనాలేశారు. మళ్లీ వర్షాలు మొహం చాటేశాయి. హుదూద్ తుపాను వచ్చినప్పుడు జల్లులు తప్ప సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు వర్షాల్లేవు. రైతులు భారీ పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. మాది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి. అదృష్టం కొద్దీ నేను ఆగస్టులో కంది పంట వేశాను. మాది సేంద్రియ వ్యవసాయం కావటంతో.. మళ్లీ వర్షం పడే వరకు భూమిలో తేమ నిలిచే ఉంది. పూత కూడా బాగావచ్చింది. అయితే, ఇటీవల కురిసిన దట్టమైన మంచు దెబ్బకు పూత రాలిపోయింది! గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. ఎకరానికి నేను పెట్టిన పెట్టుబడి రూ. 3 వేలు మాత్రమే. మా పక్కన పొలం గల రైతు పత్తి, మొక్కజొన్న, టొమాటోలు వేశాడు. ఎకరానికి రూ. 70 వేల నుంచి లక్ష వరకు ఖర్చు పెట్టి.. భారీగా నష్టపోయాడు. ఎకరానికి రూ. పది వేలు తిరిగొచ్చినా వచ్చినట్లే అన్నట్లుంది పరిస్థితి. వాన దేవుడు కరుణించలేదు.. బోర్లన్నీ ఎండిపోయాయంటూ జీవనాధారం కోల్పోయి రైతులు బాధపడుతున్నారు. అయితే, భూమాతను, ప్రకృతిని మనం ఏనాడైనా పట్టించుకున్నామా? అని నా తోటి రైతులందర్నీ నేను నిలదీసి అడగదలచుకున్నాను. మనం చేస్తున్న తప్పిదాలేమిటి? ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఆశతో యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువులను భూమిలో చాలా ఎక్కువ వేసేస్తున్నాం. రసాయనిక ఎరువులు విడుదల చేసే కర్బన ఉద్గారాలే భూమి వేడెక్కడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పచ్చని చెట్లు కరువైపోతున్నాయి. మా ప్రాంతంలో గట్టు మీద చెట్టు కనిపిస్తే చాలు.. నరికి అమ్మేసి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని ఆపకుండా ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉందని మొత్తుకోవడంలో అర్థం ఏముంది? ఈ ఏడాది బెట్టకు మెట్ట పంటలు నిలువునా ఎండిపోయాయి. కూరగాయల రైతులు తమ తోటలను కాపాడుకోవడానికి పదేపదే తడులు పెట్టాల్సి వస్తున్నది. క్వారీలు గుట్టలను గుల్ల చేస్తున్నాయి. ఈ కాలుష్యం వల్ల రేడియేషన్ ఎక్కువై వేడి పెరిగిపోతోంది. ఈ కారణంగా భూగర్భ నీటి పాయలు చెదిరిపోతున్నాయి. వాటర్షెడ్లన్నీ దెబ్బతిని చెరువులు నిండని దుస్థితి వచ్చింది. రైతులు ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. కాస్త నీళ్లుంటే నాట్లెయ్యడమేనా? బోరులో కాస్త నీళ్లున్నాయంటే వెనుకా ముందూ చూడకుండా వరి నాట్లేస్తున్నారు. నీటి వాడకం ఎక్కువై భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్ల మీద బోర్లు వేస్తూ రైతులు అప్పులపాలవుతున్నారు. వర్షం నీటిని సంరక్షించుకొని భూమిలోకి ఇంకింపజేస్తేనే తిరిగి నీరు వాడుకోవడానికి ఇబ్బంది ఉండదు. గుట్టలు, చెరువులు, అడవులతోపాటు చెట్టు చేమను కంటికి రెప్పల్లా కాపాడుకోవాలి. ఈ విషయాలను బొత్తిగా పట్టించుకోకుండా బోర్లు ఎండిపోకుండా బాగుంటాయా? చెప్పండి! నీళ్లు లేకుండా పంటలెట్ల పండిస్తం అనుకోవచ్చు. కానీ, కందులు, పెసలు, మినుములు, కొర్రలు, ఉలవలు, ఆముదాల వంటి సంప్రదాయ పంటలు వేసుకుంటే తక్కువ నీళ్లతోనే చక్కగా పండుతాయి కదా. భూమి అతిగా వేడెక్కడానికి రసాయనిక ఎరువుల వాడకం ఓ ముఖ్య కారణం. వీటిని వాడకపోతే వాతావరణ మార్పులూ సమసిపోతాయి. రసాయనిక ఎరువులు వేయకుండా వ్యవసాయం చేస్తే.. వానపాములు, మట్టిలో ఉండే మేలు చేసే సూక్ష్మజీవులు చైతన్యవంతమై భూమిని సారవంతం చేస్తాయి. పచ్చిరొట్ట లేదా పశువుల ఎరువులు వేస్తే చాలు. అప్పుల బారిన పడాల్సిన అవసరం అంతగా ఉండదు. ఏతావాతా చెప్పేదేమంటే.. చెట్లను, అడవులను, భూములను రక్షించుకుంటూ.. తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేసుకోవాలి. మిశ్రమ పంటలు, అంతర పంటలు వేసుకుంటూ.. పంటల మార్పిడి చేస్తే భూమి సారవంతమవుతుంది. జన్యుమార్పిడి పత్తి సాగు వల్ల తేనెటీగలు, ఇతర జీవులు అంతరించిపోతున్న విషయం స్వయంగా గుర్తించాను. రెండేళ్ల క్రితం మా పక్కన పొలంలో బీటీ పత్తి సాగు మొదలైంది. ఈ ఏడాది తేనెటీగల జాడే లేదు. అవి లేకపోతే పంటల్లో పరపరాగ సంపర్కం జరిగేదెలా? పశ్చిమ బెంగాల్లో ఈ సమస్యను అధిగమించడానికి రైతులు తేనెటీగల మాదిరిగా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఆడ, మగ మొక్కల పూలను చేతులతో రుద్దుతున్నారట. కానీ, ప్రకృతిసిద్ధంగా తేనెటీగలు చేసే పనిని మనం ఎంతని చేయగలుగుతాం చెప్పండి? ఇది లాభదాయకమైన వ్యవసాయమేనా? ఇంకో మౌలికమైన ప్రశ్న నా మదిలో మెదులుతూ ఉంది. రసాయనిక వ్యవసాయం లాభదాయకమైనదేనా? జూదంలా మారిన వ్యవసాయం రైతుల ఉసురు తీస్తున్నది. ఆహార పంటలు వేసుకుంటే ఇక్కడి మార్కెట్లోనే అమ్ముకోవచ్చు. పత్తి వంటి అంతర్జాతీయ వాణిజ్య పంటలు పండిస్తే.. అంతర్జాతీయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. మరోవైపు, రసాయనాలతో పండించిన ఈ ఆహారం మనల్ని రోగగ్రస్తులుగా మార్చుతోంది. ఆస్పత్రి ఖర్చులు పెచ్చుమీరిపోయాయి. గర్భసంచిలో గడ్డలు, కీళ్లనొప్పులు, కిడ్నీ జబ్బులు.. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఎక్కువైపోయాయి. రసాయనిక వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రతిఫలంగా దక్కుతున్నదేమిటో మనకు అర్థమవుతోందా? ఇటువంటి రోగగ్రస్థ వాతావరణంలో మన భావి తరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా? అందుకే మన ప్రాథమ్యాలపై పునరాలోచన చేయాలి. భూమిని ‘డబ్బు యంత్రం’లా కాకుండా.. తరతరాలకు జీవంపోసే ‘నేలతల్లి’గా పరిగణించాలి. (వ్యాసకర్త: సేంద్రియ మహిళా రైతు, సామాజిక కార్యకర్త) -
పేదవాని చౌక పంట
తక్కువ నీటితో బూడిద గుమ్మడి సాగు పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ మొగ్గు చూపుతున్న రైతులు వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పది బోర్లలో రెండింట మాత్రమే నీళ్లొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కూరగాయ, వాణిజ్య పంటలు సాగు చేయడం రైతులకు కష్టతరంగా మారింది. ఉన్న నీటితో తక్కువ పెట్టుబడితో సాగు చేసే పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి రైతులకు బూడిద గుమ్మడి వరంలా మారింది. పలమనేరు: పలమనేరు మండలంలోని తొప్పనపల్లెకు చెందిన యువరైతు గజేంద్ర (9849830207) తన నాలుగెకరాల పొలంలో ఈ దఫా బూడిద గుమ్మడి సాగు చేశాడు. బోర్లో వచ్చే తక్కువ నీటితో ఎకరాకు రూ.10 వేలు ఖర్చు పెట్టి రూ.లక్ష వరకు గడించాడు. ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రాంతంలోని పలువురు రైతులు ప్రస్తుతం బూడిద గుమ్మడి సాగుకు సమాయత్తమవుతున్నారు. సాగుకు సంబంధించిన పలు అనుభవాలను రైతు వివరించాడు. ఆయన మాటల్లోనే చూద్దాం.. సాగు విధానం.. ఈ పంటకు వేడి వాతావరణం అనుకూలిస్తుంది. 20 రోజులకు ఒకసారి తడి అందించినా సరిపోతుంది. తేలికపాటి బంకమట్టి నేలలు ఎంతో అనుకూలం. జూన్, జూలై నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు. ముఖ్యంగా మామిడి తోటల్లో ఈ పంటను సాగు చేస్తే ఓ వైపు మామిడితో పాటు మరోవైపు గుమ్మడి ద్వారా అదనపు ఆదాయం గడించవచ్చు. ఇది తీగ పంట కావడంతో తీగలు మామిడి చెట్లపైకి అల్లుకుని కాయలు కాశాయి. నీటి సౌకర్యం తక్కువగా ఉన్న రైతులు డ్రిప్ ఆధారంగా పంట సాగు చేసుకోవచ్చు. విత్తనాలను రెండు సెంటిమీటర్ల లోతులో నాటాలి. విత్తే ముందు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు, ఓ బస్తా భాస్వరం, 20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను గుంతల్లో వేసుకోవాలి. నత్రజనిని సమపాళ్లుగా చేసి పూత, పిందె దశలో వేయాలి. పెట్టుబడి రూ.10వేలు.. ఆదాయం రూ.లక్ష తమిళనాడు నుంచి బూడిద గుమ్మడి విత్తనాలను తెప్పించా. నా మామిడి తోటలో పాదులు చేయించి డ్రిప్ ద్వారా పంట సాగు చేశా. ఎకరా భూమికి విత్తనాల కోసం రూ.3,500 ఖర్చైంది. ఇతరత్రా ఖర్చులు కలుపుకొని మొత్తం మీద పెట్టుబడి ఎకరాకు రూ.10 వేలు అయ్యింది. కేరళ, తమిళనాడు, స్థానిక వ్యాపారులు బూడిద గుమ్మడిని కొనుగోలు చేశారు. ఎకరా పంటకు రూ.1.10 లక్షలు రాబడి రాగా ఖర్చులు పోను రూ.లక్ష వరకు మిగిలింది. బోరు లో వచ్చే నీరు తక్కువగా ఉండడంతో వేరే పంటకైతే అర ఎకరా సాగుచేసే నీటితోనే నాలుగెకరాలు బూడిద గుమ్మడిని సాగు చేశా. నీటి సౌకర్యం తక్కువగా ఉన్న రైతులకు ఈ పంట ఎంతో మేలు. మార్కెట్లో ధరలు కూడా ఆశాజనకంగానే ఉంటాయి. బూడిద గుమ్మడిలో సస్యరక్షణ.. బూడిద గుమ్మడికి సంబంధించి సస్యరక్షణ చర్యలను హార్టికల్చర్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న (8374449205) వివరించారు. కలుపు నివారణకు మెటలాక్లోర్ మందును పిచికారీ చేయా లి. మొక్కలు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నపుడు లీటర్ నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి పెరుగుతుంది. ఈ పంటకు ఎక్కువగా గుమ్మ డి పెంకు పురుగు, పం డు ఈగతో నష్టం వాటిల్లుతుంది. దీనికోసం కార్బరిల్ 50 శాతం పొడిని మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి చల్లుకోవచ్చు. పండు ఈగ నివారణకు పది మిల్లీల మలాథియాన్‌ను 100 గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకం నీటితో కలిపి తోటలో అక్కడక్కడా మట్టి ప్రమిదల్లో పోసి పెట్టాలి. ఇక బూజు, బూడిద, వేరుకుళ్లు తెగుళ్లు తదితరాలకు మాంకోజెబ్ లేదా డైనోకాప్ తదితర మందులను పిచికారీ చేయొచ్చు. -
ఆందోళనకర పరిస్థితిలో వ్యవసాయం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఊరిస్తూ.. ఊసురుమనిపిస్తున్న వర్షాలు జిల్లా రైతాంగానికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే విత్తనాలు విత్తుకున్న రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. పొద్దంతా భారీ వర్షాన్ని తలపించేలా ఆకాశంలో మేఘాలు ఆవరించి.. సాయంత్రానికి మాత్రం చినుకు రాల్చకుండా జారుకోవడంతో దిగులు చెందుతున్నారు. ఈ నెల మొదటివారంలో ఒకట్రెండు వర్షాలు కొంత ఊరటనిచ్చినప్పటికీ.. ఆ తర్వాత వానల జాడ లేకుండాపోయింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూన్ నెల నుంచి ఇప్పటివరకు 20.5 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 9.4సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. సాధారణం కంటే 52 శాతం లోటు వర్షం కురవడంతో సాగు చతికిలపడి కరువును తలపిస్తోంది. పంటలు సాగైంది 38 శాతమే.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యేలా వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసి ఏర్పాట్లు చేపట్టింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలలో సాగు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. నీటికొరతతో కొన్నిచోట్ల నారుమడుల్లోనే వరి ఎండిపోయింది. ఈ నెల మొదటివారంలో ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతులు ఊరట చెందారు. దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్న రైతులు నాటు వేశారు. అదను దాటిన వర్షాలు కొన్ని మండలాల్లోనే కురిశాయి. పలుచోట్ల విత్తనాలు వేసే స్థాయిలో వానలు పడకపోవడంతో వ్యవసాయ పనుల్లో పురోగతి లేదు. జిల్లాలో 1.84 లక్షల సాధారణ విస్తీర్ణానికి గాను ఆదివారం నాటికి 1.13 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వాల్సి ఉంది. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా కేవలం 70,331 హెక్టార్లలో పంటలు సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా సాధారణ విస్తీర్ణంలో 38 శాతం మాత్రమే పంటలు సాగవ్వడం గమనార్హం. గతేడాది సాధారణ విస్తీర్ణం కంటే 25శాతం ఎక్కువగా సాగైన మొక్కజొన్న, కంది పంటల సాగు ప్రస్తుత సీజన్లో భారీగా పతనమయ్యాయి. నాలుగువేల హెక్టార్లలో పండే ఆముదం పంట సాగు ఈసారి పది శాతానికి మించలేదు. జిల్లాలో దాదాపు 2వేల హెక్టార్లలో పండించే, వేరుశనగ, మసాలా దినుసుల, ఉల్లి పంటలు ఈసారి విత్తుకు నోచుకోలేదు. అదను దాటితే అంతే.. సాధాక ణంగా జూన్ మొదటివారం నుంచి వర్షాలు కురవడంతో ఆ సమయంలోనే విత్తుల వేస్తారు. కానీ ఈసారి విచిత్ర పరిస్థితి నెలకొంది. రుతుపవనాలు సకాలంలోనే ప్రవేశించినప్పటికీ విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో వానలు కురవలేదు. జూన్ నెల ఆసాంతం చినుకులు మినహా భారీ వర్షం పడలేదు. దీంతో దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకున్న రైతులు.. వానల కోసం ఆకాశంవైపు దిగాలుగా చూశారు. జూలై మొదటివారంలో ఒకట్రెండు వర్షాలు రైతన్నలో ఆశలు చిగురింపజేశాయి. దీంతో విత్తులు నాటారు. కానీ వానలు మొహం చాటేయడంతో మళ్లీ ఆకాశంవైపు దీనంగా చూస్తున్నాడు. మరో వారం రోజుల్లో వానలు ఊపందుకోకుంటే సాగు కష్టమేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విత్తనాలు వేయడంతో మరో నాలుగైదు రోజులు వానలు పడకుంటే ఆ విత్తు మొలకెత్తకుండా భూమిలోనే మురిగిపోయే అవకాశం ఉందని వ్యవసాయశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చరిత్రకీ ఉంటుంది కొత్త గొంతు
వ్యవసాయం విస్తరించిన కాలం కూడా అదే. పొగాకు, టమాటా, బంగాళాదుంప, మిరప వంటి వాణిజ్య పంటలు తెలుగు ప్రాంతానికి పరిచయమైన కాలమూ అదే. పత్తి, నీలిమందు పంటలతో వాణిజ్యం సాగించిన సమయం కూడా అదే. సంపాదకుడు ఆర్. సోమారెడ్డి. ఈ గ్రంథాన్ని రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసిం హన్ ఆవిష్కరిస్తారు. ఐసీహెచ్ ఆర్ చైర్మన్ వై. సుదర్శనరావు తదితరులు పాల్గొంటారు. చరిత్రను సమగ్రం చేసుకోవడం ఓ నిరంతర ప్రక్రియ. చరిత్రను పునర్ లిఖించుకోవడం, చారిత్రక ఘట్టాలను పునర్ మూల్యాంకన చేసుకోవడం ప్రతి సమాజానికి ఉన్న బాధ్యత. మరణానంతరం ప్రముఖులకి అదనపు కీర్తిని జోడించడం పరిపాటి అని పన్నెండో శతాబ్దానికి చెందిన కల్హణుడు (‘రాజతరంగిణి’ రచయిత) వ్యాఖ్యానిస్తాడు. అంటే ఒక చారిత్రక పురుషుడి మీద వస్త్వాశ్రయ దృష్టితో, సత్యనిష్టతో కూడిన అభిప్రాయానికి రావడానికి సమయం పడుతుందన్నమాట. చారిత్రక ఘట్టాల మీదైనా అంతే. దీనిని పరిహరిస్తే మళ్లీ కొన్ని తరాల వరకు సమగ్ర చరిత్ర అందుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ప్రారంభించిన కృషి ఇందుకు సంబంధించినదే. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకా రంతో చరిత్ర కాంగ్రెస్ వెలువరించిన కొత్త పుస్తకం ‘మధ్య మలి ఆంధ్రప్రదేశ్ (ఔఅఖీఉ కఉఈఐఉగఅఔ ఊఈఏఖఅ ్కఖఅఈఉఏ) క్రీ.శ. 1324-1724’. చరిత్ర కాంగ్రెస్ వెలువరిస్తున్న గ్రంథాల వరసలో ఇది ఐదో సంపుటం. ఓయూ విశ్రాంత ఆచార్యులు ఆర్. సోమారెడ్డి సంపాదకత్వంలో ఈ సంపుటి వెలువడింది. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ జనరల్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కనిపించే ముసునూరి నాయకులు, రెడ్డి రాజ్యాలు, విజయనగర చరిత్ర, కుతుబ్‌షాహీల గాథ వంటి వాటి మీద గతంలోనూ గ్రంథాలు వెలువడినాయి. మల్లంపల్లి సోమశేఖరశర్మ, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, చిలుకూరి నారాయణరావు, మారెమండ రామారావు, సురవరం ప్రతాపరెడ్డి, గులాం యాజ్దాని వంటి ఉద్దండులు వాటిని ఎంతో శ్రమకోర్చి వెలువరించారు. అయినా కొత్త ఆధారాలు వెలుగు చూస్తూ ఉంటాయి. కొత్త దృక్పథాలు ఆవిష్కృతమవుతూ ఉంటాయి. అందుకే చరిత్రను పునర్ లిఖించుకోవడం మానవాళి ఒక బాధ్యతగా స్వీకరించింది. క్రీస్తుశకం 1324-1724 మధ్య తెలుగు వారి చరిత్రను, అందులోని పరిణామాలను ఈ పుస్తకం ఆవిష్కరించింది. విజయనగర, బహమనీ, గజపతులు, ముసునూరి నాయకులు, రెడ్డి రాజ్యాలు వంటి చిన్న రాజ్యాలు ఆయా ప్రాంతాలలో తలెత్తుకుని మనుగడ సాగించిన కాలం అదే. వ్యవసాయం విస్తరించిన కాలం కూడా అదే. పొగాకు, టమాటా, బంగాళాదుంప, మిరప వంటి వాణిజ్య పంటలు తెలుగు ప్రాంతానికి పరిచయమైన కాలమూ అదే. పత్తి, నీలిమందు పంటలతో వాణిజ్యం సాగించిన సమయం కూడా అదే. అంటే వాణిజ్యం, వాణిజ్య పంటల అవసరాన్ని గమనించిన కాలం. బలమైన సంఘాల ద్వారా వణిజులూ, వృత్తికులాలూ తమ ఉనికిని చాటుకున్నాయి. ఒక ప్రాంతా న్నే, అది కూడా రాజధానీ, చుట్టుపక్కల ప్రాంతాలకే అభివృ ద్ధిని పరిమితం చేయకుండా నలుదిక్కులను అభివృద్ధి చేయ డానికి జరిగిన ప్రయత్నం గురించి అధ్యయనం చేయడం ఏ కాలం పాలకులకైనా అవసరమే. కృష్ణదేవరాయలు నాగులా పురంలో సేద్య అవసరాల కోసం పెద్ద చెరువును నిర్మిం చాడు. ఆయన మంత్రి రాయసం కొండమరుసయ్య కొండ వీడు ప్రాంతంలో రెండు చెరువులు తవ్వించాడు. మరొక రాజ ప్రముఖుడు అనంతపురం దగ్గర బుక్కసముద్రంలో తవ్వించాడు. అంటే అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడడమనేది తరువాతే మనలో లోపించిందా? ఆ కాలం ప్రజలకు బయటి ప్రపంచంతో సంపర్కం ఏర్పడి ఇతర సంస్కృతులతో, మతాలతో, భాషలతో పరిచయం కావడంతోపాటు సహిష్ణుతను అలవాటు చేసుకోవడం ఆరంభమైంది. విజయనగర పాలకులు, బహమనీలు కూడా పాలనా వ్యవహారాలలో మతం జోక్యం లేకుండా చూడడం దీని ప్రభావమే కావచ్చు. మతాన్ని వ్యక్తిగత విషయంగానే పరిగణించిన విజయనగర పాలకులు తిరుపతి అభివృద్ధికి చేసిన కృషి ప్రత్యేకమైనది. తిరుపతితోపాటు అహోబిలాన్ని కూడా ఆ పాలకులు పోషించారు. సంస్కృత సాహిత్య సౌరభాలు, తెలుగు భాషా వికాసం, తెలుగు సాహిత్యంలో కొత్త ధోరణుల ఆవిర్భావం, పర్షియన్ సాహిత్య గుబాళింపు ఎలా జరిగిందో ప్రత్యేకంగా వివరించిన వ్యాసాలు ఉన్నాయి. అప్పటి వాస్తు, యక్షగానం వంటి ప్రదర్శన కళల వికాసాన్ని ఇందులో చదువుతాం. ఈ పుస్తకాన్ని చదవడం నిజంగా ఒక అనుభవం. చరిత్ర అధ్యయనం, పరిశోధన పట్ల తెలుగు ప్రాంతంలో సన్నగిల్లిపోతున్న శ్రద్ధ ఈ సంపుటాలతో పునర్వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుందాం. -గోపరాజు -
సంప్రదాయ పంటలకు స్వస్తి
వ్యవసాయంలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. ఆహార పంటలైన జొన్న, పెసర్లు, గోధుమ సాగుకు స్వస్తి చెబుతున్న రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో.. అధిక దిగుబడి.. అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఆ దిశగా ముందుకు ‘సాగు’తున్నారు. ముఖ్యంగా భూములన్నింటినీ పత్తి, సోయూబీన్ పంటలు ఆక్రమించారుు. ఫలితంగా అన్నదాతలకే ప్రస్తుతం ఇళ్లలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితిలో సంప్రదాయ పంటలు ప్రభను కోల్పోగా కొత్త పంటలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి, లాభాలిచ్చే పంటల వైపే అన్నదాతలు మొగ్గుచూపుతుండడంతో సంప్రదాయ పంటలకు కాలం చెల్లుతోంది. అధిక దిగుబడి, లాభాలు ఇచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలు జరగకపోవడంతో పాత పంటల సాగు ఏడాదికేడాది తగ్గిపోతుండగా.. కొత్త పంటల సాగు విస్తీర్ణం అమాంతం పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేసిన పంటలు ఇప్పుడు చిన్నబోయాయి. రబీ సీజన్లో ఐదేళ్ల క్రితం వరకు జిల్లాలో వరి, జొన్న, పెసర్లు, గొధుమ. మినుములు, ఇతర పప్పు ధాన్యాల సాగు భారీగా ఉండేది. రానురాను తగ్గిపోయూరుు. 2008-09లో లక్షా 12 వేల 23 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైన ఆహార పంటలు.. 2013-14కు వచ్చేసరికి రబీలో 61 వేల 801 హెక్టార్లకు పడిపోరుుంది. రబీలో జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 2008-9లో 18,433 హెక్టార్లు కాగా.. ఈ ఏడాది రబీలో 10 వేల 100 హెక్టార్లకు చేరింది. ఇక చిన్నపంటలైన పొద్దుతిరుగుడు, మిరప, నువ్వులు, వేరుశెనగ, ఉల్వలు, ఉల్లి పంటలు సైతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. నేటి మొక్కజొన్న, పత్తి.. రేపటి సోయాదే.. ఒకప్పుడు జిల్లాలో నామమాత్రంగా సాగైన పత్తి, సోయాబీన్, వరి పంటలపై రైతుల్లో మోజు పెరిగింది. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి, రాబడి ఇస్తుండడంతో రైతులు మూకుమ్మడిగా ఈ పంటల సాగుకే కట్టుబడిపోయారు. బీటీ విత్తనాల రాకతో పత్తి సాగు అమాంతం పెరిగింది. ఖరీఫ్, రబీలో 2008-09లో 2,82,860 హెక్టార్లలో సాగైన పత్తి ఖరీఫ్ 2013 నాటికి 3 లక్షల 10 వేల హెక్టార్లకు పెరిగడమే ఇందుకు నిదర్శనం. సోయాబీన్ 95,895 హెక్టార్లకు గాను లక్ష 13 వేల హెక్టార్లకు చేరింది. జొన్న పంట స్థానాన్ని సోయాబీన్ ఆక్రమించగా.. పప్పు దినుసులు, నూనె గింజల స్థానంలో పత్తి పంట చొచ్చుకొచ్చింది. రెండేళ్లుగా జిల్లాలో సోయా చిక్కుడు సాగు పెరుగుతుండడంతో.. భవిష్యత్తులో భారీ స్థాయిలో ఈ పంటను సాగుచేసే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పప్పుదినుసుల్లో కంది మాత్రమే ఆదరణకు నోచుకుంటోంది.