సస్పెన్షన్‌లు కొత్తేమీకాదు
పనిచేసిన ప్రతి జిల్లాలో వివాదాలు పెట్టుకోవడం, సస్పెన్షన్‌లు కొని తెచ్చుకోవడం డీఈఓకు అలవాటే. చిత్తూరు జిల్లాలో కలెక్టర్ ఈయన బాధలు భరించలేక సరెండర్ చేశారు. శ్రీకాకుళంలో ఉద్యమాలతో తరిమేశారు. గుంటూరులో ఏసీబీ కేసులో జైలు
కెళ్లారు. కర్నూల్లో ఉపాధ్యాయులు వీధుల గుండా తరుముకుంటూ చొక్కా చింపి కొట్టారు.
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: డీఈఓ మువ్వా రామలింగం పాపం ఎట్టకేలకు పండింది. ఎన్నితప్పులు చేసినా తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో విర్రవీగుతున్న ఆయనపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. డీఈఓపై ఉన్న అవినీతి ఆరోపణలను పరిశీలించిన ప్రభుత్వం శనివారం రాత్రి వేటు వేసింది. మువ్వా రామలింగాన్ని సస్పెండ్ చేస్తూ జీఓ 143ను విడుదల చేసింది. గవర్నర్ నరసింహన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేష్‌తివారి ఈ జీఓను విడుదల చేశారు.
కలెక్టర్ శ్రీకాంత్ డీఈఓ అక్రమాలను వివరిస్తూ గత నెల 30వ తేదీన పంపిన నివేదిక ఆర్సీ నంబర్ ఏ1/11972014ను ఆధారం చేసుకున్న ప్రభుత్వం సీసీఏ రూల్సు 1991 ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు జీఓలో వివరించారు. అప్పటికే సాక్షి దినపత్రికలో వరుసగా డీఈఓ అక్రమాలపై పలు కథనాలు ప్రచురితమయ్యాయి.
సెలవులపై సందిగ్ధత, ప్రభుత్వ ఆర్డర్లతో అక్రమ ట్రాన్స్‌ఫర్లు, అంతా నాఇష్టం, ప్రశ్నిస్తే వేధిస్తా, డీఈఓ గారు ఈ పాపం ఎవరిది, నవ్విపోదురుగాక తదితర శీర్షికలతో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలను కలెక్టర్ పరిశీలించి వాటిని కూడా నివేదికలో పొందుపరిచారు.
అలాగే డీఈఓ అక్రమాలపై దీర్ఘకాలికంగా యూటీఎఫ్, ఎంఈఎఫ్, డీటీఎఫ్, ఏపీటీఎఫ్(1938) ఉపాధ్యాయులు చేస్తున్న నాయ్యమైన పోరాటాల గురించి నివేదికలో క్షుణ్ణంగా వివరించారు. ఈ వివరాలన్నీ పరిశీలించిన గవర్నర్ జీఓ విడుదలకు ఆదేశాలు జారీచేశారు. విడుదలైన క్షణం నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాలున్నాయి. అంతేకాదు తమ ఆదేశాలు లేకుండా నెల్లూరు నగరాన్ని వీడరాదని ఆంక్షలు కూడా విధించారు. దీంతో డీఈఓకు దిమ్మ తిరిగింది.
ఇదీ డీఈఓ చరిత్ర:
డీఈఓ గతంలో ఇక్కడ డిప్యూటీ ఈఓగా, ఇన్‌చార్జి డీఈఓగా బాధ్యతలు నిర్వహించి పలు విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రైవేటు పాఠశాలల యజమానులతో కుమ్మక్కు కావడం, వారికి అనుకూలంగా పదో తరగతి సెంటర్లు ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ ప్రోత్సహించడం, డీఎస్సీలో అక్రమాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయులను వేధించడం ఆయనకే చెల్లింది. కొంతకాలం ఇతర జిల్లాల్లో పనిచేసిన డీఈఓ మళ్లీ నెల్లూరు డీఈఓగా 2011 జూన్ 17వ తేదీన బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అడ్డమైన దారులు తొక్కారు.
ప్రశ్నించే వారి పాఠశాలలపై ఒకటికి పదిసార్లు తనిఖీలు పేరుతో డిప్యూటీ ఈఓను పంపించి వేధిం చడం, భయాందోళనలకు గురిచేయడం కుంటిసాకులతో ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం విధేయతగా ఉంటే సస్పెండ్‌లో ఉన్న శేషాద్రివాసు లాంటి ప్రధానోపాధ్యాయులను అత్యున్నత విధులకు నియమించడం. రాజకీయ అండతో ఇష్టారాజ్యంగా ప్రవ ర్తించడం
డీఈఓ కార్యాలయంలోని ఒక ఉద్యోగి ఓ హోటల్ వ్యాపార లావాదేవీలలో ఆరు నెలలు సస్పెండ్ అయినా ఆయనకు ఇంక్రిమెంటు ఇవ్వడం డీఈఓ కార్యాలయం బడ్జెట్‌ను ఇష్టారాజ్యంగా డైవర్ట్ చేయడం
పాపం పండింది
Published Sun, Apr 20 2014 3:16 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement