నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
-
డీఈఓ రామలింగం
అనుమసముద్రంపేట : ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు బాద్యతాయుతంగా పనిచేసి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని డీఈఓ మువ్వా రామలింగం తెలిపారు. మండలంలోని చిరమన గ్రామంలో రూ.10 లక్షల ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో నిర్మించిన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ గదులను ఈనెల 13వ తేదీన కేంద్ర, రాష్ట్ర మంత్రులు వెంకయ్యనాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో డీఈఓ ముందస్తుగా పరిశీలించేందుకు వచ్చారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. గదులను పరిశీలించి ఫర్నీచర్, కిటికీలు మరమ్మతులకు గురై ఉండటం చూసి చిన్నపాటి మరమ్మతులు చేయించుకోలేరా అని ప్రశ్నించారు. తక్షణం మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. ల్యాబ్‌లో అనవసరమైన కెమికల్స్‌ను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు.
కమీషన్లకు కక్కుర్తి పడొద్దు
హెచ్‌ఎంలు కమీషన్ల కోసం అనవసరమైన కెమికల్స్, పరికరాలు కొనుగోలు చేయొద్దని డీఈఓ తెలిపారు. సైన్స్ ల్యాబ్‌లో విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఏఎస్‌పేట ఉన్నత పాఠశాలలో ఉర్దూ టీచర్ లేడని విలేకరుల ఆయన దృష్టికి తీసుకెళ్లగా కావలి నుంచి డెప్యుటేషన్ వేయిస్తామన్నారు. చిరమన ఎస్‌సీ పాఠశాలలో తక్కువ మంది విద్యార్థులున్నందున మెయిన్ పాఠశాలలో కలపాలని ఎంఈఓకు తెలిపారు. ఆయన వెంట ఎంఈఓ మహబూబ్‌జాన్, హెచ్‌ఎం ఫణీంద్ర, సీఆర్‌పీలు సుధాకర్, రఫీ, అంకయ్యనాయుడు ఉన్నారు.