సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పరిమితి, కాలపరిమితి లేకుండా అర్హులందరికీ అందిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను మాత్రం అమలు చేస్తున్నారని అన్నారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో సాంఘిక సంక్షేమశాఖలో అమలవుతున్న పథకాలపై వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. ముఖ్యమంత్రికి అతి ఇష్టమైన శాఖల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఒకటి. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అంటే ముందుగా గుర్తొచ్చేది షెడ్యూల్డ్ కులాలు. సాంఘిక సంక్షేమ హాస్టల్‌లలో మౌలిక వసతులు కల్పించడానికి రాజీపడే ప్రసక్తే లేదు. గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 1700 వసతి గృహాల్లో 700 ఎత్తివేశారన్నారు.
'ఆ దిశగానే అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరుతున్నా. ప్రభుత్వ పరంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించే అధికారులు మీరే. సోషల్ ఆడిట్ పెట్టి మరీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. దళితుల కోసం ముందుండి నడిపించే వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీల అభిప్రాయాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ పూర్తి స్థాయిలో పని చేస్తుంది. ప్రభుత్వం నడిపేది అధికారులైన మీరే' అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
చదవండి: (మంచి పనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ..: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment