![Defence Startups workshop on December 16-17 in Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/14/t-hub.jpg.webp?itok=0UuyoWyC)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగ స్టార్టప్ సంస్థలకు సంబంధించిన వర్క్‌షాప్‌కు హైదరాబాద్‌లోని టి–హబ్ వేదిక కానుంది. డిసెంబర్ 16, 17 తారీఖుల్లో (సోమ, మంగళ) రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌ను.. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్, నెక్సస్ స్టార్టప్ హబ్ (న్యూఢిల్లీ) కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారత్, అమెరికా రక్షణ రంగ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడనుంది. డిఫెన్స్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి స్టార్టప్ సంస్థలు వినూత్న ఆవిష్కరణలు ఇందులో ప్రదర్శించనున్నాయి. పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు ఈ వర్క్‌షాపులో పాల్గోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment