Nexus
-
కోల్‌కతా కేసు: సందీప్ ఘోష్, అభిజిత్ సంభాషణపై అనుమానాలు!
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తోపాటు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోండల్‌ను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. తాజాగా ఈ ఇద్దరిని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపర్చింది. హత్యాచార ఘటన జరిగిన గంటల వ్యవధితో సందీప్ ఘోష్.. అభిజిత్ మోండల్‌తో మాట్లాడారని సీబీఐ కోర్టుకు వెళ్లడించింది. ఈ కేసుతో వీరికి సంబంధం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది.వారిని విచారించాలని అసవరం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో కోర్టు వారిని సీబీఐ కస్టడీలో భాగంగా రిమాండ్లకు ఆదేశించింది. ఈ కేసును కోర్టు సెప్టెంబర్ 17వరకు వాయిదా వేసింది.‘‘ఈ కేసులో రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయింది. మేము సేకరించిన కాల్ రిక్డార్డుల ప్రకారం ఘటన జరిగిన గంటల వ్యవధితో సందీప్ ఘోష్, మండల్ మాట్లాడుకున్నారు. ఈ ఘటనలో వారికి సంబంధం ఉన్నట్లు అనుమానం ఉంది. ఈ కేసులో నిజాలు వెలికితీయాలంటే వారిని విచారించాలి. బెంగాల్ పోలీసులకు, సీబీఐకి మధ్య విభేదాలు లేవు. మేము నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాం. మాకు మోండల్ ఓ పోలీసు అధికారిగా కనిపించటం లేదు.. ఆయన మాకు ఒక అనుమానితుడిగా కనిపిస్తున్నారు. హత్యాచారం కేసులో మోండల్ కాదు.. కానీ ఈ కేసులో నిజాలు కప్పిపుచ్చే పెద్ద కుట్రలో పాత్ర పోషించి ఉండవచ్చని అనుమానం కలుగుతోంది’ అని సీబీఐ కోర్టుకు వివరించింది. హత్యాచార ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం, విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోవడం వంటి కారణాలతో తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోండల్ సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు.. ఇప్పటికే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అవకతవకల పాల్పడిన కేసులో సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా హత్యాచార ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను సీబీఐ సందీప్‌పై మోపింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు.చదవండి: ‘టీ’ తాగాలంటూ దీదీ ఆహ్వానం.. వద్దని ఖరాఖండిగా చెప్పిన డాక్టర్లు -
కూకట్‌పల్లిలో నెక్సస్ మాల్లో సందడి చేసిన మహేశ్‌బాబు సతీమణి నమ్రత, కూతురు సితార (ఫొటోలు)
-
నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు పెట్టుబడులున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. గతేడాది నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన కంపెనీ మే నెలలో ఐపీవో చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా తొలి రిటైల్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రిటైల్ రీట్.. 17 నిర్వహణలోగల షాపింగ్ మాల్స్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఇవి 14 పట్టణాలలో 9.8 మిలియన్ చదరపు అడుగులలో విస్తరించి ఉన్నాయి. వీటి విలువ రూ. 23,000 కోట్లు. బ్లాక్‌స్టోన్ స్పాన్సర్ చేసిన మూడో రీట్‌గా ఇది నిలవనుంది. ఇప్పటికే దేశీయంగా సంస్థకు పెట్టుబడులున్న రీట్ ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ లిస్టయ్యాయి. మరో కంపెనీ బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కాగా.. ఇవన్నీ ఆఫీస్ ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ రియల్టీ ఆస్తులపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఐపీవో నిధులను కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించే వీలుంది. 2022 జూన్‌కల్లా రూ. 4,500 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. -
ఐపీవోకు నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులున్న నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. తద్వారా 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరించే ప్రణాళికలు ప్రకటించింది. వెరసి దేశీయంగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న తొలి రిటైల్ రంగ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. కంపెనీకి 14 నగరాలలో నిర్వహణలోగల 17 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వీటిలో 3,000 స్టోర్స్ ఉన్నాయి. కోటి చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తున్న ఈ పోర్ట్‌ఫోలియో విలువ 300 కోట్ల డాలర్లుగా అంచనా. 2023 క్యాలండర్ ఏడాది తొలి అర్ధభాగంలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మూడో రీట్.. నెక్సస్ సెలెక్ట్ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులు గల మూడో రీట్కాగా.. తొలుత ఎంబసీ ఆఫీస్ పార్క్స్, తదుపరి మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లను వెలువరించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన రీట్‌ను దేశీయంగా కొద్దికాలంక్రితమే అనుమతించారు. వీటి ద్వారా రియల్టీ ఆస్తుల విలువను అన్‌లాక్ చేయడంతోపాటు.. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకూ వీలు కలుగుతుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో మూడు రీట్లు ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా లిస్టయ్యాయి. అయితే ఇవి లీజ్డ్ ఆఫీస్ ఆస్తులుకాగా.. నెక్సస్ సెలెక్ట్ రిటైల్ రియల్టీ ఆస్తులతో కూడిన తొలి అద్దె ఆదాయ కంపెనీ కావడం గమనార్హం! -
ఇతర ప్రాంతాలకూ ‘నెక్సస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ స్టార్టప్‌లకు తోడ్పాటునిచ్చేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటైన ’నెక్సస్ స్టార్టప్ హబ్’ తాజాగా ఇతర ప్రాంతాలకూ కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తోంది. టి–హబ్ తరహా భాగస్వాములతో జట్టు కట్టే దిశగా చర్చలు జరుపుతోంది. సోమవారమిక్కడ టి–హబ్‌లో డిఫెన్స్ స్టార్టప్స్ వర్క్‌షాప్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) ఎరిక్ అజూలే ఈ విషయాలు తెలియజేశారు. అమెరికా ప్రభుత్వ సహకారంతో నెక్సస్ స్టార్టప్ హబ్ తొలిసారిగా భారత్‌లోనే ఏర్పాటైందని ఆయన చెప్పారు. ‘‘దీనిద్వారా ఇప్పటిదాకా 93 స్టార్టప్ సంస్థలకు శిక్షణ అందించాం. సుమారు రెండేళ్ల కాలంలో ఇవి దాదాపు 5.6 మిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించాయి. వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి’’ అని ఎరిక్ వివరించారు. మరోవైపు, రక్షణ రంగంలో భారత్, అమెరికా పరస్పర సహకారంతో ముందుకెడుతున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ (తాత్కాలిక) ఎరిక్ అలెగ్జాండర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇలాంటి వర్క్‌షాప్‌లు తోడ్పడతాయన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్, నెక్సస్ స్టార్టప్ హబ్ కలిసి నిర్వహిస్తున్నాయి. ఇందులో మార్ఫిడో టెక్నాలజీస్, కాన్‌స్టెలీ సిగ్నల్స్ వంటి 15 పైగా స్టార్టప్‌లు పాల్గొంటున్నాయి. రక్షణ రంగంలో వ్యాపారావకాశాల గురించి స్టార్టప్ సంస్థలు అవగాహన పెంచుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ నెల 18, 19న హైదరాబాద్‌లోనే జరగనున్న అమెరికా– భారత్ రక్షణ రంగ సదస్సులో కూడా పాల్గొనే అవకాశం స్టార్టప్స్‌కు దక్కనుంది. దిగ్గజాలతో అవకాశాలకు వేదిక.. లాక్‌హీడ్ మార్టిన్ వంటి రక్షణ రంగ దిగ్గజ సంస్థల గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఇలాంటి వర్క్‌షాప్‌లు తోడ్పడతాయని స్టార్టప్ సంస్థ కాన్‌స్టెలీ సిగ్నల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సత్య గోపాల్ పాణిగ్రాహి తెలిపారు. కీలకమైన మేథోహక్కులు, దిగ్గజ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాల గురించి అవగాహన పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుం దని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాడార్ సిమ్యులేషన్ సిస్టమ్స్‌ను రూపొందించే కాన్‌స్టెలీ సిగ్నల్స్ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. సహ వ్యవస్థాపకుడు అవినాష్ రెడ్డితో పాటు నలుగురితో ప్రారంభమైన తమ సంస్థలో ప్రస్తుతం 12 మం ది సిబ్బంది ఉన్నారని పాణిగ్రాహి తెలిపా రు. దేశీయంగా ఇప్పటిదాకా రెండు సిస్టమ్స్ విక్రయించామని, వీటి ఖరీదు రూ. 50 లక్షల నుంచి రూ.8–10 కోట్ల దాకా ఉంటుందని తెలిపారు. -
టి–హబ్‌లో రక్షణ రంగ స్టార్టప్‌ల వర్క్‌షాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగ స్టార్టప్ సంస్థలకు సంబంధించిన వర్క్‌షాప్‌కు హైదరాబాద్‌లోని టి–హబ్ వేదిక కానుంది. డిసెంబర్ 16, 17 తారీఖుల్లో (సోమ, మంగళ) రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌ను.. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్, నెక్సస్ స్టార్టప్ హబ్ (న్యూఢిల్లీ) కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారత్, అమెరికా రక్షణ రంగ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడనుంది. డిఫెన్స్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి స్టార్టప్ సంస్థలు వినూత్న ఆవిష్కరణలు ఇందులో ప్రదర్శించనున్నాయి. పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు ఈ వర్క్‌షాపులో పాల్గోనున్నారు. -
నెక్సన్ ఏఎంటీ వేరియంట్ ధర రూ.7.5 లక్షలు
న్యూఢిల్లీ: ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో (ఏఎమ్‌టీ) కూడిన కాంపాక్ట్ ఎస్యూవీ నెక్సన్ కొత్త వేరియంట్లను టాటా మోటార్స్ మంగళవారం విడుదల చేసింది. 1.2 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ వెర్షన్ నూతన హైపర్‌డ్రైవ్ సెల్ఫ్ షిఫ్ట్ గేర్(ఎస్–ఎస్జీ) ఎక్స్ఎమ్ఏ వేరియంట్ (ఢిల్లీ ఎక్స్–షోరూమ్) ధర రూ.7.50 లక్షలుగా నిర్ణయించింది. 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ వెర్షన్ ధర రూ.8.53 లక్షలుగా వెల్లడించింది. ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ కార్లకు భారత్‌లో డిమాండ్ పెరుగుతోందని కంపెనీ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పారీఖ్ చెప్పారు. టాటా మోటార్స్ అమ్మకాల్లో ఏఎమ్‌టీ విభాగానికి 25% వాటా ఉందన్నారు. -
'స్నాప్‌డీల్-ఫ్లిప్‌కార్ట్' డీల్‌కు నెక్సస్ ఓకే
ముంబై: అతిపెద్ద ఈ -కామర్స్ విలీనానికి సిద్ధమైన జపనీస్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ కీలకమైన అనుమతి సాధించింది. సాఫ్ట్‌బ్యాంక్ కో ఇన్వెస్టర్ నెక్సస్ వెంచర్ పార్టనర్స్ (ఎన్వీపీ) ఈ మెగాడీల్‌కు ఒకే చెప్పింది. ఈ విక్రయ ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి ఎన్వీపీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే మరో ఫౌండర్ కలారీ అనుమతిని సాధించిన సాఫ్ట్ బ్యాంక్, స్నాప్‌డీల్ లో అతి పెద్దవాటాదారుగా ఈ అమ్మక ఒప్పందానికి మరింత చేరువైంది. ఆన్లైన్ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ వారంలో ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశంది. అనంతరం వెంటనే ఈ డీల్ అమల్లోకిరానుంది. అయితే దీనిపై అధికారికంగా ఫ్లిప్‌కార్ట్, సాఫ్ట్‌బ్యాంక్ స్పందించాల్సిఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ మెగాడీల్ ద్వారా స్నాప్‌డీల్ ఫౌండర్స్‌కు 25 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. మరోవైపు కొత్త సంస్థలో ఎన్వీపీ 100 మిలియన్ల డాలర్ల వాటా, కలారీకి సుమారు 70-80 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. కాగా 2016-17లో స్నాప్ డీల్ పెట్టుబడుల కారణంగా 1 బిలియన్ డాలర్లు(రూ.6,500కోట్లు) నష్టపోయినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, సాఫ్ట్‌బ్యాంక్ ప్రస్తుతం స్నాప్ డీల్‌లో 30 శాతం వాటా, నెక్సస్ సుమారు 10 శాతం వాటాను,కలారి 8 శాతం వాటాను కలిగి ఉంది. భారత ఈ కామర్స్ రంగంలో ఇది మెగాడీల్‌గా నిలవనుందని ,తీవ్రమైన పోటీ ఉండనుందని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే భారత ఈ కామర్స్ రంగంపై పట్టుబిగించేందుకు భారీ పెట్టుబడులతో పావులు కదుపుతున్న అమెరికా ఈ కామర్స్ దిగ్గజం, ప్రధాన ప్రత్యర్థి అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్ గట్టిషాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు.