'స్నాప్‌డీల్‌-ఫ్లిప్‌కార్ట్‌' డీల్‌కు నెక‍్సస్‌ ఓకే | Softbank gets Nexus' nod for selling Snapdeal to Flipkart | Sakshi
Sakshi News home page

'స్నాప్‌డీల్‌-ఫ్లిప్‌కార్ట్‌' డీల్‌కు నెక‍్సస్‌ ఓకే

Published Thu, May 11 2017 7:33 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

'స్నాప్‌డీల్‌-ఫ్లిప్‌కార్ట్‌' డీల్‌కు నెక‍్సస్‌ ఓకే - Sakshi

'స్నాప్‌డీల్‌-ఫ్లిప్‌కార్ట్‌' డీల్‌కు నెక‍్సస్‌ ఓకే

ముంబై: అతిపెద్ద ఈ -కామర్స్‌ విలీనానికి సిద్ధమైన జపనీస్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సాఫ్ట్‌ బ్యాంక్‌  కీలకమైన అనుమతి సాధించింది. సాఫ్ట్‌బ్యాంక్‌  కో  ఇన్వెస్టర్‌ నెక్సస్ వెంచర్ పార్టనర్స్ (ఎన్‌వీపీ)  ఈ మెగాడీల్‌కు ఒకే  చెప్పింది.   ఈ విక్రయ ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి  ఎన్‌వీపీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

ఇటీవలే మరో ఫౌండర్‌ కలారీ అనుమతిని సాధించిన సాఫ్ట్‌ బ్యాంక్‌, స్నాప్‌డీల్‌ లో అతి పెద్దవాటాదారుగా  ఈ అమ్మక ఒప్పందానికి మరింత చేరువైంది. ఆన్‌లైన్‌ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఈ వారంలో ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశంది. అనంతరం వెంటనే ఈ డీల్‌ అమల్లోకిరానుంది.   అయితే దీనిపై  అధికారికంగా ఫ్లిప్‌కార్ట్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ స్పందించాల్సిఉంది.  

తాజా నివేదికల ప్రకారం  ఈ మెగాడీల్‌ ద్వారా స్నాప్‌డీల్‌ ఫౌండర్స్‌కు 25 మిలియన్‌ డాలర్లు దక్కనున్నాయి. మరోవైపు కొత్త సంస్థలో ఎన్‌వీపీ 100 మిలియన్ల డాలర్ల వాటా, కలారీకి సుమారు 70-80 మిలియన్‌ డాలర్లు దక్కనున్నాయి.  కాగా 2016-17లో స్నాప్‌ డీల్‌ పెట్టుబడుల కారణంగా 1 బిలియన్‌ డాలర్లు(రూ.6,500కోట్లు) నష్టపోయినట్టు   ప్రకటించిన సంగతి తెలిసిందే.

 రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, సాఫ్ట్‌బ్యాంక్‌ ప్రస్తుతం స్నాప్‌ డీల్‌లో 30 శాతం వాటా, నెక్సస్ సుమారు 10 శాతం వాటాను,కలారి 8 శాతం వాటాను కలిగి ఉంది. భారత ఈ కామర్స్‌ రంగంలో ఇది మెగాడీల్‌గా నిలవనుందని ,తీవ్రమైన పోటీ ఉండనుందని మార్కెట్‌  పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే  భారత ఈ కామర్స్‌ రంగంపై పట్టుబిగించేందుకు  భారీ పెట్టుబడులతో   పావులు కదుపుతున్న అమెరికా ఈ కామర్స్‌ దిగ్గజం, ప్రధాన ప్రత్యర్థి అమెజాన్‌కు   ఫ్లిప్‌కార్ట్‌ గట్టిషాక్‌ ఇ‍వ్వడం ఖాయమంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement