Softbank
-
పేటీఎమ్ నుంచి సాఫ్ట్‌బ్యాంక్ ఔట్
న్యూఢిల్లీ: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ నుంచి పెట్టుబడుల జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ పూర్తిగా వైదొలగింది. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ పేమెంట్ తదితర సేవలందించే వన్97లో సాఫ్ట్‌బ్యాంక్ 2017లో దశలవారీగా 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 12,525 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. అయితే ఈ పెట్టుబడులపై 10–12 శాతం నష్టానికి పేటీఎమ్ నుంచి పూర్తిగా బయటపడినట్లు తెలుస్తోంది. వెరసి పెట్టుబడులపై 15 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,250 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తొలుత భారీ వాటా సాఫ్ట్‌బ్యాంక్ తొలుత అంటే 2021 పబ్లిక్ ఇష్యూకి ముందు పేటీఎమ్‌లో 18.5 శాతం వాటా పొందింది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్(కేమన్) ద్వారా 17.3 శాతం, ఎస్వీఎఫ్ పాంథర్(కేమన్) లిమిటెడ్ ద్వారా మరో 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఐపీవోలో పూర్తి వాటాను ఎస్వీఎఫ్ పాంథర్ 22.5 కోట్ల డాలర్ల(రూ. 1,689 కోట్లు)కు విక్రయించింది. ఈ సమయంలోనే సొంత ప్రణాళికలకు అనుగుణంగా సాఫ్ట్‌బ్యాంక్ 24 నెలల్లోగా మిగిలిన వాటాను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. నిజానికి పేటీఎమ్‌లో వాటాను షేరుకి రూ. 800 సగటు ధరలో సాఫ్ట్‌బ్యాంక్ చేజిక్కించుకుంది. లిస్టింగ్‌లో డీలా ఇష్యూ ధర షేరుకి రూ. 2,150కాగా.. పేటీఎమ్ 9 శాతం తక్కువగా రూ. 1,955 ధరలో లిస్టయ్యింది. తదుపరి ధర పతనమవుతూ వచ్చింది. సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్)ను ఆర్బీఐ నిõÙధించడంతో షేరు ధర మరింత దిగజారింది. ఈ ఏడాది మే 9న చరిత్రాత్మక కనిష్టం రూ. 310ను తాకింది. పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం నేపథ్యంలో గతేడాది(2023–24) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో రూ. 550 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఈ కాలంలో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాల భవిష్యత్ అనిశ్చితుల రీత్యా పీపీబీఎల్‌లో రూ. 227 కోట్ల పెట్టుబడుల(39 శాతం వాటా)ను రద్దు చేసింది. ఈ బాటలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 1,422 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అయితే అంతక్రితం ఏడాది(2022–23)లో రూ. 1,776 కోట్లకుపైగా నష్టం వాటిల్లిన విషయం విదితమే. కాగా.. 7 నెలల క్రితం యూఎస్ బిలియనీర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథవే సైతం పేటీఎమ్ నుంచి నష్టాలకు వైదొలగడం గమనార్హం! షేరుకి దాదాపు రూ. 1,280 ధరలో కొనుగోలు చేసిన బెర్క్‌షైర్ నవంబర్‌లో రూ. 877.3 సగటు ధరలో అమ్మివేసింది. దీంతో రూ. 2,179 కోట్ల పెట్టుబడులకుగాను రూ. 1,371 కోట్లు అందుకుంది.గత వారాంతాన పేటీఎమ్ షేరు బీఎస్ఈలో 2.5 % నష్టంతో రూ. 467 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
పేటీఎంను పూర్తిగా వదిలించుకున్న సాఫ్ట్‌బ్యాంక్
ఫిన్‌టెక్ మేజర్ పేటీఎం (Paytm) నుంచి జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ నిష్క్రమించింది. సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడి విభాగం సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ (SVF) జూన్ త్రైమాసికంలో సుమారు 150 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1250 కోట్లు) నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.సాఫ్ట్‌బ్యాంక్ 2017లో పేటీఎం బ్రాండ్ యజమాన్య సంస్థ అయిన 'వన్ 97 కమ్యూనికేషన్స్'లో సుమారు 1.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.2024-25 ఆర్థిక సంవత్సరం (FY25) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 10-12 శాతం నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించింది. 2021లో పేటీఎం ఐపీఓకి ముందు సాఫ్ట్‌బ్యాంక్ పేటీఎంలో దాదాపు 18.5 శాతం వాటాను కలిగి ఉంది.సాఫ్ట్‌బ్యాంక్ ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 17.3 శాతం వాటాను, ఎస్వీఎఫ్ పాంథర్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఎస్వీఎఫ్ పాంథర్ ఐపీఓ సమయంలో తన మొత్తం వాటాను రూ.1,689 కోట్లకు అంటే దాదాపు 225 మిలియన్ డాలర్లకు విక్రయించింది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ పేటీఎంలో తన మిగిలిన 1.4 శాతం వాటాను విక్రయించింది.ఐపీఓ జరిగిన 24 నెలల తర్వాత పేటీఎం నుంచి నిష్క్రమించనున్నట్లు గతంలోనే సాఫ్ట్‌బ్యాంక్ ప్రకటించింది. చెప్పినట్లుగానే ఇప్పుడు బయటకు వచ్చేసింది. అయితే, ఆ సమయంలోనే కంపెనీ నష్టాన్ని అంచనా వేసిందని కంపెనీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. అప్పట్లో సాఫ్ట్‌బ్యాంక్ పేటీఎం షేర్లను సగటున రూ.800 చొప్పున కొనుగోలు చేసింది. -
ఫస్ట్‌క్రైలో సాఫ్ట్‌బ్యాంక్ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: త్వరలో ఐపీవోకి రానున్న రిటైల్ సంస్థ ఫస్ట్‌క్రైలో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ 310 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లను విక్రయించింది. రెండు విడతల్లో షేర్లను విక్రయించగా, కొందరు అత్యంత సంపన్న ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్స్‌తో ఫస్ట్‌క్రై వేల్యుయేషన్‌ను 3.5–3.75 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లు పేర్కొన్నాయి. 900 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఫస్ట్‌క్రైలో సాఫ్ట్‌బ్యాంక్ గతంలో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తాజా విక్రయానంతరం కంపెనీలో సాఫ్ట్‌బ్యాంక్‌కు ఇంకా 800–900 మిలియన్ డాలర్ల విలువ చేసే వాటాలు ఉన్నాయి. వీటిని తర్వాత విక్రయించే యోచనలో ఉంది. మొత్తం మీద ఫస్ట్‌క్రైలో పెట్టుబడుల ద్వారా 1.3 బిలియన్ డాలర్లు ఆర్జించడంపై సాఫ్ట్‌బ్యాంక్ దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఐపీవో బాటలో ఓలా, ఫస్ట్‌క్రై
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా, ఈకామర్స్ సంస్థ ఫస్ట్‌క్రై పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నాయి. వచ్చే వారం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ యాజమాన్యం దేశ, విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు రోడ్‌షోలను నిర్వహిస్తోంది. ఇక ఫస్ట్‌క్రై కొత్త ఏడాది(2024)లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తదుపరి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావచ్చని అంచనా. పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ రెండు సంస్థలలోనూ పెట్టుబడులున్న సంగతి తెలిసిందే. కాగా.. రెండు కంపెనీలూ వచ్చే వారం సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఐపీవో ద్వారా ఫస్ట్‌క్రై 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,150 కోట్లు) సమీకరించే అవకాశముంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం దీనిలో 60 శాతం వరకూ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనుండగా.. మిగిలిన 40 శాతం ఈక్విటీని కొత్తగా జారీ చేసే వీలుంది. కాగా.. రంజన్ పాయ్ కంపెనీ ఎంఈఎంజీ ఫ్యామిలీ ఆఫీస్, హర్ష్ మరియావాలా సంస్థ షార్ప్ వెంచర్స్, హేమేంద్ర కొఠారీ సంస్థ డీఎస్పీ ఫ్యామిలీ ఆఫీస్ ఇటీవలే ఫస్ట్‌క్రైలో రూ. 435 కోట్ల విలువైన వాటాలను సొంతం చేసుకోవడం గమనార్హం! -
జొమాటోలో వాటా విక్రయం
న్యూఢిల్లీ: జపనీస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ తాజాగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోలో 1.16 శాతం వాటా విక్రయించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 10 కోట్ల షేర్ల(1.16 శాతం వాటా)ను అమ్మివేసింది. అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ గ్రోత్(సింగపూర్) పీటీఈ షేరుకి రూ. 94.7 సగటు ధరలో రూ. 947 కోట్లకు విక్రయించింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏబీ సన్‌లైఫ్, యాక్సిస్, కొటక్ మహీంద్రాతోపాటు సొసైటీ జనరాలి, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, నోమురా సింగపూర్ తదితరాలు జొమాటో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీ తదుపరి జొమాటోలో సాఫ్ట్‌బ్యాంక్ వాటా 3.35% నుంచి 2.19 శాతానికి క్షీణించింది. ఈ వార్తలతో జొమాటో షేరు 5.3 శాతం జంప్ చేసి రూ. 100 సమీపంలో ముగిసింది. -
డెల్హివరీలో తగ్గిన సాఫ్ట్‌బ్యాంక్ వాటా
న్యూఢిల్లీ: జపనీస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ సప్లై చైన్ కంపెనీ డెల్హివరీలో 3.8 శాతం వాటాను విక్రయించింది. బీఎస్ఈ బ్లాక్‌డీల్ సమాచారం ప్రకారం అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ డోర్‌బెల్(కేమన్) ద్వారా 2.8 కోట్ల షేర్లను అమ్మివేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 340.8 సగటు ధరలో విక్రయించిన వీటి విలువ రూ. 954 కోట్లకుపైనే. షేర్లను కొనుగోలు చేసిన సంస్థల జాబితాలో సౌదీ అరేబియన్ మానిటరీ అథారిటీ, సిటీ ఆఫ్ న్యూయార్క్ గ్రూప్ ట్రస్ట్, సొసైటీ జనరాలి, బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్ తదితరాలున్నాయి. కాగా.. తాజా లావాదేవీ తదుపరి డెల్హివరీలో ఎస్వీఎఫ్ డోర్‌బెల్ వాటా 18.42 శాతం నుంచి 14.58 శాతానికి తగ్గింది. బ్లాక్‌డీల్ వార్తల నేపథ్యంలో డెల్హివరీ షేరు బీఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 341 వద్ద స్థిరపడింది. -
యూనికార్న్‌ల కీలక భేటీ
న్యూఢిల్లీ: ఐపీవోకు రావాలనుకుంటున్న 10 యూనికార్న్‌లతో జేపీ మోర్గాన్, జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు ఇటీవల సమావేశాన్ని నిర్వహించాయి. బెంగళూరులో ఈ నెల 3, 4వ తేదీల్లో ఇది జరిగింది. వచ్చే మూడేళ్లలో ఐపీవోకు వచ్చే సన్నాహాలతో ఉన్న స్విగ్గీ, అన్అకాడమీ తదితర యూనికార్న్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సైతం ఇందులో పాల్గొన్నాయి. మామాఎర్త్, లెన్స్‌కార్ట్, అకో, మీషో, ఎలాస్టిక్‌రన్, ఇన్‌మొబి సైతం ఇందులో పాల్గొన్నాయి. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, యూటీఐ తదితర 14 దేశీయ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సైతం పాలు పంచుకున్నాయి. పబ్లిక్ మార్కెట్ ఇన్వెస్టర్లను యూనికార్న్‌లు మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, యూనికార్న్‌ల మధ్య మెరుగైన సమాచార సంప్రదింపులకు వీలుగా ఈ సమావేశం నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది వచ్చిన పేటీఎం, జొమాటో సెకండరీ మార్కెట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యం నెలకొంది. -
భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం: సాఫ్ట్‌బ్యాంకు
న్యూఢిల్లీ: భారత్‌లో సరైన కంపెనీలు, సరైన విలువలకు లభిస్తే పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సాఫ్ట్‌బ్యాంకు ప్రకటించింది. 2022లో ఇలా 5-10 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామని ‘ఇండియా ఎకనమిక్ ఫోరమ్ 2021’ సందర్భంగా సాఫ్ట్‌బ్యాంకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ సీఈవో రాజీవ్‌మిశ్రా తెలిపారు. దశాబ్దానికి పైగా భారత్‌లో సాఫ్ట్‌బ్యాంకు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. గడిచిన ఆరేళ్లలో 14 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు ప్రకటించారు. ‘‘ఈ ఏడాది ఇప్పటి వరకు 3 బిలియన్ డాలర్లు భారత్‌లో ఇన్వెస్ట్ చేశాం. ఏకంగా 24 కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. మరింతగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులు కలిగిన పేటీఎం, పాలసీబజార్ (పీబీ ఫిన్‌టెక్) ఇటీవలే ఐపీవో ముగించుకోవడం తెలిసిందే. ఓయో, డెల్హివరీ సైతం ఐపీవో కోసం ఎదురుచూస్తున్నాయి. (చదవండి: నేను కూడా తగ్గేదే లే అంటున్న స్కోడా కంపెనీ) -
నవంబర్ 8 నుంచి పేటీఎం ఐపీవో
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 8న ప్రారంభమై 10న ముగియనుంది. షేరు ధర శ్రేణి రూ. 2,080–2,150గా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్ 18న లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఇప్పటికే సమర్పించిన పత్రాల్లో ధర శ్రేణి, ఏ ఇన్వెస్టరు ఎంత విక్రయించనున్నారు, ఇతర వివరాలను తర్వాత అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు, పేటీఎం ఐపీవో పరిమాణం రూ. 18,300 కోట్లకు పెరిగింది. కంపెనీలో అతి పెద్ద వాటాదారు అయిన ఆలీబాబా గ్రూప్ సంస్థ యాంట్ ఫైనాన్షియల్తో పాటు సాఫ్ట్‌బ్యాంక్ తదితర ఇతర ఇన్వెస్టర్లు మరిన్ని వాటాలు విక్రయించాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ద్వారా సుమారు రూ. 16,600 కోట్లు సమీకరించాలని పేటీఎం తొలుత ప్రణాళికలు వేసుకుంది. సుమారు రూ. 8,300 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయాలని, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత ఇన్వెస్టర్లు సుమారు రూ. 8,300 కోట్ల షేర్లను విక్రయించాలని భావించింది. కానీ తాజాగా ప్రస్తుత షేర్హోల్డర్లు మరిన్ని వాటాలు విక్రయిస్తుండటంతో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి ఉంచే షేర్ల పరిమాణం మరో రూ. 1,700 కోట్లు పెరిగి రూ. 10,000 కోట్లకు చేరినట్లవుతుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించే వాటాల్లో దాదాపు సగం వాటా యాంట్ ఫైనాన్షియల్‌ది కానుండగా, మిగతాది ఆలీబాబా, ఎలివేషన్ క్యాపిటల్, సాఫ్ట్‌బ్యాంక్, ఇతర షేర్‌హోల్డర్లది ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ముసాయిదా పత్రాలు సమర్పించినప్పుడు వాటాలు విక్రయించే ఇన్వెస్టర్ల జాబితాలో సాఫ్ట్‌బ్యాంక్ పేరు లేదు. స్విస్ రీఇన్సూరెన్స్‌కి వాటాలు.. పేటీఎం బీమా విభాగం పేటీఎం ఇన్సూర్టెక్ (పీఐటీ)లో స్విట్జర్లాండ్‌కి చెందిన రీఇన్సూరెన్స్ వ్యాపార దిగ్గజం స్విస్ రీఇన్సూరెన్స్ 23 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 920 కోట్లుగా ఉండనుంది. దీని కింద ముందస్తుగా రూ. 397 కోట్లు, మిగతాది విడతలవారీగా స్విస్ రీఇన్సూరెన్స్ చెల్లించనుంది. దేశీ బీమా మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్విస్ రీఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని ఈ సందర్భంగా పేటీఎం చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఆయన వ్యక్తిగతంగా కూడా పీఐటీలో పెట్టుబడి పెట్టనున్నారు. అయితే, శర్మ ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయనున్నదీ వెల్లడి కాలేదు. -
సాఫ్ట్‌బ్యాంక్ ‘రికార్డు’ ఐపీవో
టోక్యో: జపాన్ టెక్నాలజీ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ భారీ పబ్లిక్ ఇష్యూతో (ఐపీవో) రికార్డు సృష్టించింది. ఐపీవో ద్వారా 2.65 లక్షల కోట్ల యెన్లు (సుమారు 23.5 బిలియన్ డాలర్లు) సమీకరించింది. జపాన్‌లో ఇది అతి పెద్ద ఐపీవో కాగా.. అంతర్జాతీయంగా భారీ పబ్లిక్ ఇష్యూల్లో రెండోది. 2014 నాటి చైనీస్ ఈకామర్స్ దిగ్గజం ఆలీబాబా ఐపీవో తర్వాత అంతటి భారీ పబ్లిక్ ఇష్యూ ఇదే. అప్పట్లో ఆలీబాబా సుమారు 25 బిలియన్ డాలర్లు సమీకరించింది. మరోవైపు, రికార్డు ఐపీవో అయినప్పటికీ.. లిస్టింగ్‌లో మాత్రం సాఫ్ట్‌బ్యాంక్ షేర్లు భారీగానే క్షీణించాయి. ఇష్యూ ధర షేరు ఒక్కింటికి 1,500 యెన్లు కాగా.. ఓపెనింగ్‌లోనే 1,463 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత అమ్మకాలు మరింత వెల్లువెత్తడంతో 14.5 శాతం క్షీణించి 1,282 యెన్ల వద్ద క్లోజయ్యింది. షేరు ధర గణనీయంగా పడిపోవడం దురదృష్టకరమని సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ సీఈవో కెన్ మియోచి వ్యాఖ్యానించారు. అయితే, ఇది ఆరంభం మాత్రమేనని, క్రమంగా పరిస్థితులు మెరుగుపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లు అస్తవ్యస్తంగా మారటం, మొబైల్ సంస్థల భారీ చార్జీలపై జపాన్‌లో విధాననిర్ణేతలు గుర్రుగా ఉండటం తదితర అంశాలు సాఫ్ట్‌బ్యాంక్ లిస్టింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపి ఉంటాయని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. -
జీ కోసం సాఫ్ట్‌బ్యాంక్‌తో బీఎస్ఎన్ఎల్ జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెలికం సేవలు ప్రవేశపెట్టే దిశగా జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్, ఎన్టీటీ కమ్యూనికేషన్స్‌తో ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ చేతులు కలిపింది. ప్రధానంగా స్మార్ట్ సిటీలకు అవసరమయ్యే సొల్యూషన్స్‌ను రూపొందించే క్రమంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. పోటీ సంస్థలు 4జీ సర్వీసుల ద్వారా ఆదాయాలు ఆర్జించే పనిలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో 5జీ సేవలకు సంబంధించి దిగ్గజ సంస్థలు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నాయని ఆయన వివరించారు. టెలికం మంత్రి మనోజ్ సిన్హా చొరవతో ఈ ఒప్పందం కుదిరినట్లు శ్రీవాస్తవ చెప్పారు. -
హైదరాబాద్‌లో ఫెనటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైసెన్స్డ్ స్పోర్ట్స్ మర్చండైస్ విక్రయంలో ఉన్న ఫెనటిక్స్ భారత్‌లో టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ వద్ద దీనిని నెలకొల్పింది. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ నుంచి గతేడాది పొందిన సుమారు రూ.6,500 కోట్ల పెట్టుబడితో చేపట్టిన విస్తరణలో భాగంగానే భారత్‌లో ప్రవేశించామని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మ్యాట్ మాడ్రిగల్ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు రమణ తూము, సతీష్ ఉమాలే, జాన్ బెయిలీతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిపుణులైన మానవ వనరులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ కేంద్రం సాంకేతికంగా సంస్థకు మద్దతు ఇస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 6,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని వివరించారు. కంపెనీ ఏటా రూ.14,000 కోట్ల టర్నోవరు నమోదు చేస్తోంది. -
ఇక జపాన్‌లోనూ పేటీఎం సేవలు
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ మొబైల్ పేమెంట్స్ సర్వీసెస్ సంస్థ పేటీఎం తన సేవలను జపాన్‌కు విస్తరించనుంది. జపాన్‌లో డిజిటల్ చెల్లింపుల సేవలను ఆరింభించనున్నామని, ఇందుకోసం పేటీఎంతో బాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు సాఫ్ట్ బ్యాంకు గ్రూపు తెలిపింది. సాఫ్ట్ బ్యాంకుకు చెందిన జాయింట్ వెంచర్ పేపే కార్పొరేషన్ ఈ సేవలను ‘పేపే’ పేరుతో ఆరంభించనుంది. అత్యధికంగా నగదు చెల్లింపులు కొనసాగుతున్న జపాన్‌లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించనున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుతం 20 శాతంగా ఉన్నటువంటి నగదురహిత చెల్లింపులను 2025 నాటికి 40 శాతానికి పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపింది. -
ఈ-కామర్స్ మార్కెట్లో అతిపెద్ద డీల్
ముంబై : గత ఎన్నో రోజులుగా ఈ-కామర్స్ మార్కెట్లో చక్కర్లు కొడుతున్న ఫ్లిప్‌కార్ట్ -వాల్‌మార్ట్ అతిపెద్ద డీల్ ఖరారైపోయింది. ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా నేటితో వాల్‌మార్ట్ సొంతమైపోయింది. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను,16 బిలియన్ డాలర్లకు తాను కొనుగోలు చేయబోతున్నట్టు వాల్‌మార్ట్ బుధవారం ప్రకటించింది. మొత్తంగా ఫ్లిప్‌కార్ట్ వాల్యుయేషన్ 20 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఈ ఏడాది చివరి వరకు డీల్‌ను పూర్తి చేయనున్నట్టు వాల్‌మార్ట్ తెలిపింది. వాల్‌మార్ట్ అధికారికంగా ప్రకటించడానికి ముందు సాఫ్ట్‌బ్యాంకు సీఈవో మయవోషి సన్ కూడా ఈ డీల్‌ను ధృవీకరించారు. ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ కొనుగోలు ఇదే కావడం విశేషం. అమెరికాకు చెందిన ఈ కంపెనీకి అతిపెద్ద డీల్ కూడా ఇదే. దీంతో 2016 సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన కొనుగోలు చర్చలకు వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్‌లు నేటితో ముగింపు పలికాయి. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన రిటైల్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందని వాల్‌మార్ట్ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్ డౌ మెక్‌మిల్లన్ అన్నారు, తమ పెట్టుబడులు భారత కస్టమర్లకు నాణ్యత కలిగి ఉత్పత్తులను, సరసమైన ధరల్లో అందించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా కొత్త ఉద్యోగాలు కల్పన, చిన్న సప్లయర్లకు, వ్యవసాయదారులకు, మహిళా వ్యాపారవేత్తలకు కొత్త కొత్త అవకాశాలు అందనున్నాయని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న 20 శాతం వాటాను విక్రయించేసి ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న సాఫ్ట్‌బ్యాంకు పూర్తిగా ఈ ఈ-కామర్స్ దిగ్గజం నుంచి వైదొలుగుతోంది. సాఫ్ట్‌బ్యాంక్‌తో పాటు అస్సెల్, నాస్పర్స్లు కూడా పూర్తిగా ఫ్లిప్‌కార్ట్ నుంచి తప్పుకుంటున్నాయి. టెన్సెంట్, టైగర్ గ్లోబల్, బిన్సీ బన్సాల్, మైక్రోసాఫ్ట్‌లు మాత్రం కొంత వాటాను కలిగి ఉంటున్నాయి. వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ చేసుకున్న ఈ డీల్ దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లో సంచలనంగా మారింది. భారత మార్కెట్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య పోటీ ఈ డీల్‌తో మరింత తీవ్రతరంగా మారనుందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు పడబోయే ఈ పోటీ కేవలం సప్లయి చైన్‌లో ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ పెరగడమే కాకుండా.. పెద్ద మొత్తంలో ఉద్యోగాలను సృష్టించనుంది. అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్‌కు తక్కువ ధరలకు, విభిన్నమైన ఉత్పత్తులను ఆఫర్ చేస్తూ... వినియోగదారులను ఆకట్టుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా మంచి అనుభవముంది. దీంతో అమెజాన్‌కు, వాల్‌మార్ట్‌కు రెండింటికీ ధరల పరంగా తీవ్ర పోటీ నెలకొననుంది. -
ఫ్లిప్‌కార్ట్‌తో సాఫ్ట్‌బ్యాంకు చర్చలు
2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సాఫ్ట్‌బ్యాంకు ఫ్లిప్‌కార్ట్‌తో అనుబంధానికి ప్రయత్నిస్తోంది. స్నాప్‌డీల్‌లో అతిపెద్ద వాటాదారైన సాఫ్ట్‌బ్యాంకు (35% వాటా) దాన్ని ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేయడం ద్వారా దిగ్గజ ఈ కామర్స్ సంస్థలో వాటా పొందాలని చూసింది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం విషయమై చర్చల నుంచి స్నాప్‌డీల్ వైదొలగడంతో, సాఫ్ట్ బ్యాంకు నేరుగా ఫ్లిప్‌కార్టులో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయాన్ని సాఫ్ట్‌బ్యాంకు చైర్మన్ మసయోషిసన్ తాజాగా వెల్ల డించారు. సాఫ్ట్ బ్యాంకు జూన్ క్వార్టర్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయమై మాట్లాడారు. ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంకు విజన్ ఫండ్ ద్వారా 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
స్నాప్‘డీల్ ’కు ఇన్వెస్టర్లు సై
ఇక ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించటం లాంఛనమే! ► ఎట్టకేలకు నెక్సస్ వెంచర్స్‌ను ఒప్పించిన సాఫ్ట్‌బ్యాంక్ ► డీల్ ప్రకారం వ్యవస్థాపకులకు చెరో 30 మిలియన్ డాలర్లు ► నెక్సస్‌కు 80 మిలియన్ డాలర్లు; కలారికి 70–80 మిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ విక్రయం దిశగా మరో అడుగు ముందుకు పడింది. పోటీ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు దీన్ని విక్రయించే ప్రతిపాదనకు కంపెనీలో కీలకమైన ఇన్వెస్టరు నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ (ఎన్వీపీ) ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. ఎన్వీపీ నుంచి ఆమోదం కోసం సహ ఇన్వెస్టరు సాఫ్ట్‌బ్యాంక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యవస్థాపకులు, ఇంకో ఇన్వెస్టరు కలారి క్యాపిటల్ నుంచి సాఫ్ట్‌బ్యాంక్ ఆమోదముద్ర దక్కించుకుంది. అయితే, వేల్యుయేషన్ ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ఎన్వీపీ మాత్రం అంగీకారం తెలపలేదు. దీంతో గత కొద్ది వారాలుగా ప్రతిష్టంభనను తొలగించే క్రమంలో ఎన్వీపీతో సాఫ్ట్‌బ్యాంక్ చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా రెండు సంస్థల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరిగిన నేపథ్యంలో స్నాప్‌డీల్ విక్రయ ప్రతిపాదనకు ఎన్వీపీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ వారంలోనే ఫ్లిప్‌కార్ట్‌తో లాంఛనంగా ఒప్పందంపై సంతకాలు జరగొచ్చని, సాధ్యాసాధ్యాలు.. లాభనష్టాల మదింపు ప్రారంభం కావొచ్చని తెలిసింది. డీల్ ప్రకారం స్నాప్‌డీల్ వ్యవస్థాపకులకు చెరో 30 మిలియన్ డాలర్లు చొప్పున... అంటే దాదాపు రూ.192 కోట్ల వంతున దక్కుతాయి. ఎన్వీపీకి 80 మిలియన్ డాలర్లతో పాటు విలీన సంస్థలో కొంత వాటాలు కూడా లభిస్తాయి. మరో ఇన్వెస్టరు కలారి క్యాపిటల్‌కు 70–80 మిలియన్ డాలర్లు దక్కవచ్చు. అయితే, దీనిపై స్నాప్‌డీల్, సాఫ్ట్‌బ్యాంక్, ఎన్వీపీ, కలారి స్పందించలేదు. భారీగా పడిపోయిన స్నాప్‌డీల్ వేల్యుయేషన్ .. గతేడాది ఫిబ్రవరిలో ఆఖరుసారిగా నిధులు సమీకరించినప్పుడు 6.5 బిలియన్ డాలర్లుగా ఉన్న స్నాప్‌డీల్ వేల్యుయేషన్ ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. ఫ్లిప్‌కార్ట్ గానీ కొనుగోలు చేసిన పక్షంలో 1 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టే అవకాశముందని పరిశీలకుల అంచనా. స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు 30 శాతం పైగా, నెక్సస్‌కు సుమారు 10 శాతం, కలారికి 8 శాతం వాటాలు ఉన్నాయి. స్నాప్‌డీల్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీలో పెట్టిన పెట్టుబడులపై 2016–17లో దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) నష్టం వచ్చినట్లు సాఫ్ట్‌బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
'స్నాప్‌డీల్-ఫ్లిప్‌కార్ట్' డీల్‌కు నెక్సస్ ఓకే
ముంబై: అతిపెద్ద ఈ -కామర్స్ విలీనానికి సిద్ధమైన జపనీస్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ కీలకమైన అనుమతి సాధించింది. సాఫ్ట్‌బ్యాంక్ కో ఇన్వెస్టర్ నెక్సస్ వెంచర్ పార్టనర్స్ (ఎన్వీపీ) ఈ మెగాడీల్‌కు ఒకే చెప్పింది. ఈ విక్రయ ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి ఎన్వీపీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే మరో ఫౌండర్ కలారీ అనుమతిని సాధించిన సాఫ్ట్ బ్యాంక్, స్నాప్‌డీల్ లో అతి పెద్దవాటాదారుగా ఈ అమ్మక ఒప్పందానికి మరింత చేరువైంది. ఆన్లైన్ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ వారంలో ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశంది. అనంతరం వెంటనే ఈ డీల్ అమల్లోకిరానుంది. అయితే దీనిపై అధికారికంగా ఫ్లిప్‌కార్ట్, సాఫ్ట్‌బ్యాంక్ స్పందించాల్సిఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ మెగాడీల్ ద్వారా స్నాప్‌డీల్ ఫౌండర్స్‌కు 25 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. మరోవైపు కొత్త సంస్థలో ఎన్వీపీ 100 మిలియన్ల డాలర్ల వాటా, కలారీకి సుమారు 70-80 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. కాగా 2016-17లో స్నాప్ డీల్ పెట్టుబడుల కారణంగా 1 బిలియన్ డాలర్లు(రూ.6,500కోట్లు) నష్టపోయినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, సాఫ్ట్‌బ్యాంక్ ప్రస్తుతం స్నాప్ డీల్‌లో 30 శాతం వాటా, నెక్సస్ సుమారు 10 శాతం వాటాను,కలారి 8 శాతం వాటాను కలిగి ఉంది. భారత ఈ కామర్స్ రంగంలో ఇది మెగాడీల్‌గా నిలవనుందని ,తీవ్రమైన పోటీ ఉండనుందని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే భారత ఈ కామర్స్ రంగంపై పట్టుబిగించేందుకు భారీ పెట్టుబడులతో పావులు కదుపుతున్న అమెరికా ఈ కామర్స్ దిగ్గజం, ప్రధాన ప్రత్యర్థి అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్ గట్టిషాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు. -
సాఫ్ట్బ్యాంకుకు 9,000 కోట్లు హుష్
♦ పెట్టుబడులకు అచ్చిరాని భారత్ ♦ స్నాప్‌డీల్, ఓలాలో ఇన్వెస్ట్‌మెంట్స్‌తో భారీ నష్టాలు న్యూఢిల్లీ: జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌కు భారత్‌లో పెట్టుబడులు అంతగా కలిసి రావడం లేదు. క్యాబ్ ఆగ్రిగేటర్ ఓలా, ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌లో భారీగా పెట్టిన పెట్టుబడులు విలువ గణనీయంగా తరిగిపోతోంది. ఈ రెండింటిలో పెట్టిన పెట్టుబడుల విలువ ఏకంగా రూ.9 వేల కోట్ల మేర కరిగిపోయినట్లు సాఫ్ట్‌బ్యాంక్ వెల్లడించింది. స్నాప్‌డీల్‌లో పెట్టుబడుల కారణంగా సుమారు 1 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 6,500 కోట్లు) నష్టాలు చవిచూడాల్సి వచ్చినట్లు తెలిపింది. ఈ మొత్తం 2016–17లో స్నాప్‌డీల్‌లో పెట్టిన పెట్టుబడులకు దాదాపు సమానం. ‘భారత ఈ కామర్స్ మార్కెట్లో పోటీ గణనీయంగా పెరిగిపోవడంతో సంస్థ వ్యాపార పనితీరు ఆశించిన దాని కన్నా తక్కువ స్థాయిలో ఉంది’’ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సాఫ్ట్‌బ్యాంక్ తెలిపింది. ‘అకౌంటింగ్ విధానాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు, మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా పెట్టుబడుల విలువ తరచూ పెరుగుతుండటం లేదా తగ్గుతుండటం జరుగుతుంది. తాజా ఫలితాలు పూర్తి ఆర్థిక సంవత్సరం చోటుచేసుకున్న పరిణామాలను ప్రతిఫలిస్తాయి‘ అని పేర్కొంది. భారత మార్కెట్లో సుమారు 10 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించిన సాఫ్ట్‌బ్యాంక్... ప్రస్తుతం స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించే ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనకు దాదాపుగా స్నాప్‌డీల్ బోర్డు సభ్యులందరి దగ్గర్నుంచీ మద్దతు దక్కించుకున్న సాఫ్ట్‌బ్యాంక్ .. మరో కీలక ఇన్వెస్టరైన నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్(ఎన్వీపీ) ఆమోదం కోసం ప్రయత్నిస్తోంది. ఎన్వీపీ కూడా విక్రయ ప్రతిపాదన పట్ల సుముఖంగా మారుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ డీల్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమస్యల్లో స్టార్టప్‌లు .. దేశీ సంస్థ ఫ్లిప్‌కార్ట్, అటు అమెరికన్ సంస్థ అమెజాన్ వంటి దిగ్గజాలతో పోటీపడలేక చతికిలబడిన స్నాప్‌డీల్ ప్రస్తుతం దేశీ ఈకామర్స్ మార్కెట్లో .. మూడో స్థానంలో ఉంది. సుమారు 6.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో స్నాప్‌డీల్ 2016 ఫిబ్రవరిలో నిధులు సమీకరించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం బిలియన్ డాలర్లకే ఫ్లిప్‌కార్ట్‌కు దీన్ని విక్రయించే అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఇక, సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్ చేసిన మరో స్టార్టప్ ఓలా కూడా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. అమెరికాకు చెందిన ప్రత్యర్థి సంస్థ ఉబెర్ భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తూ దూసుకుపోతోంది. దీంతో ఓలా కూడా నిధులను కుమ్మరించక తప్పడం లేదు. భారీగా ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, ఉద్యోగుల వ్యయాలతో 2015–16లో కన్సాలిడేటెట్ ప్రాతిపదికన ఓలా దాదాపు రూ. 2,311 కోట్ల నష్టాలు ప్రకటించింది. -
సాఫ్ట్ బ్యాంకుకు 9వేల కోట్లు హుష్ కాకి
న్యూఢిల్లీ : భారత్ లో పెట్టుబడులతో జపనీస్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంకు గ్రూప్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 1.4 బిలియన్ డాలర్లు లేదా 9000 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్టు ఈ గ్రూప్ బుధవారం పేర్కొంది. ముఖ్యంగా దేశీయ స్టార్టప్స్ స్నాప్ డీల్, ఓలా కంపెనీ వల్ల సాఫ్ట్ బ్యాంకుకు ఈ మేర నష్టాలొచ్చినట్టు తెలిసింది. సబ్సిడరీలు, అసోసియేట్ల షేర్లు విలువ నష్టాలతో 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ మేర కంపెనీకి నష్టాలొచ్చాయని సాఫ్ట్ బ్యాంకు వెల్లడించింది. దానిలో స్నాప్ డీల్ మాతృ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లు కలిగి ఉన్న స్టార్ ఫిష్ ఐ పీటీఈ లిమిటెడ్ ముఖ్యమైందని తెలిపింది. అంతేకాక భారత్ లో తన రెండో అతిపెద్ద పెట్టుబడుల సంస్థ ఓలా వల్ల కూడా 400 మిలియన్ డాలర్లు నష్టపోయినట్టు పేర్కొంది. దీంతో స్నాప్ డీల్, ఓలా వల్ల ఫేర్ వాల్యు వద్ద 1.4 బిలియన్ డాలర్ల నష్టాలను నమోదుచేసినట్టు వెల్లడించింది. భారత్ లో ఈ-కామర్స్ మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీ, అంచనావేసిన దానికంటే మరింత తక్కువగా స్నాప్ డీల్ ప్రదర్శన ఉందని సాఫ్ట్ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. స్నాప్ డీల్ అత్యల్ప ప్రదర్శనతో స్టార్ ఫిష్ నికర ఆస్తి విలువ తగ్గిపోయినట్టు ఈ టెలికమ్యూనికేషన్ దిగ్గజం పేర్కొంది. దేశీయ స్టార్టప్ ఎకో సిస్టమ్ లో సాఫ్ట్ బ్యాంకు అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్టర్. ఇప్పటివరకు 2 బిలియన్ డాలర్లకు పైగా(12,911 కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం స్నాప్ డీల్ ను దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు విక్రయించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. స్నాప్ డీల్ లో సాఫ్ట్ బ్యాంకు 900 మిలియన్ డాలర్ల(5,810కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ఈ ఏడాది మొదట్లో కూడా స్నాప్ డీల్, ఓలాల వల్ల 350 మిలియన్ డాలర్ల నష్టాలు వచ్చినట్టు సాప్ట్ బ్యాంకు తెలిపిన సంగతి తెలిసిందే. -
సాప్ట్ బ్యాంకుతో పేటీఎం భారీ డీల్
-
సాప్ట్ బ్యాంకుతో పేటీఎం భారీ డీల్
న్యూఢిల్లీ : దేశీయ ఈ-కామర్స్ రంగంలో దూసుకెళ్తున్న పేటీఎంలోకి భారీగా పెట్టుబడులు రానున్నట్టు తెలుస్తోంది. జపాన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సాఫ్ట్‌బ్యాంకు పేటీఎంలో 1.2 బిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 7,750 కోట్ల రూపాయల నుంచి 9687 కోట్లు రూపాయల వరకు ఉండొచ్చు. వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే ఈ ఫిన్‌టెక్ స్టార్టప్ పేటీఎం, ఈ డీల్ విషయంలో జపాన్ సంస్థతో సంప్రదింపులు జరిపినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. మూడు నెలలుగా జరుగుతున్న ఈ సంప్రదింపుల్లో ప్రస్తుత పేటీఎం ఇన్వెస్టర్ సైఫ్ పార్టనర్స్, వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందిన కొన్ని షేర్లను సాప్ట్ బ్యాంకు కొనుగోలుచేస్తోంది. అదేవిధంగా కంపెనీల్లోనూ నగదు రూపంలో పెట్టుబడులు పెట్టనుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. సాఫ్ట్‌బ్యాంకు ప్రతిపాదిత పెట్టుబడులు పెట్టినట్లయితే 5 బిలియన్ డాలర్ల (రూ.32,293కోట్లకు పైగా) విలువ ఉండే పేటీఎం విలువ 7 బిలియన్ల డాలర్ల(రూ.45,216 కోట్లకు)కు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మొబైల్ వ్యాలెట్, ఈ-కామర్స్ సర్వీసుల్లో దూసుకెళ్లున్న పేటీఎం తాజాగా పెట్టుబడులతో పేటీఎం బ్యాంకు సర్వీసుల విస్తరణను మరింత వేగవంతం చేసుకోబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పేటీఎం సాఫ్ట్ బ్యాంక్ సంస్థ లావాదేవీల్లో భాగంగా స్నాప్‌డీల్ సొంతమైన చెల్లింపులు సంస్థ ఫ్రీచార్జ్ కొనుగోలు చేయవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. సాఫ్ట్‌బ్యాంకు కంపెనీ ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలైన ఫ్లిప్‌కార్డు, అమెజాన్ ఇండియాలకు పోటీగా భారత మార్కెట్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
అమ్మకానికి ఫ్రీచార్జ్ రేసులో పేటీఎమ్ !
ముంబై: స్నాప్‌డీల్‌కు చెందిన మొబైల్ వాలెట్ ప్లాట్ఫార్మ్ ఫ్రీచార్జ్‌ను సాఫ్ట్‌బ్యాంక్ విక్రయించనున్నదని సమాచారం. దీనికి సంబంధించి కొన్ని సంస్థలతో సాఫ్ట్‌బ్యాంక్ చర్చలు జరుపుతోందని డీల్ విలువ 15–20 కోట్ల డాలర్ల రేంజ్లో ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్నాప్‌డీల్‌ను మరో ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌కు సాఫ్ట్‌బ్యాంక్ విక్రయించనున్నదన్న వార్తల నేపథ్యంలో ఫ్రీచార్జ్ విక్రయ వార్తలు రావడం విశేషం. కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆలీబాబా యాజమాన్యంలోని పేటీఎమ్ సంస్థ ప్రీచార్జ్ ను కొనుగోలు చేయొచ్చని సమాచారం. రెండేళ్ల క్రితం ప్రీచార్జ్‌ను స్నాప్‌డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ 40 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కాలంలో నిధుల కోసం ఫ్రీచార్జ్ సంస్థ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పేపాల్, పేయూలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాగా కొన్ని నెలల క్రితం ప్రీచార్జ్‌ను కొనుగోలు చేయడానికి విజయ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎమ్ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్‌ను సంప్రదించిందని, అప్పుడు జాస్పర్ ఇన్ఫోటెక్ 50 కోట్ల డాలర్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఒక దశలో ప్రీచార్జ్ విలువను 90 కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. కాగా గత మూడు నెలల్లో స్నాప్‌డీల్, ప్రీచార్జ్లకు సంబంధించి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ప్రీచార్జ్ కోసం 15 కోట్ల డాలర్లనే పేటీఎమ్ ఆఫర్ చేస్తోందని సమాచారం. -
కొద్ది వారాల్లోనే స్నాప్‌డీల్ విక్రయ డీల్!
మద్దతు కూడగట్టే దిశగా సాఫ్ట్‌బ్యాంక్ న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ను విక్రయించే ఆలోచనతో ఉన్న జపాన్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ ఈ విషయమై తన ప్రయత్నాలను ముమ్మరం చేయనుంది. వచ్చే కొన్ని వారాల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం... మంగళవారం స్నాప్‌డీల్ బోర్డు భేటీ జరిగింది. కంపెనీ విక్రయ ప్రతిపాదనపై ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌బ్యాంకు అదిపెద్ద వాటాదారునిగా ఉంది. అయినప్పటికీ విక్రయ ప్రతిపాదనకు ఇతర డైరెక్టర్ల మద్దతును కూడగట్టాలన్న ఆలోచనతో ఉంది. స్నాప్‌డీల్ విక్రయంపై వచ్చే 4 నుంచి 8 వారాల్లో నిర్ణయం వెలువడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. స్నాప్‌డీల్‌ను దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పేటీఎం పేరు కూడా తెరపైకి వచ్చింది. పేటీఎంలో ప్రముఖ వాటాదారునిగా ఉన్న అలీబాబా స్నాప్‌డీల్‌లోనూ వాటా కలిగి ఉండడం గమనార్హం. -
భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు కష్టాలు..!
పెట్టుబడులపై భారీ నష్టాలు • ఓలా, స్నాప్‌డీల్‌లో ఇన్వెస్ట్మెంట్స్ విలువ 350 మిలియన్ డాలర్లు తగ్గుదల న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సైట్ స్నాప్‌డీల్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహా భారత్‌కి చెందిన పలు సంస్థల్లో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ చేసిన పెట్టుబడులు గణనీయంగా కరిగిపోయాయి. డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో జాస్పర్ ఇన్ఫోటెక్, ఏఎన్ఐ టెక్నాలజీస్ వంటి సంస్థల్లో దాదాపు 350 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడుల విలువను తగ్గించినట్లు చేసినట్లు సాఫ్ట్‌బ్యాంక్ పేర్కొంది. స్నాప్‌డీల్‌కు జాస్పర్ ఇన్ఫోటెక్ మాతృసంస్థ కాగా, ఓలాను ఏఎన్ఐ టెక్నాలజీస్ నిర్వహిస్తోంది. అయితే, పెట్టుబడుల విలువను తగ్గించడాన్ని.. ఆయా కంపెనీల పనితీరును ప్రతిబింబించడంగా పరిగణించరాదని సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి పేర్కొన్నారు. సాధారణంగా అకౌంటింగ్ విధానాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు తదితర అంశాల కారణంగా పోర్ట్‌ఫోలియో కంపెనీల్లో పెట్టుబడుల వేల్యుయేషన్స్ మారుతుంటాయని వివరించారు. సాఫ్ట్‌బ్యాంక్ సారథ్యంలో 2014లో ఓలాలోకి 210 మిలియన్ డాలర్లు, స్నాప్‌డీల్‌లోకి 627 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత కూడా రెండు కంపెనీల్లో సాఫ్ట్‌బ్యాంక్ మరింత ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటిదాకా భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ 2 బిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులు పెట్టింది. వచ్చే 5–10 సంవత్సరాల్లో పెట్టుబడులను 10 బిలియన్ డాలర్ల దాకా పెంచుకోనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. స్నాప్‌డీల్ ’షాపో’.. షట్‌డౌన్ చిన్న తరహా వ్యాపార సంస్థల మధ్య క్రయ, విక్రయ లావాదేవీలకు తోడ్పడే ఆన్లైన్ ప్లాట్‌ఫాం షాపోను శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు స్నాప్‌డీల్ వెల్లడించింది. 2013లో స్నాప్‌డీల్ దీన్ని కొనుగోలు చేసింది. ఈ తరహా సర్వీసుల వ్యవస్థకు డిమాండ్ ఏర్పడటానికి మరికొన్నేళ్లు పట్టేసే అవకాశం ఉన్నందున తాజా నిర్ణయం తీసుకున్నట్లు స్నాప్‌డీల్ పేర్కొంది. ఓలా సీఎఫ్‌వో బన్సల్ ఔట్.. ఓలా టాప్ మేనేజ్మెంట్లో మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రఘువేశ్ సరూప్ రాజీనామా చేశారు. వీరు ఏడాది క్రితం ఓలాలో చేరారు. బన్సల్ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ కాగా, సరూప్ మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ఎండీ. బన్సల్ రాజీనామాతో ప్రస్తుత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పల్లవ్ సింగ్‌కు తాత్కాలిక సీఎఫ్‌వోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
అమెరికా వన్‌వెబ్‌లో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు
టోక్యో: జపాన్‌కు చెందిన టెలికం, ఇంధన దిగ్గజ కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్, అమెరికాకు చెందిన వన్‌వెబ్ కంపెనీలో వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ రెండు కంపెనీలు కలిసి ఫ్లోరిడాలో కృత్రిమ ఉపగ్రహాలు తయారు చేసే ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీ తక్కువ వ్యయంతో వారానికి 15 కృత్రిమ ఉపగ్రహాలు తయారు చేస్తుంది. ఈ ఫ్యాక్టరీ కారణంగా ఇంజినీరింగ్, తయారీ, ఇతర రంగాల్లో మొత్తం 3,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా.2018 కల్లా ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తుందని వన్‌వెబ్ భావిస్తోంది.