టోక్యో: సాఫ్ట్ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా నియామకాన్ని చేపట్టినట్టు సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ (ఎస్‌బీజీ) ప్రకటించింది. గ్రూప్ దేశీయ టెలీకమ్యూనికేషన్స్ హెడ్ గా పనిచేస్తున్న కెన్ మియోషిని నియమించినట్టు తెలిపింది. కంపెనీ సీఓఓ మరియు అధ్యక్ష బాధ్యతలను అప్పగించినట్టు బుధవారం సాఫ్ట్ బ్యాంక్ ప్రకటించింది.
సాఫ్ట్‌బ్యాంక్ కీలక పదవుల నుంచి నికేశ్ అరోరా వైదొలగడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీవోవో, రిప్రజింటేటివ్ డై రెక్టర్ పదవులకు నికేష్ అరోరా రాజీనామా చేశారు. ఇది జూన్ 22 (నేటి) నుంచి అమల్లోకి వచ్చింది. అరోరా రాజీనామానను అంగీకరించిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ నూతన అధ్యక్షుడిని ఎన్నికను ప్రకటించింది.
కాగా 1981లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ విడిభాగాల రంగంలోకి అడుగుపెట్టిన సాఫ్ట్‌బ్యాంక్ అనతికాలంలోనే జపాన్‌లో అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్, ఇన్వెస్ట్‌మెంట్, కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. అటు గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల వేతన ప్యాకేజ్ తో ప్రపంచంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా ఆవిర్భవించిన అరోరా రాజీనామా పలువురిని ఆశ్యర్యపరిచింది. భారీ వేతనం, భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్లు వంటి తదితర అంశాల్లో అరోరాపై బ్యాంక్ ఇన్వెస్టర్లు విమర్శలు నేపథ్యంలో సాఫ్ట్‌బ్యాంక్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సోమవారం అరోరాకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా, ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన తప్పుకున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.
సాఫ్ట్‌బ్యాంక్ నూతన అధ్యక్షుడు ఈయనే!
Published Wed, Jun 22 2016 2:16 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
Advertisement
Advertisement