సాఫ్ట్ బ్యాంకు నుంచి అరోరా ఔట్
ఇక అడ్వైజర్‌గా ఏడాదిపాటు సేవలు
న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్ కీలక పదవుల నుంచి నికేశ్ అరోరా వైదొలిగారు. ఈయన సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీవోవో, రిప్రజింటేటివ్ ైడె రెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. ఇది జూన్ 22 (నేటి) నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈయన సాఫ్ట్‌బ్యాంక్ అడ్వైజర్‌గా కొత్తగా ఏడాదిపాటు సేవలు అందించనున్నారు. అరోరా జూలై 1 నుంచి ఈ బాధ్యతలను స్వీకరించే అవకాశముంది. ఈ విషయాలను సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ (ఎస్‌బీజీ) ధ్రువీకరించింది.
ఇక సాఫ్ట్‌బ్యాంక్‌లో అరోరా ప్రస్థానం 2014లో ప్రారంభమైంది. గతేడాది మే నెలలో ఈయన సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్ , సీవోవోగా బాధ్యతలు చేపట్టారు. సాఫ్ట్‌బ్యాంక్‌లోకి రాక ముందు ఈయన గూగుల్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. కాగా అరోరా గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల వేతన ప్యాకేజ్‌ను స్వీకరించారు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా ఆవిర్భవించారు. ఈయన ఆధ్వర్యంలోనే సాఫ్ట్‌బ్యాంక్ భారత్‌లోని స్నాప్‌డీల్, ఓలా క్యాబ్స్, రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్, హోటల్ బుకింగ్ యాప్ ఓయో రూమ్స్, గ్రోఫర్స్ వంటి స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటికే భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్లు 1 బిలియన్ మార్క్‌ను అధిగమించాయి.
భారీ వేతనం, భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్లు వంటి తదితర అంశాల్లో అరోరాపై బ్యాంక్ ఇన్వెస్టర్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై సాఫ్ట్‌బ్యాంక్ ఇటీవల ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సోమవారం అరోరాకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా, ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన తప్పుకోవడం గమనార్హం.