ఫిన్‌టెక్ మేజర్ పేటీఎం (Paytm) నుంచి జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ నిష్క్రమించింది. సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడి విభాగం సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ (SVF) జూన్ త్రైమాసికంలో సుమారు 150 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1250 కోట్లు) నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
సాఫ్ట్‌బ్యాంక్ 2017లో పేటీఎం బ్రాండ్ యజమాన్య సంస్థ అయిన 'వన్ 97 కమ్యూనికేషన్స్'లో సుమారు 1.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.2024-25 ఆర్థిక సంవత్సరం (FY25) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 10-12 శాతం నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించింది. 2021లో పేటీఎం ఐపీఓకి ముందు సాఫ్ట్‌బ్యాంక్ పేటీఎంలో దాదాపు 18.5 శాతం వాటాను కలిగి ఉంది.
సాఫ్ట్‌బ్యాంక్ ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 17.3 శాతం వాటాను, ఎస్వీఎఫ్ పాంథర్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఎస్వీఎఫ్ పాంథర్ ఐపీఓ సమయంలో తన మొత్తం వాటాను రూ.1,689 కోట్లకు అంటే దాదాపు 225 మిలియన్ డాలర్లకు విక్రయించింది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ పేటీఎంలో తన మిగిలిన 1.4 శాతం వాటాను విక్రయించింది.
ఐపీఓ జరిగిన 24 నెలల తర్వాత పేటీఎం నుంచి నిష్క్రమించనున్నట్లు గతంలోనే సాఫ్ట్‌బ్యాంక్ ప్రకటించింది. చెప్పినట్లుగానే ఇప్పుడు బయటకు వచ్చేసింది. అయితే, ఆ సమయంలోనే కంపెనీ నష్టాన్ని అంచనా వేసిందని కంపెనీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. అప్పట్లో సాఫ్ట్‌బ్యాంక్ పేటీఎం షేర్‌లను సగటున రూ.800 చొప్పున కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment