న్యూఢిల్లీ: భారత్‌లో సరైన కంపెనీలు, సరైన విలువలకు లభిస్తే పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సాఫ్ట్‌బ్యాంకు ప్రకటించింది. 2022లో ఇలా 5-10 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామని ‘ఇండియా ఎకనమిక్ ఫోరమ్ 2021’ సందర్భంగా సాఫ్ట్‌బ్యాంకు ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ సీఈవో రాజీవ్‌మిశ్రా తెలిపారు. దశాబ్దానికి పైగా భారత్‌లో సాఫ్ట్‌బ్యాంకు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. గడిచిన ఆరేళ్లలో 14 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు ప్రకటించారు.
‘‘ఈ ఏడాది ఇప్పటి వరకు 3 బిలియన్ డాలర్లు భారత్‌లో ఇన్వెస్ట్ చేశాం. ఏకంగా 24 కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. మరింతగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులు కలిగిన పేటీఎం, పాలసీబజార్ (పీబీ ఫిన్‌టెక్) ఇటీవలే ఐపీవో ముగించుకోవడం తెలిసిందే. ఓయో, డెల్హివరీ సైతం ఐపీవో కోసం ఎదురుచూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment