
న్యూఢిల్లీ: జపనీస్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోలో 1.16 శాతం వాటా విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 10 కోట్ల షేర్ల(1.16 శాతం వాటా)ను అమ్మివేసింది. అనుబంధ సంస్థ ఎస్‌వీఎఫ్ గ్రోత్(సింగపూర్) పీటీఈ షేరుకి రూ. 94.7 సగటు ధరలో రూ. 947 కోట్లకు విక్రయించింది.
మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏబీ సన్‌లైఫ్, యాక్సిస్, కొటక్ మహీంద్రాతోపాటు సొసైటీ జనరాలి, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, నోమురా సింగపూర్ తదితరాలు జొమాటో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీ తదుపరి జొమాటోలో సాఫ్ట్‌బ్యాంక్ వాటా 3.35% నుంచి 2.19 శాతానికి క్షీణించింది.
ఈ వార్తలతో జొమాటో షేరు 5.3 శాతం జంప్ చేసి రూ. 100 సమీపంలో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment