50 కోట్ల డాలర్ల సమీకరణ బాటలో స్నాప్‌డీల్
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్ తాజాగా ఆలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్, ఫాక్స్‌కాన్ తదితర సంస్థల నుంచి 50 కోట్ల డాలర్లు (రూ. 3,000 కోట్లకుపైగా) సమీకరించనుంది. ఇందుకోసం వాటితో చర్చలు జరుగుతున్నాయని, మరికొద్ది వారాల్లో ఫండింగ్ వివరాలు వెల్లడి కావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజా డీల్‌తో స్నాప్‌డీల్ విలువ 4-5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని తెలిపాయి. దీనిపై స్నాప్‌డీల్, సాఫ్ట్‌బ్యాంక్ వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. ఆలీబాబాతో ఇటీవలే నిధుల కోసం చర్చలు జరిపినప్పటికీ స్నాప్‌డీల్ భారీ వేల్యుయేషన్లు కోరడంతో అవి విఫలమయ్యాయి. వివిధ సంస్థల నుంచి స్నాప్‌డీల్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల పైగా నిధులు సమీకరించింది.