హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైసెన్స్‌డ్ స్పోర్ట్స్ మర్చండైస్ విక్రయంలో ఉన్న ఫెనటిక్స్ భారత్‌లో టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ వద్ద దీనిని నెలకొల్పింది. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ నుంచి గతేడాది పొందిన సుమారు రూ.6,500 కోట్ల పెట్టుబడితో చేపట్టిన విస్తరణలో భాగంగానే భారత్‌లో ప్రవేశించామని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మ్యాట్ మాడ్రిగల్ తెలిపారు.
కంపెనీ ప్రతినిధులు రమణ తూము, సతీష్ ఉమాలే, జాన్ బెయిలీతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిపుణులైన మానవ వనరులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ కేంద్రం సాంకేతికంగా సంస్థకు మద్దతు ఇస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 6,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని వివరించారు. కంపెనీ ఏటా రూ.14,000 కోట్ల టర్నోవరు నమోదు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment