Innovation Center
-
ఎన్విడియాతో రిలయన్స్ జట్టు
ముంబై: అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా, దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా చేతులు కలిపాయి. భారత్‌లో కృత్రిమ మేధ (ఏఐ) కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయనున్నాయి. రిలయన్స్‌కి చెందిన కొత్త డేటా సెంటర్లో ఎన్విడియాకి చెందిన బ్లాక్వెల్ ఏఐ చిప్‌లను వినియోగించనున్నారు. ఎన్విడియా ఏఐ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో జెన్సెన్ హువాంగ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. భాగస్వామ్యం కింద రూపొందించే అప్లికేషన్లను రిలయన్స్ .. భారత్‌లోని వినియోగదార్లకు కూడా అందించే అవకాశం ఉందని హువాంగ్ తెలిపారు. అయితే, ఈ భాగస్వామ్యానికి సంబంధించి పెట్టుబడులు, నెలకొల్పబోయే మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ‘చిప్‌ల డిజైనింగ్‌లో భారత్‌కి ఇప్పటికే ప్రపంచ స్థాయి నైపుణ్యాలు ఉన్నాయి. ఎన్విడియా చిప్‌లను హైదరాబాద్, బెంగళూరు, పుణెలో డిజైన్ చేస్తున్నారు. ఎన్విడియాలో మూడో వంతు ఉద్యోగులు ఇక్కడే ఉన్నారు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ సేవలతో ప్రపంచానికి ఐటీ బ్యాక్ ఆఫీస్‌గా పేరొందిన భారత్ ఇకపై అవే నైపుణ్యాలను ఉపయోగించి ఏఐ ఎగుమతి దేశంగా ఎదగవచ్చని చెప్పారు. 2024లో భారత కంప్యూటింగ్ సామర్థ్యాలు 20 రెట్లు వృద్ధి చెందుతాయని, త్వరలోనే ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్‌ను ఎగుమతి చేస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో రెండో స్థానంలో ఉన్న ఎన్విడియాకు .. భారత్‌లో హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ ఇంటెలిజెన్స్ మార్కెట్‌గా భారత్: అంబానీ భారత్ ప్రస్తుతం కొత్త తరం ఇంటెలిజెన్స్ సాంకేతికత ముంగిట్లో ఉందని, రాబోయే రోజుల్లో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. ‘అతిపెద్ద ఇంటెలిజెన్స్ మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుంది. మనకు ఆ సత్తా ఉంది. ప్రపంచానికి కేవలం సీఈవోలనే కాదు ఏఐ సరీ్వసులను కూడా ఎగుమతి చేసే దేశంగా భారత్ ఎదుగుతుంది‘ అని అంబానీ వ్యాఖ్యానించారు. దేశీయంగా పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రా ఉంటే స్థానికంగా సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ మార్కెట్లో భారత్ కీలక దేశంగా మారగలదని ఆయన చెప్పారు. అమెరికా, చైనాలతో పాటు భారత్‌లో అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని అంబానీ చెప్పారు. డేటాను అత్యంత చౌకగా అందిస్తూ సంచలనం సృష్టించినట్లుగానే ఇంటెలిజెన్స్ విషయంలోనూ గొప్ప విజయాలతో ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపర్చగలదని ఆయన పేర్కొన్నారు.ఇన్ఫీ, టీసీఎస్‌లతో కూడా.. భారత మార్కెట్లో కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రోలతో చేతులు కలుపుతున్నట్లు హువాంగ్ తెలిపారు. ఎన్విడియా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫాం ఆధారిత ఏఐ సొల్యూషన్స్‌ను వినియోగించుకోవడంలో క్లయింట్లకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తోడ్పడనున్నాయి. అలాగే ఇండస్ 2.0 అనే ఏఐ నమూనాను అభివృద్ధి చేసేందుకు ఎన్విడియా మోడల్‌ను టెక్ మహీంద్రా ఉపయోగించనుంది. అటు టాటా కమ్యూనికేషన్స్, యోటా డేటా సర్వీసెస్ వంటి సంస్థలకు ఎన్విడియా తమ హాపర్ ఏఐ చిప్‌లను సరఫరా చేయనుంది. -
కొత్త ఆవిష్కరణలకు ‘ఇంటింటా ఇన్నోవేటర్’
చదువున్నా, లేకపోయినా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2024 సంవత్సరానికిగాను ఆరో విడత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతుంది. వివిధ రంగాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనటమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులో అన్నదాతలు, విద్యావేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు..ఇలా ఎవరైనా ఆవిష్కరణలు చేయవచ్చని ప్రభుత్వం చెప్పింది. తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి పూర్తి వివరాలతో తమ ప్రయోగ వివరాలను తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులను అందజేస్తుంది.ఈ సందర్భంగా ఐటీ అండ్ కమ్యునికేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ..‘ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలు గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. విభిన్న వర్గాల ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభను పెంపొందించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. గతంలో కంటే ఈ ప్రోగ్రామ్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు.‘ఇంటింటా ఇన్నోవేటర్ 2024’ కార్యక్రమంలో పాల్గొనే ఆవిష్కర్తలు ఆగస్టు 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. వారి వివరాలను వాట్సాప్ 9100678543కి పంపించాల్సి ఉంటుంది.దరఖాస్తు విధానం..దరఖాస్తుదారు పేరు, వయసు, ఫొటో, వృత్తి, గ్రామం, మండలం వంటి వివరాలు ప్రాథమికంగా పంపించాలి. దాంతో పాటు 100 పదాలలోపు ఆవిష్కరణ గురించి క్లుప్తంగా వివరించాలి. ఆవిష్కరణకు సంబంధించి రెండు నిమిషాల నిడివి ఉన్న రెండు వీడియోలు, నాలుగు ఫొటోలు తీసి పంపాల్సి ఉంటుంది.తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. స్థానిక సవాళ్లకు పరిష్కారం అందించే వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరింది. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ఆగస్టు 15, 2024న ప్రోత్సాహకాలు అందిస్తామని తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలకు చెందిన 3,000+ గ్రామ పంచాయతీల నుంచి ఆవిష్కర్తలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రోగ్రామ్‌ను 1 కోటి మందికి పైగా గ్రామీణ పౌరులకు అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: నేరం జరిగింది.. రూ.2 వేలకోట్లు చెల్లిస్తాం: బోయింగ్జిల్లాకు ఒకరు చొప్పున మొత్తం 33 మంది ‘ఇన్నోవేషన్ మిత్ర’లతో కూడిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ బృందంలోని సభ్యులు కోఆర్డినేటర్లుగా సేవలందిస్తారు. జిల్లా అధికారులు, ఎన్జీఓలు, పౌర సమాజ సంస్థలు, గ్రామాల్లోని ప్రజలను అనుసంధానం చేస్తూ ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారు. -
6జీ.. భారత ఆత్మవిశ్వాస ప్రతీక: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసే స్థాయికి భారత్ ఎదిగిందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ సంఘం(ఐటీయూ) ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్ సెంటర్‌ను బుధవారం ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ దేశంలోకి 5జీ సేవలు మొదలైన 6 నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధన మొదలవుతోంది. ఇది భారత ఆత్మవిశ్వాసానికి దర్పణం పడుతోంది. 4జీ కంటే ముందు టెలికం సాంకేతికతలో భారత్ కేవలం ఒక యూజర్‌గా ఉండేది. కానీ ఇప్పుడు భారీ టెలికం టెక్నాలజీని ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తోంది. దేశీయంగా అభివృద్ధిని సాధించిన టెక్నాలజీ వైపు ప్రపంచం దృష్టి సారించింది. ఇది భారత సాంకేతిక దశాబ్దం ‘సమ్మిళిత సాంకేతికత వల్లే డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ, జన్‌ధన్, ఆధార్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు సాధ్యమయ్యాయి. టెలికం టెక్నాలజీ భారత్‌లో కేవలం శక్తి మాధ్యమం మాత్రమేకాదు సాధికారతకు సోపానం. ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 85 కోట్లకు పెరిగింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో మొత్తంగా 25 లక్షల కి.మీ.ల ఆప్టికల్ ఫైబర్ వేశాం. త్వరలో వంద 5జీ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తాం. దేశీయ అవసరాల తీర్చేలా 5జీ అప్లికేషన్లను ఇవి అభివృద్ధిచేస్తాయి. దేశంలో 5జీ సేవలు మొదలైన 120 రోజుల్లోనే 125 నగరాలకు విస్తరింపజేశాం. ఈ దశాబ్దం భారత సాంకేతికదశాబ్దం(టెక్‌ఏడ్)’ అని మోదీ అభివర్ణించారు. -
భారత్‌లో బ్లాక్‌బెర్రీ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత సాఫ్ట్వేర్, సర్వీసెస్ అందిస్తున్న కెనడా సంస్థ బ్లాక్‌బెర్రీ భారత్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. 2023 చివరి నాటికి కెనడా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బెర్రీ ఐవోటీ విభాగానికి రెండవ అతిపెద్ద కేంద్రంగా ఇది అవతరిస్తుందని వెల్లడించింది. ఆ సమయానికి ఇక్కడ 100 మందికి పైగా ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. సాఫ్ట్వేర్ ద్వారా నియంత్రించగలిగే తదుపరి తరం వాహనాల అభివృద్ధి, ఐవోటీ పరిశ్రమలో ఆధునిక ఆవిష్కరణలు లక్ష్యంగా ఈ కేంద్రం బ్లాక్‌బెర్రీ రూపొందించిన క్యూఎన్ఎక్స్, ఐవీ ఉత్పాదనలపై పనిచేస్తుంది. ఆవిష్కరణలు, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ బాధ్యతలను హైదరాబాద్ బృందం చేపడుతుంది. ‘నైపుణ్యాలు, ఆవిష్కరణలలో బ్లాక్‌బెర్రీ కొనసాగిస్తున్న పెట్టుబడికి ఈ రోజు మరొక మైలురాయి. ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ ఆవిష్కర్తలకు నిలయంగా భారత ప్రాముఖ్యతను సూచిస్తుంది. ప్రధానంగా ఆటోమొబైల్ రంగంలో ఐవోటీ సాప్ట్వేర్ లీడర్‌గా వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తాం’ అని బ్లాక్‌బెర్రీ ఐవోటీ ప్రెసిడెంట్ మ్యాటిస్ ఎరిక్సన్ తెలిపారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టెల్లాంటిస్, బీఎండబ్లు్య, బాష్, ఫోర్డ్, జీఎం, హోండా, మెర్సిడెస్ బెంజ్, టయోటా, ఫోక్స్‌వ్యాగన్ వంటి సంస్థలు బ్లాక్‌బెర్రీ క్లయింట్లుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 21.5 కోట్ల వాహనాల్లో బ్లాక్‌బెర్రీ క్యూఎన్ఎక్స్ వినియోగిస్తున్నారు. -
బ్లాక్‌చెయిన్ స్టార్టప్‌లకు అండగా జీఎంఆర్ ఇన్నోవెక్స్!
న్యూఢిల్లీ: బ్లాక్‌చెయిన్ విభాగంలో స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్‌లో భాగమైన జీఎంఆర్ ఇన్నోవెక్స్ తాజాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేసింది. విమానాశ్రయాలు, అనుబంధ వ్యాపారాల్లో బ్లాక్ చెయిన్ సాంకేతికత వినియోగానికి అవకాశాలను అధ్యయనం చేసేందుకు ఐడియాల్యాబ్స్, పాలిగాన్, కాయిన్ఎర్త్, ఇండియా బ్లాక్‌చెయిన్ ఫోరం, వెరోయిన్స్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాపార దిగ్గజాలు, పరిశ్రమ నిపుణులు, టెక్నాలజీ భాగస్వాముల సహాయంతో జీఎంఆర్ ఇన్నోవెక్స్–బ్లాక్‌చెయిన్ సీవోఈ .. అంకుర సంస్థలను గుర్తించి, అవి వృద్ధి చెందేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తుందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈడీ (సౌత్) ఎస్జీకే కిషోర్ తెలిపారు. -
ఓపెన్‌బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
మాదాపూర్: పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లో జాన్సన్ కంట్రోల్‌కి చెందిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తయారీ రంగానికి హైదరాబాద్ అడ్డాగా మారిందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ–హబ్, టీ–సెల్ హైదరాబాద్‌లో ఉన్నాయని, ఇమేజ్ టవర్స్ సైతం ఇక్కడే నిర్మిస్తున్నామని తెలిపారు. హెదరాబాద్కు వస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌లో కార్యకలాపాలు విస్తరించిన జాన్సన్ కంట్రోల్ వీడియో సర్వైలెన్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయనుందని కేటీఆర్ తెలిపారు. ఈ సెంటర్లో 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వెల్లడించారు. జాన్సన్ కంట్రోల్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విజయ్‌శంకరన్ మాట్లాడుతూ ఈ ఇన్నోవేషన్ సెంటర్ బిల్డింగ్ టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలను పెంపొందించే విధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ జయేశ్‌రంజన్, జాన్సన్ కంట్రోల్ ప్రతినిధులు డేవ్ పుల్లింగ్, గోపాల్ పారిపల్లి, తజ్మీన్ పిరానీ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కి వస్తున్న మరో అంతర్జాతీయ సంస్థ
ఫార్మా, ఎయిరోస్పేస్, ఐటీ, క్లౌడ్ స్టోరేజీ రంగాలకు హబ్‌గా మారుతోన్న హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ఆస్ట్రేలియా టెలికాం దిగ్గజం టెల్ స్ట్రా ఇండియాలో ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. అందుకు వేదికగా హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఫ్యూచర్ టెక్నాలజీపై ఫోకస్ టెల్ స్ట్రా సంస్థ హైదరాబాద్‌లో ప్రారంభించబోయే గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), 5జీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై పని చేస్తుంది. టెలికాం, ఇంటర్నెట్ రంగంలో వస్తోన్న నూతన మార్పులను టెక్నాలజిస్టులు పూర్తిగా ఉపయోగించుకోవడంతో పాటు సరికొత్త ఆవిష్కరణలకు ఈ సెంటర్ వేదికగా మారనుంది. టెలికాం రంగానికి సంబంధించి స్థానికంగా ఉన్న సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు రానున్నాయి. హైదరాబాద్ సెంటర్లో టెల్ స్ట్రా సంస్థ హైదరాబాద్‌లో నెలకొల్పబోయే క్యాంపస్‌ను స్పెషలైజ్డ్ హై పెర్ఫార్మెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ (హెచ్పీఎస్ఈ)గా రూపుదిద్దనున్నారు. టెలికాం సాఫ్ట్వేర్కి సంబంధించి కన్సుమర్ బేస్డ్ డీప్ టెక్నాలజీ ఆవిష్కరణలు ఇక్కడ జరిగే విధంగా హైదరాబాద్ క్యాంపస్ ఉండబోతుంది. ‘త్వరలో తాము ప్రారంభించే ఇన్నోవేషన్ సెంటర్లు టెలికాం రంగంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయని టెల్ స్ట్రా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్టీ అరుణ్‌కుమార్ తెలిపారు. భారీగా విస్తరణ టెలికాం దిగ్గజం టెల్ స్ట్రా సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా తొలిసారిగా ఆస్ట్రేలియాకి బయట బెంగళూరులో గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్‌ని 2019లో ప్రారంభించింది. రెండేళ కిందట రెండు వందల మందితో ప్రారంభమైన బెంగళూరు క్యాంపస్‌లో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి చేరుకుంది. ఇప్పుడు తొలి ఇన్నెవేషన్ సెంటర్‌ను మించేలా పుణే, హైదరాబాద్‌లలో మరో రెండు క్యాపబులిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బెంగళూరు, పూణే, హైదరాబాద్‌లలో కలిపి మొత్తంగా లక్ష చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించాలని టెల్ స్ట్రా లక్క్ష్యంగా పెట్టుకుంది. చదవండి: అమెజాన్ భారీ నియామకాలు -
హైదరాబాద్‌లో సీఐఐ స్టార్టప్స్ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) హైదరాబాద్‌లో ఔత్సాహికపారిశ్రామిక వేత్తలు, స్టార్టప్స్ కోసం ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో స్టార్టప్స్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ కేంద్రం పని చేస్తుందని, ఏప్రిల్ నుంచి ఈ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సీఐఐ మంగళవారం తెలియజేసింది. సీఐఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను తెలంగాణ ప్రభుత్వం, ఇన్ఫోసిస్ కో–ఫౌండర్, సీఐఐ నేషనల్ స్టార్టప్ కౌన్సిల్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్‌కు చెందిన ప్రతీక్ష చారిటబుల్ ట్రస్ట్‌లు సపోర్ట్ చేస్తున్నాయి. వినూత్న ఆలోచనలు, స్టార్టప్స్‌కు మెంటారింగ్, అవకాశాలు, వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక ప్రోత్సాహం అందించడమే ఈ సెంటర్ ప్రధాన లక్ష్యమని సీఐఐ తెలియజేసింది. -
హైదరాబాద్‌లో ఫెనటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైసెన్స్డ్ స్పోర్ట్స్ మర్చండైస్ విక్రయంలో ఉన్న ఫెనటిక్స్ భారత్‌లో టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ వద్ద దీనిని నెలకొల్పింది. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ నుంచి గతేడాది పొందిన సుమారు రూ.6,500 కోట్ల పెట్టుబడితో చేపట్టిన విస్తరణలో భాగంగానే భారత్‌లో ప్రవేశించామని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మ్యాట్ మాడ్రిగల్ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు రమణ తూము, సతీష్ ఉమాలే, జాన్ బెయిలీతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిపుణులైన మానవ వనరులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ కేంద్రం సాంకేతికంగా సంస్థకు మద్దతు ఇస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 6,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని వివరించారు. కంపెనీ ఏటా రూ.14,000 కోట్ల టర్నోవరు నమోదు చేస్తోంది. -
గేమింగ్ పరిశ్రమకు దన్ను!
• పన్ను రారుుతీలున్నాయ్ • 27 వేల చ.అ.ల్లో ఇన్నోవేషన్ సెంటర్ • తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యానిమేషన్, గేమింగ్ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు చెప్పారు. అందుకే గేమింగ్ కంపెనీలకు రారుుతీలు, మూలధన పెట్టుబడుల్లో సబ్సిడీ, స్టాంప్ డ్యూటీలో మినహారుుంపు, అద్దె, వినోద పన్నులోనూ రారుుతీలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణలో 27 వేల చ.అ.ల్లో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేశామని.. ఇందులో 10 కంపెనీలు, 200 మంది డెవలపర్లు కూడా పనిచేస్తున్నారని వివరించారు. శుక్రవారమిక్కడ ‘నాస్కాం గేమ్ డెవలపర్స్ సమావేశం-2016’ను కేటీఆర్ ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో గేమింగ్ కంపెనీలు, డెవలపర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో గేమింగ్ పరిశ్రమ 150 మిలియన్ డాలర్లుగా ఉందని.. ఏటా 40 శాతం వృద్ధి చెందుతోందని నాస్కాం గౌరవ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. నిపుణుల కొరత, నిధుల సమీకరణ వంటివి గేమింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లని.. అరుుతే ఇప్పుడిప్పుడే మార్పు వస్తుందని పేర్కొన్నారు. గేమింగ్, యానిమేషన్ కోర్సులు, ప్రత్యేక శిక్షణ సంస్థలు, విద్యాలయాలు, ఇంక్యుబేషన్ సెంటర్లూ ప్రారంభమయ్యాయని వివరించారు. ప్రస్తుతం దేశంలో 1.6 బిలియన్ల గేమింగ్ యాప్స్ డౌన్‌లోడ్‌స జరిగాయని.. ఏటా 58 శాతం వృద్ధితో 2020 నాటికి 5.3 బిలియన్లకు చేరే అవకాశముందని నాస్కాం గేమ్ ఫోరం చైర్మన్ రాజేశ్ రావ్ అంచనా వేశారు. దేశంలో 80% కంపెనీలు ఉచితంగానే యాప్స్, గేమ్స్‌ను అందిస్తున్నాయని.. లెవల్స్, పవర్స్‌ను బట్టి కొంత మేర చార్జీ చేస్తుంటాయని చెప్పారు. అరుుతే దేశంలో 80 శాతం కంపెనీలకు ఆదాయం ప్రకటన ద్వారా వస్తున్నదేనని వివరించారు.