గేమింగ్ పరిశ్రమకు దన్ను!
• పన్ను రారుుతీలున్నాయ్
• 27 వేల చ.అ.ల్లో ఇన్నోవేషన్ సెంటర్
• తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యానిమేషన్, గేమింగ్ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు చెప్పారు. అందుకే గేమింగ్ కంపెనీలకు రారుుతీలు, మూలధన పెట్టుబడుల్లో సబ్సిడీ, స్టాంప్ డ్యూటీలో మినహారుుంపు, అద్దె, వినోద పన్నులోనూ రారుుతీలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణలో 27 వేల చ.అ.ల్లో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేశామని.. ఇందులో 10 కంపెనీలు, 200 మంది డెవలపర్లు కూడా పనిచేస్తున్నారని వివరించారు. శుక్రవారమిక్కడ ‘నాస్కాం గేమ్ డెవలపర్స్ సమావేశం-2016’ను కేటీఆర్ ప్రారంభించారు.
3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో గేమింగ్ కంపెనీలు, డెవలపర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో గేమింగ్ పరిశ్రమ 150 మిలియన్ డాలర్లుగా ఉందని.. ఏటా 40 శాతం వృద్ధి చెందుతోందని నాస్కాం గౌరవ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. నిపుణుల కొరత, నిధుల సమీకరణ వంటివి గేమింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లని.. అరుుతే ఇప్పుడిప్పుడే మార్పు వస్తుందని పేర్కొన్నారు. గేమింగ్, యానిమేషన్ కోర్సులు, ప్రత్యేక శిక్షణ సంస్థలు, విద్యాలయాలు, ఇంక్యుబేషన్ సెంటర్లూ ప్రారంభమయ్యాయని వివరించారు. ప్రస్తుతం దేశంలో 1.6 బిలియన్ల గేమింగ్ యాప్స్ డౌన్‌లోడ్‌స జరిగాయని.. ఏటా 58 శాతం వృద్ధితో 2020 నాటికి 5.3 బిలియన్లకు చేరే అవకాశముందని నాస్కాం గేమ్ ఫోరం చైర్మన్ రాజేశ్ రావ్ అంచనా వేశారు.
దేశంలో 80% కంపెనీలు ఉచితంగానే యాప్స్, గేమ్స్‌ను అందిస్తున్నాయని.. లెవల్స్, పవర్స్‌ను బట్టి కొంత మేర చార్జీ చేస్తుంటాయని చెప్పారు. అరుుతే దేశంలో 80 శాతం కంపెనీలకు ఆదాయం ప్రకటన ద్వారా వస్తున్నదేనని వివరించారు.