
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) హైదరాబాద్‌లో ఔత్సాహికపారిశ్రామిక వేత్తలు, స్టార్టప్స్ కోసం ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో స్టార్టప్స్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ కేంద్రం పని చేస్తుందని, ఏప్రిల్ నుంచి ఈ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సీఐఐ మంగళవారం తెలియజేసింది. సీఐఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను తెలంగాణ ప్రభుత్వం, ఇన్ఫోసిస్ కో–ఫౌండర్, సీఐఐ నేషనల్ స్టార్టప్ కౌన్సిల్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్‌కు చెందిన ప్రతీక్ష చారిటబుల్ ట్రస్ట్‌లు సపోర్ట్ చేస్తున్నాయి. వినూత్న ఆలోచనలు, స్టార్టప్స్‌కు మెంటారింగ్, అవకాశాలు, వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక ప్రోత్సాహం అందించడమే ఈ సెంటర్ ప్రధాన లక్ష్యమని సీఐఐ తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment