న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెలికం సేవలు ప్రవేశపెట్టే దిశగా జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్, ఎన్‌టీటీ కమ్యూనికేషన్స్‌తో ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ చేతులు కలిపింది. ప్రధానంగా స్మార్ట్ సిటీలకు అవసరమయ్యే సొల్యూషన్స్‌ను రూపొందించే క్రమంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.
పోటీ సంస్థలు 4జీ సర్వీసుల ద్వారా ఆదాయాలు ఆర్జించే పనిలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో 5జీ సేవలకు సంబంధించి దిగ్గజ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపుతున్నాయని ఆయన వివరించారు. టెలికం మంత్రి మనోజ్ సిన్హా చొరవతో ఈ ఒప్పందం కుదిరినట్లు శ్రీవాస్తవ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment