Flipkart Walmart Deal: Soft Bank CEO Confirms Walmart is Purchasing Flipkart - Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్‌ మార్కెట్‌లో అతిపెద్ద డీల్‌

Published Wed, May 9 2018 2:58 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Done Deal! Softbank CEO Confirms Walmart Is Purchasing Flipkart - Sakshi

ముంబై : గత ఎన్నో రోజులుగా ఈ-కామర్స్‌ మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్న ఫ్లిప్‌కార్ట్‌ -వాల్‌మార్ట్‌ అతిపెద్ద డీల్‌ ఖరారైపోయింది. ఫ్లిప్‌కార్ట్‌ అధికారికంగా నేటితో వాల్‌మార్ట్‌ సొంతమైపోయింది. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను,16 బిలియన్‌ డాలర్లకు తాను కొనుగోలు చేయబోతున్నట్టు వాల్‌మార్ట్‌ బుధవారం ప్రకటించింది. మొత్తంగా ఫ్లిప్‌కార్ట్‌ వాల్యుయేషన్‌ 20 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంది. ఈ ఏడాది చివరి వరకు డీల్‌ను పూర్తి చేయనున్నట్టు వాల్‌మార్ట్‌ తెలిపింది. వాల్‌మార్ట్‌ అధికారికంగా ప్రకటించడానికి ముందు సాఫ్ట్‌బ్యాంకు సీఈవో మయవోషి సన్‌ కూడా ఈ డీల్‌ను ధృవీకరించారు.

ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్‌ కొనుగోలు ఇదే కావడం విశేషం. అమెరికాకు చెందిన ఈ కంపెనీకి అతిపెద్ద డీల్‌ కూడా ఇదే. దీంతో 2016 సెప్టెంబర్‌ నుంచి ప్రారంభమైన కొనుగోలు చర్చలకు వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌లు నేటితో ముగింపు పలికాయి. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన రిటైల్‌ మార్కెట్లలో భారత్‌ ఒకటిగా ఉందని వాల్‌మార్ట్‌ అధ్యక్షుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆపీసర్‌ డౌ మెక్‌మిల్లన్‌ అన్నారు, తమ పెట్టుబడులు భారత కస్టమర్లకు నాణ్యత కలిగి ఉత్పత్తులను, సరసమైన ధరల్లో అందించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా కొత్త ఉద్యోగాలు కల్పన, చిన్న సప్లయర్లకు, వ్యవసాయదారులకు, మహిళా వ్యాపారవేత్తలకు కొత్త కొత్త అవకాశాలు అందనున్నాయని తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న 20 శాతం వాటాను విక్రయించేసి ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న సాఫ్ట్‌బ్యాంకు పూర్తిగా ఈ ఈ-కామర్స్‌ దిగ్గజం నుంచి వైదొలుగుతోంది. సాఫ్ట్‌బ్యాంక్‌తో పాటు అస్సెల్‌, నాస్పర్స్‌లు కూడా పూర్తిగా ఫ్లిప్‌కార్ట్‌ నుంచి తప్పుకుంటున్నాయి. టెన్సెంట్‌, టైగర్‌ గ్లోబల్‌, బిన్సీ బన్సాల్‌, మైక్రోసాఫ్ట్‌లు మాత్రం కొంత వాటాను కలిగి ఉంటున్నాయి. వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌ చేసుకున్న ఈ డీల్‌ దేశీయ ఈ-కామర్స్‌ మార్కెట్‌లో సంచలనంగా మారింది. భారత మార్కెట్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య పోటీ ఈ డీల్‌తో మరింత తీవ్రతరంగా మారనుందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు పడబోయే ఈ పోటీ కేవలం సప్లయి చైన్‌లో ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ పెరగడమే కాకుండా.. పెద్ద మొత్తంలో ఉద్యోగాలను సృష్టించనుంది. అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్‌కు తక్కువ ధరలకు, విభిన్నమైన ఉత్పత్తులను ఆఫర్‌ చేస్తూ... వినియోగదారులను ఆకట్టుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా మంచి అనుభవముంది. దీంతో అమెజాన్‌కు, వాల్‌మార్ట్‌కు రెండింటికీ ధరల పరంగా తీవ్ర పోటీ నెలకొననుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement