సాక్షి, ముంబై: కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా ఇ-కామర్స్ మార్కెట్లు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి చాలా కష్టపడుతున్నాయి. ప్రారంభ రోజుల్లో నిత్యావసరాల సరఫరాపై స్పష్టత లేకపోవడంతో, ఎక్కువ మంది గిడ్డంగులను మూసివేయవలసి వచ్చింది. అలాగే డెలివరీల సమయంలో ఉద్యోగులకు కూడా పెద్ద కొరత ఏర్పడింది. చాలా ఆర్డర్లను నిరాకరించాయి. వస్తువులను రవాణా చేయలేకపోయిన ఫలితంగా చాలా ఇ-కామర్స్ కంపెనీ గిడ్డంగుల్లో నిల్వలు పేరుకు పోయాయి. అయితే తాజాగా ఇ-కామర్స్ మార్కెట్, స్నాప్‌డీల్ 6-10 రోజులలోపు అవసరమైనవాటిని పంపిణీ చేస్తామని వినియోగదారులకు హామీ ఇస్తోంది. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి, అత్యవసరాలను స్థానికంగా (నగరంలో మాత్రమే) పంపిణీ చేయడం ప్రారంభించినట్లు స్నాప్‌డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు కమ్యూనికేషన్స్) రజనీష్ వాహి చెప్పారు. ప్రారంభంలో మూసివేయాల్సి వచ్చిందని, కాని వేగంగా తిరిగి సేవల్లోకి ప్రవేశించామన్నారు. అయితే వివిధ నగరాల మధ్య పంపిణీ కాకుండా, ఇంట్రా-సిటీ మాత్రమే తమ సేవల అందిస్తున్నామని అందుకే వేగంగా బట్వాడా చేయగలుగుతున్నామని ఆయన చెప్పారు.
గత 10 రోజులలో స్నాప్‌డీల్ స్థానిక ధాన్యం మార్కెట్లలోని డీలర్లతో, ఎఫ్‌ఎంసిజి హోల్‌సేల్ వ్యాపారులతో (వారిలో చాలా మందికి స్టాక్ ఉంది, కాని వాటిని మూసివేయవలసి వచ్చింది) ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితులలో వైద్య పరికరాలు కూడా చాలా అవసరం కాబట్టి సంబంధిత డీలర్లతో కూడా ఒప్పందం చేసుకున్నామన్నారు. నిత్యావసరాల సేకరణపై మాత్రమే దృష్టి పెట్టామని తమ వ్యాపార బృందాన్ని కోరామని వాహి వివరించారు. కేవలం పది రోజుల్లో తమ సామర్థ్యాన్ని పెంచుకున్నామని, సాధారణ పరిస్థితులలో ఇందుకు ఐదు-ఆరు నెలలు పట్టేదని ఆయన చెప్పారు. అలాగే ఈ సంక్షోభ సమయం దేశవ్యాప్తంగా అనేక చిన్న అమ్మకందారులు, చిన్న చిన్న గిడ్డంగులున్న దుకాణాదారులు ప్రయోజనాలకు ఉపయోగపడిందని ఆయన చెప్పారు.
మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో అమలవుతున్న లాక్ డౌన్ ఇంటికే పరిమితమైన తమ వినియోగదారులకు ఇ-కామర్స్ సేవలు అందించే క్రమంలో మరో అడుగు ముందు కేశామని. అన్ని వనరులను సమీకిస్తూ అవసరమైన అత్యవసర సామాగ్రిని పంపిణీ చేయడానికి, డెలివరీ సామర్థ్యాన్ని పెంచుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని సీనియర్ ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి వెల్లడించడం గమనార్హం. చదవండి : కరోనా కాటు : 36 వేల మంది ఉద్యోగులు సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment