
న్యూఢిల్లీ: ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో (ఏఎమ్‌టీ) కూడిన కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సన్ కొత్త వేరియంట్లను టాటా మోటార్స్ మంగళవారం విడుదల చేసింది. 1.2 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ వెర్షన్ నూతన హైపర్‌డ్రైవ్ సెల్ఫ్ షిఫ్ట్ గేర్(ఎస్–ఎస్‌జీ) ఎక్స్‌ఎమ్‌ఏ వేరియంట్ (ఢిల్లీ ఎక్స్–షోరూమ్) ధర రూ.7.50 లక్షలుగా నిర్ణయించింది.
1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ వెర్షన్ ధర రూ.8.53 లక్షలుగా వెల్లడించింది. ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ కార్లకు భారత్‌లో డిమాండ్ పెరుగుతోందని కంపెనీ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పారీఖ్ చెప్పారు. టాటా మోటార్స్ అమ్మకాల్లో ఏఎమ్‌టీ విభాగానికి 25% వాటా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment